Legal Proceedings
-
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ న్యాయ విచారణల ఆంతర్యం ఏంటి ?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం ఏంటి ? న్యాయ విచారణల వెనక ఆంతర్యం ఏంటి ? గత ప్రభుత్వ తప్పిదాలపైనే రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమా ? అసలు కాగ్రెస్ ప్రభుత్వం అడుగులు ఏ దిశగా పడుతున్నాయి?.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ళ పాటు సాగిన గులాబీ పార్టీ పాలనలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకాలం తాము చేసిన ఆరోపణల్ని రుజువు చేయడమే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో తప్పిదాలు జరిగాయని తాము ఇంతకాలం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ధరణి వెబ్సైట్ ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములు చేతులు మారాయని ప్రభుత్వం భావిస్తోంది. ధరణిలో జరిగిన అక్రమాలు, లోటుపాట్లను తేల్చేందుకు కోదండ రెడ్డి అధ్యకతన ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి భారీ అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం తెరలేపిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జ్యూడిషియల్ ఎంక్వరీకి ప్రభుత్వం సిద్దమయింది. ఇందుకోసం రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆఫీస్ లలో ఏకకాలంలో విజిలెన్స్ ఎంక్వరీ మొదలు పెట్టింది. విద్యుత్ కొనుగోలులో కూడా అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి ఆధారాలు సేకరించే ప్రక్రియ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి మయంగా మారిందని, కమిషన్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంకోవైపు ప్రభుత్వ శాఖలలో బీఆర్ఎస్ నేతల సన్నిహితులు, బంధువులకు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. అలాంటి వారు వెంటనే రిజైన్ చేసి వెల్లిపోవాలని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఎంక్వరీ చేయాలని సీఎం కోరాతామని కూడా ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ఓఆర్ఆర్ టెండర్లలోను భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ టెండర్లపై విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇవేకాదు.. ఫార్ములా ఈ రేసింగ్ లో హెచ్ఎండిఏ నుంచి రూ.55 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లింపులు జరిగాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరితహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట. దీనిపై కూడా చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని భావిస్తున్న అన్ని శాఖలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు శాఖలపై విచారణకు ఆదేశించగా, మరికొన్ని శాఖలపై ఎంక్వరీకి సిద్ధం అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్ని అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ఖండించారు. తాము ఆరోపించినట్లు అవినీతి జరిగింది నిజమే అని రుజువు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయింది. ఇదీ చదవండి: నల్గొండపై బీజేపీ పట్టు? -
న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం
ఛత్రపతి శంభాజీనగర్: న్యాయ వృత్తిలో నిజాయతీ అత్యంత కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే న్యాయ వ్యవస్థ, ఆ వృత్తి రాణిస్థాయి. లేదంటే వాటి పయనం సాగేది స్వీయ వినాశనం వైపే‘ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ నిజాయతీని, నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన లాయర్లు మొదలుకుని న్యాయమూర్తుల దాకా అందరి పైనా ఉంటుందన్నారు. ఆదివారం ముంబైలోని మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీలో కార్యక్రమంలో ప్రసంగం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నవిగా అనిపించే విషయాల్లో మనం రాజీ పడ్డప్పుడే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లేది‘ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. -
'టెస్లా చెత్త కారు'..రివ్యూపై చర్యలకు సిద్ధమైన ఎలాన్ మస్క్
సోషల్ మీడియాలో ఏదైనా ప్రాడక్ట్‌ల గురించి రివ్యూ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సదరు కంపెనీ నుంచి న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తి టెస్లా 'చెత్త కారు', 'టెస్లా రోగ్ కంపెనీ' అంటూ సోషల్ మీడియాలో నెగిటీవ్ ప్రచారం చేశాడు. దీంతో సదరు వ్యక్తి పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చైనాకు చెందిన 'హాన్ చావో' అనే వ్యక్తి 2019 లో టెస్లా మోడల్ ఎస్ కారును కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన మూడు నెలల తరువాత టెస్లా కారు పనితీరు మందగించింది. దీంతో తన కారును రిప్లేస్ చేసి కొత్త కారు ఇవ్వాలని చైనాలో ఉన్న టెస్లా కార్ల సంస్థను అడిగాడు. కానీ అందుకు టెస్లా ప్రతినిధులు ఒప్పుకోలేదు. ఏం చేయాలో పాలు పోని హాన్ చావో సోషల్ మీడియాలో టెస్లా కారుపై నెగిటీవ్ ప్రచారం చేశారు. టెస్లా చెత్త కారు, టెస్లా రోగ్ కంపెనీ అంటూ ప్రచారం చేశాడు. అంతేకాదు పరువునష్టం దావా కింద తనకి వన్ మిలియన్ యువాన్ చెల్లించాలని కంపెనీని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..హాన్ చావో పై టెస్లా న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. హాన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ లో టెస్లా గురించి నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ప్రజల్లో టెస్లా కారు గురించి ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. కంపెనీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. అందుకే హాన్చావో పై చర్యలు తీసుకునేందుకు టెస్లా సిద్ధంగా ఉందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. చదవండి: Tesla, Apple: భారత్‌లో..ఆపిల్,టెస్లాలకు బ్రేక్..ఈ ఏడాది లేనట్లే! -
చిక్కుల్లో మాల్యా అమెరికా కంపెనీ
న్యూయార్క్: భారత్‌లో వేల కోట్ల రుణాలను ఉద్దేశపూర్వంగా ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యా అక్రమాల ప్రభావం అమెరికాలోని అతని మద్యం వ్యాపారంపైనా పడింది. మాల్యా ఆర్థిక నేరాలపై న్యాయ విచారణ జరుగుతున్న నేపధ్యంలో అమెరికాలో అతని మద్యం వ్యాపార కంపెనీ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇటీవల ఉదంతాలతో యూబీ గ్రూప్ పెను చిక్కులను ఎదుర్కొంటోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మెన్ డోసినో బ్రేవరేజెస్ కంపెనీ పేరిట మాల్యా ప్రారంభించిన లిక్కర్ వ్యాపారం మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుంది. దీంతో కంపెనీ మనుగడను కొనసాగించేందుకు మాల్యా సొంత హామీ మేరకు బ్యాంకుల నుండి ఒక మిలియన్ డాలర్ల బ్రిడ్జిలోన్ పొందారు. ఈ మేరకు యుబిహెచ్ఎల్ బోర్డు డైరెక్టర్లు ఈ త్రైమాసికంలో ఒక మిలియన్ బ్రిడ్జిలోన్లను ఇచ్చేందుకు అనుమతిచ్చారు. మెన్ డోసినో బ్రేవింగ్ కంపెనీకి చైర్మన్, అత్యధిక వాటాలు కలిగిన హక్కుదారుగా ఉన్న విజయ్ మాల్యాపై భారత్‌లో అతని అక్రమాలపై న్యాయ విచారణ జరుగుతున్న నేపధ్యంలో ఆ ప్రభావం ఈ కంపెనీపై పడనుంది. మాల్యా సొంత హామీతో యునైటెడ్ బ్రౌసింగ్ హోల్డింగ్ లిమిటెడ్, ఇతర ఆర్థిక సంస్థల నుండి భారీగా రుణ సదుపాయం పొందారని కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా అమెరికాలో ఈ విధంగా ఒక లిక్కర్ కంపెనీ డిఫాల్టర్ నోటీసు అందుకోవడం ఇది తొలిసారని తెలుస్తోంది. అలాగే యుఎస్ మార్కెట్లోని రెగ్యులేటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఇసి)కి సదరు మాల్యా కంపెనీ సమర్పించిన నివేదిక ప్రకారం కాగా యుబిహెచ్ఎల్ అమెరికాలోని మాల్యా కంపెనీకి నిర్వహణ వ్యయం కోసమే రుణం మంజూరు చేసింది. అమెరికాలోని మాల్యా కంపెనీ ఈ త్రైమాసికంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం సంస్థకు 2016, మార్చి 31 నాటికి 16 మిలియన్ డాలర్ల ఆస్తులు కలిగి ఉందని, అలాగే అప్పుడు 18 మిలియన్ డాలర్ల మేరకు ఉన్నట్లు తెలియజేసింది. అలాగే ఈ త్రైమాసికంలో సంస్థాగతంగా రికార్డు స్థాయిలో 6.9 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు జరిగినా, మొత్తం 637,100 డాలర్ల మేర నికర నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. కాగా మాల్యా అమెరికాలోని ఈ కంపెనీకి చెందిన రుణ చెల్లింపులను 2015 నుండి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 1.7 కోట్ల మేర చెల్లించారు. ఈ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాల్యా కింగ్ ఫిషర్ ప్రీమియం లీగ్ పేరిట మద్యం వ్యాపారాన్ని వివిధ దేశాల్లో కొనసాగిస్తున్నారు. బీర్ బ్రాండ్లలో మాల్యా కంపెనీ ఎంతో ప్రాచుర్యం పొందింది.