న్యూఢిల్లీ: దుబాయ్‌లో ఉంటున్న భారతీయులంతా కలిసి లీగల్ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్న భారతీయులకు అది ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దుబాయ్ పర్యటనలో ఉన్న జస్టిస్ రమణ శుక్రవారం అక్కడి గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమ కోహ్లి ఆయనతో పాటు ఉన్నారు. దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం యూనియన్ సుప్రీంకోర్టు ఆఫ్ ది యూఏఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హమద్ అల్ బదీ ఆహ్వానం మేరకు జస్టిస్ రమణ అక్కడ పర్యటిస్తున్నారు. అబుదాబిలోని భారత సంతతి వారి సన్మాన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment