సాక్షి, అమరావతి: డీఎస్సీకి హాజరు కావాలంటే తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అమరావతిలో విడుదల చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్ 14న విడుదల చేస్తామని, అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టెట్ పరీక్షను జనవరి 17 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
ఏపీలో ఇటీవల డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్ 15న విడుదల చేయనున్నారు. డీఎస్సీకి హాజరు కావాలంటే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. కాబట్టి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తున్నారు. టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://cse.ap.gov.in/ లో పొందవచ్చు
టెట్ మెటీరియల్, పాత ప్రశ్నాపత్రాలు, ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి
ముఖ్య తేదీలు
- నోటిఫికేషన్ జారీ: డిసెంబర్ 14, 2017
- దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 18, 2017
- దరఖాస్తులకు చివరి తేది: జనవరి 1, 2018
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: జనవరి 9, 2018
- ఆన్‌లైన్ పరీక్ష తేది: 2018 జనవరి 17 నుంచి 27 వరకు
- ప్రాథమిక కీ విడుదల: జనవరి 29, 2018
- ఫైనల్ కీ విడుదల: ఫిబ్రవరి 6, 2018
- తుది ఫలితాలు: ఫిబ్రవరి 8, 2018
- వెబ్‌సైట్: http://cse.ap.gov.in
Comments
Please login to add a commentAdd a comment