
న్యూఢిల్లీ: నిత్యం కీలకమైన కేసుల విచారణ, వాదోపవాదనలను ఆలకించడంలో బిజీగా ఉండే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కొద్దిసేపు అవన్నీ పక్కనబెట్టారు. మధ్యాహ్నం వేళ కొన్ని కేసుల వాదనలు విన్నాక మధ్యలో కొద్దిసేపు విరామం ప్రకటించారు.
వెంటనే కొందరు జడ్జీలతో కలిసి అక్కడే ఉన్న ప్రముఖమైన సుప్రీంకోర్టు పార్క్‌లో కలియతిరిగారు. అక్కడికి వచి్చన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులతో సరదాగా మాట్లాడారు. అక్కడి కెఫెటేరియాలో టీ తాగారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలు సీజేఐతోపాటు నడిచారు.