కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో మే 10 వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నిర్వహణ తేదీ ఖరారు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు శుక్రవారం 'సాక్షి'కి తెలిపారు.
ఎంసెట్ నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 17 రీజనల్ సెంటర్లు, 407 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షకు 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.