ఎంసెట్ నిర్వహణకు కన్వీనర్ ను, ఎంసెట్ కమిటీని నియమించుకోవాల్సిన అవసరం ఉందని జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీ ప్రభాకర్ తెలిపారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తమకివ్వడం సంతోషంగా ఉందని జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తమకప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అలాగే పరీక్షల నిర్వహణకు సిబ్బంది ఎక్కువగా అవసరమవుతారని వీసీ తెలిపారు. దీని కోసం ఎంసెట్ కన్వీనర్ను, ఎంసెట్ కమిటీని నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంతో ప్రస్తుతం ఉన్న వివాదం నేపథ్యంలో సొంతంగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో - ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనున్నాయి.