jntu kakinada
-
ఇక్కడ సీటొస్తే.. విదేశాల్లో చదవొచ్చు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డాలర్ల డ్రీమ్ ఇప్పటి యువత కల. అందుకోసం విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలని యువత భావిస్తోంది. ఈ కలను సాకారం చేసుకోవాలంటే.. పొరుగు దేశం వెళ్లి ఏ కోర్సు చేయాలన్నా ఆ దేశం నుంచి వీసా పొందటం, విదేశీ యూనివర్సిటీలలో సీటు పొందడం ఇలా ఎన్నింటినో దాటాలి. ఇలాంటి వ్యయప్రయాసలకు చెక్ పెట్టి విదేశాల్లో ఎంఎస్ చేయాలన్న కలను సాకారం చేస్తోంది కాకినాడలోని జేఎన్టీయూ. ఇప్పటికే స్వీడన్లో బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ, యూఎస్‌లో నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని పలు కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ, ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది. 45 దేశాల యూనివర్సిటీలతో.. ఇటీవల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ ప్లస్ హోదాను సాధించిన జేఎన్టీయూకే (కాకినాడ) విదేశీ విద్య కోసం 45 దేశాల్లోని వివిధ యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌లో సేవలందించిన డాక్టర్ షేక్ సులేమాన్, విదేశీ సేవల కోసం ఫారిన్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.శివనాగరాజును నియమించుకుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వీసా నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వరకు అంతా జేఎన్టీయూకే చూసుకుంటోంది. జేఎన్టీయూకే అందిస్తున్న కోర్సులు స్వీడన్ బ్లేకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ విభాగాల్లో 20 సీట్ల చొప్పున 60 సీట్లతో జేఎన్టీయూకే ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సు వ్యవధి నాలుగు లేదా ఆరు సంవత్సరాలు. నాలుగు సంవత్సరాల కోర్సులో చేరితే మూడేళ్లు జేఎన్టీయూ (కాకినాడ)లోను, ఒక ఏడాది స్వీడన్లో అభ్యసిస్తే డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది. అదే మూడేళ్లు ఇక్కడ మరో మూడేళ్లు స్వీడన్లో అభ్యసిస్తే డ్యూయల్ డిగ్రీ అంటే ఎంఎస్ అర్హత గల సర్టిఫికెట్ అందజేస్తారు. ఫీజు జేఎన్టీయూకేలో ఏడాదికి రూ.1.50 లక్షలు, స్వీడన్లో ఏడాదికి సుమారు రూ.7 లక్షలు వరకు చెల్లించాలి. యూఎస్‌లోని నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో ఈసీఈ విభాగంలో నాలుగు సంవత్సరాల కోర్సుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఈ కోర్సును మూడేళ్లపాటు జేఎన్టీయూకేలోను, ఒక ఏడాది యూఎస్‌లోను అభ్యసించాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేయడానికి దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. జర్మనీలో స్టెబిన్సీ యూనివర్సిటీలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ మాస్టర్ ప్రోగ్రాం రెండేళ్ల కాల వ్యవధితో అందించేందుకు జేఎన్టీయూకే ఒప్పందం చేసుకుంది. బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. స్టెబిన్సీ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతతో సీటు సాధిస్తే ఉచిత విద్యతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రవేశాలు ఇలా.. ఈఏపీ సెట్ లేదా జేఈఈ, టీఎస్ ఎంసెట్‌లో అర్హత సాధించాలి. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ ఉత్తీర్ణులై కనీసం 60 శాతం మార్కులు పొందాలి. వివరాలకు జేఎన్టీయూకే ఫారిన్ వర్సిటీ రిలేషన్స్ డైరెక్టర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. విదేశీ ఒప్పందాలకు ప్రణాళిక ఇప్పటికే అందిస్తున్న కోర్సులకు స్పందన బాగుంది. ఇటీవల న్యాక్ ఏ ప్లస్ హోదా రావడంతో 45 దేశాల్లో పేరొందిన యూనివర్సిటీలతో ఒప్పందాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జేఎన్టీయూకేలో మూడేళ్లు అభ్యసించి నాలుగో ఏడాది విదేశీ కోర్సు చదవచ్చు. ఒప్పందం ప్రకారం విదేశీ యూనివర్సిటీలే మన విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తాయి. – జీవీఆర్ ప్రసాదరాజు, వీసీ, జేఎన్టీయూకే -
జేఎన్టీయూ ‘కే’క!.. ఏపీలో న్యాక్–ఏ ప్లస్ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్సిటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాంకేతిక విద్యలో కాకినాడ జేఎన్టీయూ రాష్ట్రానికే మణిహారంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న పలు వర్సిటీల సరసన జేఎన్టీయూకేకు సముచిత స్థానం దక్కింది. యూనివర్సిటీ ఏర్పాటైన 12 ఏళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు జేఎన్టీయూకేలో పర్యటించింది. