సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ నియామకాల అర్హత పరీక్ష అయిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. పరీక్షలు జనవరి 17 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. టెట్‌కు హాజరయ్యేందుకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ‘http://cse.ap.gov.in’ ద్వారా సమర్పించాలి. టెట్ షెడ్యూల్, ఇతర సమాచారాన్ని కూడా ఇదే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ టెట్ పేపర్-1, పేపర్-2లలో వేర్వేరుగా జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తొలిసారిగా ఈ టెట్ నిర్వహిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డీఎస్పీ రాయడానికి అర్హులు.
Comments
Please login to add a commentAdd a comment