incharge vice chancellor
-
ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త వీసీలను నియమించే వరకు ఇంఛార్జ్‌లే వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇంఛార్జ్ వీసీల వివరాలు: ఉస్మానియా యూనివర్సిటీ- అరవింద్ కుమార్ ఐఏఎస్ జేఎన్ టీయూహెచ్ - జయేశ్ రంజన్, ఐఏఎస్ కాకతీయ యూనివర్సిటీ-డాక్టర్ బీ జనార్దన్ రెడ్డి, ఐఏఎస్ తెలంగాణ యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్, ఐఏఎస్ పాలమూరు యూనివర్సిటీ-రాహుల్ బొజ్జా, ఐఏఎస్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ-అరవింద్ కుమార్, ఐఏఎస్ పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్ ఐఏఎస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం-సి. పార్థసారథి, ఐఏఎస్ -
మహాత్మాగాంధీ వర్సిటీ ఇంచార్జీ వీసీ నియామకం
హైదరాబాద్: నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి పాఠశాల విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి టి. విజయ్ కుమార్‌ను ఇంచార్జీ వైస్ చాన్సలర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, పూర్తి స్థాయి వీసీని నియమించేంతవరకు విజయ్‌కుమార్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
'ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తాం'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తమకివ్వడం సంతోషంగా ఉందని జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తమకప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు సిబ్బంది ఎక్కువగా అవసరమవుతారని వీసీ తెలిపారు. దీని కోసం ఎంసెట్ కన్వీనర్‌ను, ఎంసెట్ కమిటీని నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంతో ప్రస్తుతం ఉన్న వివాదం నేపథ్యంలో సొంతంగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో - ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనున్నాయి.