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనం, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, సాంకేతిక అంశాల్లో ప్రగతిని సమీక్షించిన అనంతరం న్యాక్ ఏ ప్లస్ హోదా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఇవీ ప్రయోజనాలు ►న్యాక్ ఏ ప్లస్ హోదాతో యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ►కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. వర్సిటీలో ల్యాబ్‌ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, పరిశోధనల కోసం రూ.100 కోట్లు వస్తాయని అంచనా. ►ఈ వర్సిటీలో విద్యనభ్యసించేందుకు విదేశీ వర్సిటీల నుంచి విద్యార్థులు క్యూ కట్టనున్నారు. స్విట్జర్లాండ్, స్వీడన్ దేశాల యూనివర్సిటీలు ఇప్పటికే జేఎన్టీయుకేతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల ఒక అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం కూడా వచ్చి పరిశీలించి వెళ్లింది. ►ఇక్కడ చదువుకునే విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి. ►వర్సిటీలో పరిశోధనల కోసం కేంద్ర సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ, డీఎస్టీ సైన్స్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు లభిస్తాయి. వైఎస్సార్ చొరవతో యూనివర్సిటీగా.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా 1946లో కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1972లో కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోకి వచ్చాయి. ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలకు 2008, ఆగస్టు 20న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికతతో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని జేఎన్‌టీయూకేగా మార్పు చేశారు. కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని కూడా ఈ వర్సిటీతో అనుసంధానించారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 162 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసరావుపేట ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఉన్నాయి. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి యూనివర్సిటీకి ఒక మైలురాయి న్యాక్ 3.4 స్కోర్‌తో ఏ ప్లస్ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో విద్య, పరిశోధనలు, ఉపాధి నిమిత్తం ఒప్పందాలు పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు యూనివర్సిటీకి ఒక మైలు రాయి. ఇప్పటికే సాంకేతిక వర్సిటీగా రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉన్న జేఎన్టీయూకే స్థాయిని ఈ హోదా మరింత పెంచింది. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వైస్ చాన్సలర్, జేఎన్టీయూకే -
ఎగుమతుల హబ్‌గా ఏపీ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విదేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. సముద్రతీర ప్రాంతంతో ఏపీ ఎక్స్పోర్ట్ హబ్‌గా నిలిచిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మెరైన్, రైస్, ఫ్రూట్స్ వంటి ఎగుమతుల్లో ద్విగుణీకృతమైన ప్రగతిని ఏపీ సాధిస్తోందని.. విదేశీ వాణిజ్యానికి అన్ని అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయని ఆమె కొనియాడారు. కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన ప్రతిష్టాత్మకమైన ఐఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్) మూడో క్యాంపస్‌ను శుక్రవారం కేంద్ర ఆర్థిక, వాణిజ్యశాఖా మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయల్ ప్రారంభించారు. చదవండి: పంజాబ్‌కు ఆదర్శంగా ఏపీ ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఈ క్యాంపస్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్‌గా కాకినాడ దేశ ఆర్థికవ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుంద న్నారు. విశాలమైన సముద్రతీరం ఉన్న ఏపీలో మెరైన్ ఉత్పత్తుల ప్రాముఖ్యతను అర్థంచేసుకుని, ఇక్కడి ఎగుమతిదారులు ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకున్నారన్నారు. అదే ఈ రోజు విదేశీ వాణిజ్యంలో రాష్ట్రాన్ని ముందువరసలో నిలిపిం దని ఆమె ప్రశంసించారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లా ఒక్కో విశిష్ట ఉత్పత్తికి కేంద్రంగా ఉందన్నారు. ఐఐఎఫ్‌టీ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా దేశ, విదేశాల్లో జరుగుతున్న వాణిజ్యాన్ని ఆకళింపు చేసుకుని వాటిపై పూర్తి పట్టు సాధించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విభజన అనంతరం రాష్ట్ర సత్వరాభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి చొరవతో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐటీ, ఐఐఎఫ్‌టీ, ఐఐటీ తదితర పది ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు అయ్యాయని సీతారామన్ వెల్లడించారు. రాజకీయ సుస్థిరతతోనే ఆర్థిక శక్తిగా భారత్ మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ వాణిజ్యానికి భవిష్యత్తులో మరింతగా అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే నిపుణులైన మానవ వనరులు అవసరమన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరత, సమష్టి కృషి ఫలితంగానే ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఐఐఎఫ్‌టీ ఏర్పాటుతో కాకినాడ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. దేశీయ ఎగుమతుల్లో 5.8% (దాదాపు 16.8 బిలియన్ యూఎస్ డాలర్లు) ఏపీ నుంచి జరుగుతున్నాయన్నారు. గతంలో 20వ స్థానంలో ఉన్న ఈ ఎగుమతులు 2021 నాటికి 9వ స్థానానికి చేరుకున్నాయన్నారు. భారత్ ఆక్వాహబ్‌గా ఏపీ గుర్తింపు సాధించిందన్నారు. రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు వంగా గీత, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మార్గాని భరత్, జీవీఎల్ నరసింహారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఐఐఎఫ్‌టీ వీసీ ప్రొ. మనోజ్‌పంత్ తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూకేలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి షెడ్యూల్
సాక్షి, అమరావతి: జేఎన్టీయూ (కాకినాడ)లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ల్లో స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.ఎల్.సుమలత సోమవారం తెలిపారు. ఈ సీట్ల కోసం ఈ నెల 20, 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు గేట్/జీప్యాట్/ఏపీపీజీఈసెట్/ఐసెట్‌లలో అర్హత సాధించి ఉండాలన్నారు. అంతేకాకుండా ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి అని చెప్పారు. ఈ నెల 20న జేఎన్టీయూకే సెనేట్ హాల్లో ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) కోర్సులకు, 21, 22 తేదీల్లో ఎంటెక్ కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్పాన్సర్షిప్ సర్టిఫికెట్, గేట్/జీప్యాట్/ ఏపీపీజీఈసెట్/ఐసెట్ 2021 హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలను https:// www. jntuk. edu. in/ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. -
ఫేక్ పీహెచ్డీ ఫ్యాకల్టీలదే హవా!
సాక్షి, కాకినాడ: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో నకిలీ పీహెచ్‌డీలతో విద్యాబోధన యథేచ్ఛగా కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్టీయూ (కాకినాడ) వర్సిటీ ఏపీలోని 8 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలో 180 అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఒకరిద్దరు చొప్పున ఎనిమిది జిల్లాల్లో సుమారు 200 మంది నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో విద్యాబోధన చేస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలో బోధించాలంటే పీహెచ్డీ తప్పనిసరి. గుర్తింపు పొందిన వర్సిటీల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థిని కళాశాలల్లో నియమిస్తే నెలకు రూ.90,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం ఇవ్వాలి. ఇంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ జీతానికి వచ్చే ఫేక్ పీహెచ్డీ అభ్యర్థులకు రూ.40 వేల వరకు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎక్కడివీ ఫేక్ పీహెచ్‌డీలు.. కొంతమంది అభ్యర్థులు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని వర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకుని నకిలీ పీహెచ్డీ పట్టా తెచ్చుకుంటున్నారు. తక్కువ జీతానికే పనిచేస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. వారు సైతం ఖర్చు తక్కువ అవుతుందని భావించి.. అతి తక్కువ జీతాలిస్తూ వీరిని ప్రోత్సహిస్తున్నారు. కీలక ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. అనుభవం లేని నకిలీ అధ్యాపకులు పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎడారిలో ఎండమావిలా మారింది. నిద్రమత్తులో వర్సిటీ యంత్రాంగం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీ అధికారులు ప్రతి ఏటా నిజ నిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నా.. నకిలీ పీహెచ్‌డీలపై దృష్టి సారించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో మచ్చుకు కొన్ని.. రాష్ట్రంలో నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు, నర్సాపురంలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే తంతు సాగుతోంది. దాదాపు 200 మంది వివిధ హోదాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నారని తెలుస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో కళాశాలల్లో పనిచేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిజనిర్ధారణ కమిటీలు తనిఖీ సైతం నిర్వహించాయి. – డాక్టర్ సుమలత, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(కే) ఫేక్ పీహెచ్‌డీలను గుర్తించాలి.. నకిలీ పీహెచ్డీ అభ్యర్థులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు పీహెచ్డీ పూర్తి చేసిన వారి డేటా వర్సిటీ వెబ్సైట్లలో ఉంచుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా పాటిస్తే పారదర్శకత పెరుగుతుంది. –డాక్టర్ జ్యోతిలాల్ నాయక్, విద్యావేత్త -
జేఎన్టీయూకే.. అండ అక్రమార్కులకే!
