
నిజాయితీ అనేది జడ్జీల గుత్తసొత్తు కాదు: సీజేఐ
న్యూఢిల్లీ: నిజాయితీ అనేది కేవలం జడ్జీల గుత్తసొత్తు కాదని.. వ్యవస్థలో వారే మాత్రమే నిజాయితీపరులని, మిగతావారంతా అనుమానితమని తాము చెప్పమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ పేర్కొన్నారు. ‘ప్రపంచీకరణ శకంలో మధ్యవర్తిత్వం’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును శుక్రవారం ఢిల్లీలో సీజేఐ ప్రారంభించి ప్రసంగించారు. మధ్యవర్తులకు నిష్కళంకమైన నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు.