థాంక్యూ మిలార్డ్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్య నివారణ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నుంచి మద్దతు లభించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. జనవరి ఒకటి నుంచి సరి-బేసి నెంబర్ల ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్ల మీదకు అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయానికి సీజేఐ నుంచి మద్దతు లభించడం ఎంతో గొప్ప విషయమని, ఇది తమకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని ఆయన ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈ నిర్ణయానికి స్వాగతిస్తున్న నేపథ్యంలో వారి దారిలో లక్షలమంది ప్రజలు కూడా నడువనున్నారని ఆయన తెలిపారు. 'థాంక్యూ మిలార్డ్స్' అంటూ న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
CJI's support 2 odd even formula is welcome n huge encouragement. SC judges pooling cars wud inspire millions 2 follow. Thank u My Lords.
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 6, 2015