సాక్షి, కాకినాడ: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (కాకినాడ) పరిధిలోని అత్యధిక ఇంజనీరింగ్ కాలేజీల్లో బోగస్ అధ్యాపకులతో తంతు కానిచ్చేస్తున్నారు. ఇటీవల వర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 2,338 మంది అధ్యాపకులు ఒకటి కంటే ఎక్కువ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నట్టు తేలింది. దీనిపై వివరణ ఇవ్వాలని జేఎన్టీయూకే అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. రోజులు గడుస్తున్నా వాటికి వివరణ వచ్చిన దాఖలాలు లేవు. అధ్యాపకుల డబుల్, త్రిపుల్ యాక్షన్‌ను కట్టడి చేసేందుకు ‘ఆధార్ బేస్డ్ ఆన్లైన్ డేటా ఎంట్రీ యాప్’ను వర్సిటీ అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేదు. ఇదేం నిషేధం! రాష్ట్రంలోని 8 జిల్లాల్లో జేఎన్టీయూకే పరిధిలో 260 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వీటిలో వరుసగా రెండేళ్లు విద్యార్థుల ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకుని, తరువాతి ఏడాది అడ్మిషన్లకు అనుమతులిస్తున్నారు. గతంలో కంటే విద్యార్థుల ప్రవేశాలు 25 శాతం తగ్గితే, ఎంసెట్ ఐచ్చికాల నమోదుకు అనుమతించరు. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిబంధన పెట్టింది. ఉన్నత విద్యామండలి అలాంటి కళాశాలల వివరాలను గుర్తించి వర్సిటీలకు పంపింది. ఆ వివరాల ఆధారంగా జేఎన్టీయూకే నిర్ధారణ బృందం ఆ కళాశాలలను పరిశీలించి, అనేక లోపాలను గుర్తించి ఓ జాబితా తయారు చేసింది. దీని ప్రకారం 28 కళాశాలల్లో ఈసారి ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ ప్రవేశాలను నిషేధించారు. వర్సిటీ 78 కళాశాలల జాబితా పంపి, వాటిలో పకడ్బందీగా తనిఖీలు చేయాలని ఆదేశిస్తే.. తనిఖీ బృందాలు మాత్రం కొన్నేళ్లుగా అడ్మిషన్లు లేక కొట్టుమిట్టాడుతున్న కళాశాలలను ఎంచుకున్నాయి. వాటిపై చర్యలు తీసుకుంటున్నామని కలరింగ్ ఇచ్చాయి. భారీగా వసూళ్లు! కళాశాలల్లో తనిఖీలకు వెళ్లిన వర్సిటీ అధికారుల్లో కొందరు ఇంజనీరింగ్ కళాశాలల్లో అక్రమాలను సక్రమం చేసేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు నివేదిక ఇచ్చేందుకు తనిఖీ బృందంలోని అధికారులు ఒక్కో కళాశాల యాజమాన్యం నుంచి స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కళాశాలల్లో పీహెచ్డీ అర్హత గల అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రతి 15 మంది ఇన్‌టేక్ స్టూడెంట్లకు ఒక అధ్యాపకుడు, 1:2:6 నిష్పత్తి ప్రకారం ప్రతి సెక్షన్‌కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. చాలా కళాశాలలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పారదర్శకంగా తనిఖీలు ప్రమాణాలు పాటించని కళాశాలల్లో అడ్మిషన్లకు అనుమతులు నిలిపివేశాం. బోగస్ అధ్యాపకులను గుర్తించి ఆయా కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. ఇకపై ఇలా జరగకుండా నివారించేందుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ తీసుకొస్తున్నాం. తనిఖీల సమయంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేయిస్తాం. – డాక్టర్ సీహెచ్.సత్యనారాయణ, రిజిస్టార్, జేఎన్టీయూకే -
ఏపీ ఎంసెట్; నోటిఫికేషన్ వివరాలు
సాక్షి, కాకినాడ: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ వి.రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. గత ఏడాది ఏవైతే నిబంధనలు అమలు అయ్యాయో, అవే నిబంధనలు ఈ ఏడాది కొనసాగుతాయని తెలిపారు. అభ్యర్ధుల సంఖ్యను బట్టి ఏరోజు ఏ పరీక్షను నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. గతంలో కొనసాగించిన పరీక్షా కేంద్రాలనే ఈసారి కొనసాగిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయన్నారు. అభ్యర్ధుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ ఏడాది ప్రకాశం జిల్లా చిమకుర్తి, కృష్ణా జిల్లాలో తిరువూరు, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అదనంగా పరీక్షా కేంద్రాలు పెట్టినట్టు వెల్లడించారు. అత్యధింగా ఐదు రీజినల్ ఎగ్జామ్ సెంటర్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయని, విద్యార్ధులు సౌలభ్యం కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. (చదవండి: పై తరగతులకు పటిష్టమైన అడుగులు) ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీఎంసెట్– 2020 నోటిఫికేషన్ గురువారం వెలువడింది. సెట్ నిర్వహణ వర్సిటీ అయిన కాకినాడ జేఎన్టీయూ దీన్ని విడుదల చేసింది. