విశాఖలో విడుదల చేయనున్న మంత్రులు
బాలాజీచెరువు(కాకినాడ): జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో విడుదల చేయనున్నారు. పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఫలితాలను ఏయూ వ ర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని, ప్రత్తిపాటి విడుదల చేయనున్నారు.
ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలకు, ఆర్టీసీకి కృత జ్ఞతలు తెలిపారు.ఫలితాలనుwww.apeamcet.org,ww.manabadi.co.in,www.vidyavision.com,www.kabconsultants.com,www.scholls9.com, www.sakshieducation.com వెబ్‌సైట్ల నుంచి తెలుసుకోవచ్చన్నారు
నేడు ఏపీ ఎంసెట్-2016 ఫలితాలు
Published Mon, May 9 2016 12:54 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM
Advertisement