అభ్యర్థుల ఫోన్ నంబర్లకు ర్యాంకుల సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్–2017 ఫలితాలు శుక్రవారం విడుదల కాను న్నాయి. మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు గురువారం మీడియాకు వెల్లడించారు. ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్ నంబర్లకు పంపిస్తామని తెలిపారు.
కాగా ప్రశ్నపత్రాల్లో వచ్చాన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ వేసిన సంగతి విదితమే. దీనిపై ఆ కమిటీ అభిప్రాయం వ్యక్తపరుస్తూ పలు సూచనలుచేశారు. ఈ మేరకు ఒక మార్కు కలిపే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఇతర ప్రశ్నలకు గాను థర్డ్ పార్టీ పరిశీలన అనంతరం తుది నిర్ణయం ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.
నేడు ఏపీఎంసెట్ ఫలితాలు
Published Fri, May 5 2017 1:37 AM | Last Updated on Sat, Mar 23 2019 8:55 PM
Advertisement
Advertisement