భవిష్యత్ సవాళ్లకు జడ్జీలు సిద్ధం కావాలి
వీడ్కోలు ప్రసంగంలో సీజేఐ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్.. తన పదవీ విరమణ సందర్భంగా మంగళవారం చేసిన వీడ్కోలు ప్రసంగంలోనూ జడ్జీల కొరత, పెండింగ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 3 కోట్ల కేసు లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘మనకు మౌలిక సదుపాయాలు, జడ్జీల కొరత వంటి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో సైబర్ చట్టాలు, మెడికో – లీగల్, జెనెటిక్స్, గోప్యత వంటి తీవ్ర అంశాలూ మనముందుకు రానున్నాయి. దేశం సంఘటితంగా సాగేందుకు ఈ సవా ళ్లను ఎదుర్కోవడానికి జడ్జీలు సిద్ధం కావా లి’ అని చెప్పారు.
న్యాయవాద వృత్తిపై తనకెంతో ప్రేమ అంటూ.. రిటైర్డ్ జడ్జీలు న్యాయవాద వృత్తిని కొనసాగించేందుకు రాజ్యాంగాన్ని సవరిస్తే బావుంటుందని సరదాగా అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బుధవారం సీజేఐగా బాధ్య తలు చేపట్టనున్న జస్టిస్ ఖేహర్ మాట్లా డుతూ.. ‘జస్టిస్ ఠాకూర్ దేశ మంతా తిరిగి చట్టాలపై మంచి మాటలు చెప్పారు. మీరు ఉపరాష్ట్రపతి కాబోతున్నట్లు ఓ పత్రికలో వచ్చిందని ఆయనతో చెప్పా. ఆయన నవ్వి ఏకంగా రాష్ట్రపతే కావాల నుకుంటున్నాం అని చెప్పార’న్నారు.