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రి ఇంజనీరింగ్), బీటెక్ (ఫుడ్‌సైన్సు టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, డీఫార్మా కోర్సులలోకి ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈనెల 29వ తేదీనుంచి దరఖాస్తులను సమర్పించవచ్చు. మార్చి 29 చివరి గడువు. ఆలస్య రుసుము రూ.500లతో ఏప్రిల్ 5వరకు, రూ.1000తో ఏప్రిల్ 10వరకు, రూ.5వేలతో ఏప్రిల్ 15వరకు, రూ.10వేలతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 16నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి ప్రతి రోజూ రెండు సెషన్లలో కంప్యూటరాధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు రూ.500చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రెండింటికీ హాజరుకాగోరే అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎంసెట్‌కు సంబంధించిన ఇతర సమాచారానికి https://sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ సూచించింది. (చదవండి: సత్తా చాటిన ఏపీ విద్యార్థులు) -
ఏపీ ఎంసెట్ కోడ్ విడుదల
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్–2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యాశాఖ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయరాజు ఈ ఉదయం పరీక్షాపత్రం కోడ్ విడుదల చేశారు. మార్నింగ్ సెషన్‌కు ఈజీ-02, రెండవ సెషన్‌కు ఈజీ-18 కోడ్ తీశారు. ఈ నెల 24 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. 7 సెషన్లలో ఇంజనీరింగ్, 3 సెషన్లలో మెడికల్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో 109, హైదరాబాద్‌లో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్ వెనుక విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని రూట్ మ్యాప్ ద్వారా పొందుపర్చారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌లో కేటాయించిన తేదీ, సమయము కంటే గంట ముందుగానే హాజరు కావాలి. నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ప్రతిరోజూ అదనపు బస్సులను ఏర్పాటుచేసి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884–2340535, 0884–2356255 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సూచనలు.. ►విద్యార్థికి హాల్‌టికెట్‌లో ఏ తేదీన ఏ స్లాట్ కేటాయించారో ఆ రోజునే పరీక్షకు హాజరు కావాలి. ► పరీక్షకు ముందు బయోమెట్రిక్ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్రను, ఫొటోను స్వీకరిస్తారు. ►విద్యార్థులు కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. అలాగే మెహందీ, గోరింటాకు, టాటూలు వేసుకోకూడదు. ►పరీక్షా కేంద్రంలోకి ఎంసెట్ హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, పెన్నులు, ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్తో కూడిన ఆన్లైన్ ధరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే) వంటివి మాత్రమే లోపలకు అనుమతిస్తారు. ►‘విద్యార్థి తనకు కేటాయించిన కంప్యూటర్ ముందునే కూర్చోవాలి. ఆ కంప్యూటర్లో విద్యార్థి పేరు, ఫొటో, యూజర్ నేమ్ (హాల్‌టికెట్ నంబర్) కనిపిస్తాయి. ►విద్యార్థి పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇవ్వబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తారు. ►పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందు మాత్రమే పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. విద్యార్థి రఫ్ వర్క్ చేసుకోవడానికి తెల్ల కాగితాలను సిబ్బంది ఇస్తారు. పరీక్ష అనంతరం వీటిని పరీక్షా హాల్లోనే తిరిగి ఇచ్చివేయాలి. ►ప్రశ్నలు, ఆప్షన్లను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలలో ఉంటాయి. 23న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ’కీ’ ని ఈ నెల 23న, అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ’కీ’ని ఈ నెల 24న ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ‘కీ’ పై ఏమైనా సందేహాలుంటే ఇంజనీరింగ్‌కు సంబంధించి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5గంటలలోగా, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 27వ తేదీ సాయంత్రం 5గంటలలోగా నిర్దేశించిన ఫార్మాట్లో ఎంసెట్ వెబ్సైట్లో పేర్కొన్న మొయిల్ ఐడీకి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఫలితాలను మే రెండవ వారంలో విడుదల చేస్తారు. -
నేటి నుంచి ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి/బాలాజీ చెరువు(కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్–2019 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,723 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86,910 మంది మొత్తంగా 2,82,633 మంది హాజరవుతున్నారు. ఈ నెల 24 వరకు పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు తెలిపారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాదులో నిర్వహించనున్నామని ఆయన వివరించారు. హాల్‌టికెట్ వెనుక విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని రూట్ మ్యాప్ ద్వారా పొందుపర్చినట్లు చెప్పారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌లో కేటాయించిన తేదీ, సమయము కంటే గంట ముందుగానే హాజరు కావాలని సూచించారు. నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజూ అదనపు బస్సులను ఏర్పాటుచేసి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షకు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0884–2340535, 0884–2356255 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. అభ్యర్థులకు సూచనలు.. ►విద్యార్థికి హాల్‌టికెట్‌లో ఏ తేదీన ఏ స్లాట్ కేటాయించారో ఆ రోజునే పరీక్షకు హాజరు కావాలి. ► పరీక్షకు ముందు బయోమెట్రిక్ విధానంలో ఆయా విద్యార్థుల వేలిముద్రను, ఫొటోను స్వీకరిస్తారు. ►విద్యార్థులు కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకూడదు. అలాగే మెహందీ, గోరింటాకు, టాటూలు వేసుకోకూడదు. ► పరీక్షా కేంద్రంలోకి ఎంసెట్ హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, పెన్నులు, ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్తో కూడిన ఆన్లైన్ ధరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే) వంటివి మాత్రమే లోపలకు అనుమతిస్తారు. ►‘విద్యార్థి తనకు కేటాయించిన కంప్యూటర్ ముందునే కూర్చోవాలి. ఆ కంప్యూటర్లో విద్యార్థి పేరు, ఫొటో, యూజర్ నేమ్ (హాల్‌టికెట్ నంబర్) కనిపిస్తాయి. ► విద్యార్థి పరీక్ష ప్రారంభానికి ముందు కంప్యూటర్లో ఇవ్వబడిన సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తారు. ►పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందు మాత్రమే పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. విద్యార్థి రఫ్ వర్క్ చేసుకోవడానికి తెల్ల కాగితాలను సిబ్బంది ఇస్తారు. పరీక్ష అనంతరం వీటిని పరీక్షా హాల్లోనే తిరిగి ఇచ్చివేయాలి. ► ప్రశ్నలు, ఆప్షన్లను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాలలో ఉంటాయి. 23న ఇంజనీరింగ్ ప్రాథమిక కీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ’కీ’ ని ఈ నెల 23న, అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రాథమిక ’కీ’ని ఈ నెల 24న ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ‘కీ’ పై ఏమైనా సందేహాలుంటే ఇంజనీరింగ్‌కు సంబంధించి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5గంటలలోగా, అగ్రికల్చర్, మెడికల్‌కు సంబంధించి 27వ తేదీ సాయంత్రం 5గంటలలోగా నిర్దేశించిన ఫార్మాట్లో ఎంసెట్ వెబ్సైట్లో పేర్కొన్న మొయిల్ ఐడీకి తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఫలితాలను మే రెండవ వారంలో విడుదల చేస్తారు. -
