నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి పాఠశాల విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి టి. విజయ్ కుమార్ ఇంచార్జీ వైస్ చాన్సలర్
హైదరాబాద్: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి పాఠశాల విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి టి. విజయ్ కుమార్‌ను ఇంచార్జీ వైస్ చాన్సలర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, పూర్తి స్థాయి వీసీని నియమించేంతవరకు విజయ్‌కుమార్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.