సోషల్ మీడియాలో ఏదైనా ప్రాడక్ట్‌ల గురించి రివ్యూ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే సదరు కంపెనీ నుంచి న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓ వ్యక్తి టెస్లా 'చెత్త కారు', 'టెస్లా రోగ్ కంపెనీ' అంటూ సోషల్ మీడియాలో నెగిటీవ్ ప్రచారం చేశాడు. దీంతో సదరు వ్యక్తి పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
చైనాకు చెందిన 'హాన్ చావో' అనే వ్యక్తి 2019 లో టెస్లా మోడల్ ఎస్ కారును కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన మూడు నెలల తరువాత టెస్లా కారు పనితీరు మందగించింది. దీంతో తన కారును రిప్లేస్ చేసి కొత్త కారు ఇవ్వాలని చైనాలో ఉన్న టెస్లా కార్ల సంస్థను అడిగాడు. కానీ అందుకు టెస్లా ప్రతినిధులు ఒప్పుకోలేదు. ఏం చేయాలో పాలు పోని హాన్ చావో సోషల్ మీడియాలో టెస్లా కారుపై నెగిటీవ్ ప్రచారం చేశారు. టెస్లా చెత్త కారు, టెస్లా రోగ్ కంపెనీ అంటూ ప్రచారం చేశాడు.
అంతేకాదు పరువునష్టం దావా కింద తనకి వన్ మిలియన్ యువాన్ చెల్లించాలని కంపెనీని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..హాన్ చావో పై టెస్లా న్యాయ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. హాన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో టెస్లా గురించి నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో ప్రజల్లో టెస్లా కారు గురించి ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. కంపెనీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. అందుకే హాన్‌చావో పై చర్యలు తీసుకునేందుకు టెస్లా సిద్ధంగా ఉందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
చదవండి: Tesla, Apple: భారత్‌లో..ఆపిల్,టెస్లాలకు బ్రేక్..ఈ ఏడాది లేనట్లే!
Comments
Please login to add a commentAdd a comment