కాకినాడ జేఎన్టీయు ముందు విద్యార్థుల ధర్నా
-
నేడు ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు
విశాఖలో విడుదల చేయనున్న మంత్రులు బాలాజీచెరువు(కాకినాడ): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఏయూ వ ర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని, ప్రత్తిపాటి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలకు, ఆర్టీసీకి కృత జ్ఞతలు తెలిపారు.ఫలితాలనుwww.apeamcet.org,ww.manabadi.co.in,www.vidyavision.com,www.kabconsultants.com,www.scholls9.com, www.sakshieducation.com వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చన్నారు -
రేపే ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు
బాలాజీచెరువు(కాకినాడ): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఏయూ వర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని, ప్రత్తిపాటి విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలకు, ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలను "WWW.Apeamcet.org, www.sakshieducation.com, www.manabadi.co.in, www.vidyavision.com,www.kabconsultants.com, www.scholls9.com లలోతెలుసుకోవచ్చన్నారు. -
'మే10వ తేదీన ఏపీలో ఎంసెట్'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో మే 10 వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నిర్వహణ తేదీ ఖరారు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు శుక్రవారం 'సాక్షి'కి తెలిపారు. ఎంసెట్ నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 17 రీజనల్ సెంటర్లు, 407 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షకు 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
'ఎంసెట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తాం'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం తమకివ్వడం సంతోషంగా ఉందని జేఎన్టీయూ ఇంఛార్జ్ వీసీ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం తమకప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు సిబ్బంది ఎక్కువగా అవసరమవుతారని వీసీ తెలిపారు. దీని కోసం ఎంసెట్ కన్వీనర్‌ను, ఎంసెట్ కమిటీని నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంతో ప్రస్తుతం ఉన్న వివాదం నేపథ్యంలో సొంతంగానే ఎంసెట్ పరీక్ష నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో - ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనున్నాయి. -
ఈ ‘ప్రశ్నల’కు ఏదీ ‘జవాబు?’
సాక్షి, కాకినాడ : ఉన్న ఊళ్లో రూపాయికి దొరికే సరుకునే పొరుగూరు వెళ్లి అయిదుకో, పదికో కొనేవాడిని ఎవరైనా ఏమంటారు? ‘తెలివితక్కువ దద్దమ్మ’ అనో, ‘డబ్బు విలువ తెలియని దుబారా మనిషి’ అనో అంటారు. మరి, రూ.7.4 కోట్లతో అయ్యే ప్రక్రియకే రూ.43.2 కోట్లు వెచ్చించనున్న జేఎన్టీయూ కాకినాడకూ అవే మాటలు వర్తిస్తాయి. అయితే తక్కువ మొత్తంతో అయ్యే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుపత్రాల మూల్యాంకనల కోసం అయిదు రెట్లు అదనంగా ఖర్చు పెట్టడం వెనుక ఉన్నది కేవలం తింగరి తనమో, దుబారా తత్వమో కాదని, వర్సిటీ పెద్ద తలకాయ బంధువుకు చెందిన సంస్థకు మేలు కూర్చాలన్న దురాలోచనే ఇందుకు కారణమని ఆరోపణ వినిపిస్తోంది. అంతే కాక.. గతంలో వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగిన ఆ ప్రక్రియను ఇప్పుడు ఒప్పందం పేరుతో ప్రైవేట్ సంస్థకు అప్పగించడం అంటే.. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. జేఎన్టీయూకే పరిధిలోని దాదాపు 270 కళాశాలల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున పరీక్షలు జరుగుతుంటాయి. వాటికి అవసరమైన ప్రశ్న పత్రాల రూపకల్పన, జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ఇంత వరకు వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగేది. దీని నిమిత్తం నాలుగేళ్లకు రూ.7.4 కోట్లను వర్సిటీ వెచ్చించేది. ఇప్పుడు ఈ ప్రక్రియను గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ (జీటీపీఎల్)కు కట్టబెడుతూ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షల్లో ప్రశ్న పత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతల్ని నాలుగేళ్ల పాటు జీటీపీఎల్, దానికి అనుబంధంగా పని చేసే మరో రెండు సంస్థలూ చేపడతాయి. దీని నిమిత్తం వర్సిటీ జీటీపీఎల్కు రూ.43.2 కోట్లు చెల్లిస్తుంది. అంతేకాదు..ఆ సంస్థ కేవలం ప్రశ్నపత్రాలను రూపొందించడం, జవాబు పత్రాల మూల్యాంకనం మాత్రమే చూస్తుంది. అందుకు అవసరమైన సాధన సంపత్తిని, మూల్యాంకన ప్రక్రియకు అవసరమైన వసతిని కూడా వర్సిటీయే సమకూర్చాల్సి ఉంటుంది. డిసెంబర్లో కొన్న స్టాంపు పేపర్‌పై నవంబర్లోనే ఒప్పందం.. వర్సిటీ తరఫున రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు, సంస్థ తరఫున జీటీపీఎల్ సీఈఓ వీఎస్ఎన్ రాజు, సాక్షులుగా వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సీహెచ్ సాయిబాబా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీహెచ్ సత్యనారాయణ, సంస్థ తరఫున విజయ్ ఎన్.రావు, బీఎస్వీఎస్ రామచందర్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని 2013 నవంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు చెపుతున్నారు. వర్సిటీ నిర్వహణలో కేవలం రూ.7.4 కోట్లు మాత్రమే ఖర్చయిన ప్రక్రియకు సంబంధించి.. అంతకు అయిదు రెట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వర్సిటీలో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణ వినిపిస్తోంది. ఆ వ్యక్తి సోదరుడు జీటీపీఎల్‌లో భాగస్వామి అని, అస్మదీయుని లబ్ధికే ఇలా వర్సిటీ పర్యవేక్షణలో తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రక్రియను అతి ఎక్కువకు నిర్వర్తించేలా నష్టదాయక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని వర్సిటీ వర్గాలే అంటున్నాయి. ఈ ఒప్పందం వల్ల మునుముందు తమకు జీతాలు ఇవ్వడానికి వర్సిటీకి కష్టతరం కావచ్చని కొందరు ప్రొఫెసర్లు సాక్షితో అన్నారు. అంతేకాక .. వర్సిటీతో పాటు విద్యార్థుల జాతకం మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేసే ఈ విధానాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని వర్సిటీలూ వ్యతిరేకించాయంటున్నారు. కాగా జీటీపీఎల్ ఈ పాటికే మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇచ్చేయాల్సి ఉండగా ఇంతవరకూ ఇవ్వలేక పోయిందని, చివరికి మే నెలాఖరుకు ఇస్తారన్న భరోసా కూడా లేదని అంటున్నారు. కాగా వర్సిటీ, జీటీపీఎల్ల మధ్య ఒప్పందం 2013 నవంబర్‌లో కుదిరినట్టు ఉండగా అందుకోసం ఉపయోగించిన స్టాంపు పేపర్‌ను డిసెంబర్లో కొనుగోలు చేసినట్టు రికార్డయింది. మరి, డిసెంబర్లో కొన్న పత్రంపై నవంబర్లోనే ఒప్పందం ఎలా సాధ్యం, అసలు ఏమి ఆశించి విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టారు అన్న ప్రశ్నలకు వర్సిటీ పెద్దలే జవాబు చెప్పాలి. -
సీమాంధ్ర యూనివర్శిటీల్లో పరీక్షలు వాయిదా
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సీమాంధ్రలో నిరసనలు సెగలు కక్కుతుంది. అటు ఉద్యోగ సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తమ పరిధిలో జరగవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్రలోని పలు యూనివర్శిటీలు ప్రకటించాయి. కాకినాడలోని జేఎన్టీయూ పరిధిలోని 234 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు ఆ యూనివర్శిటీ వీసీ తులసీరాందాస్ శుక్రవారం వెల్లడించారు. ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేంది తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. అలాగే తమ పరిధిలో నేడు, రేపు జరగవలసిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రయూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ పరిదిలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపాయి. అలాగే నేడు జరగవలసిన పాలిటెక్నిక్ పరీక్షను జనవరి 2వ తేదీకి వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.