Car-Free Day
-
థాంక్యూ మిలార్డ్స్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్య నివారణ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నుంచి మద్దతు లభించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. జనవరి ఒకటి నుంచి సరి-బేసి నెంబర్ల ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్ల మీదకు అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి సీజేఐ నుంచి మద్దతు లభించడం ఎంతో గొప్ప విషయమని, ఇది తమకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని ఆయన ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఈ నిర్ణయానికి స్వాగతిస్తున్న నేపథ్యంలో వారి దారిలో లక్షలమంది ప్రజలు కూడా నడువనున్నారని ఆయన తెలిపారు. 'థాంక్యూ మిలార్డ్స్' అంటూ న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. CJI's support 2 odd even formula is welcome n huge encouragement. SC judges pooling cars wud inspire millions 2 follow. Thank u My Lords. — Arvind Kejriwal (@ArvindKejriwal) December 6, 2015 -
ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లనున్న సీఎం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే జనవరి 22న 'కార్ ఫ్రీ డే' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ రోజు తాను సైకిల్‌పై ఆఫీసుకు వెళతానని చెప్పారు. ఆదివారం 'కార్ ఫ్రీ డే' భాగంగా ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. కేజ్రీవాల్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'జవనర్ 22న ఉద్యోగులు కార్లలో బదులుగా సైకిళ్లు లేదా ప్రజా రవాణా వాహానాల్లో ఆఫీసులకు వెళ్లాలని విన్నవిస్తున్నా. ఆ రోజు నేను కూడా సైకిల్‌పై ఆఫీసుకు వెళతా. నా విన్నపాన్ని కనీసం 5-10 శాతం మంది పాటించినా అది మాకు గొప్ప విజయం' అని చెప్పారు. ఢిల్లీలో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ప్రతి నెలా 22న ఒక్కో ప్రాంతంలో కార్ ఫ్రీ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. -
సీఎం సైకిల్ ర్యాలీ!
కాన్వాయ్ శ్రేణి.. అత్యున్నత స్థాయి భ్రదత.. అన్నింటినీ పక్కన పెట్టి ఎంచక్కా సైకిలెక్కి ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొననున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కాలుష్య నివారణా చర్యల్లో భాగంగా దేశరాజధానిలో మొట్టమొదటిసారి నిర్వహించనున్న 'కార్ ఫ్రీ డే' కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ ఫీట్ చేయనున్నారు. ఈ ర్యాలీలో సీఎం సహా సహచర కేబినెట్ మంత్రులూ కాళ్లకు పనిచెప్పనున్నారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 22న ఉదయం 7 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుందని, ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు కొనసాగుతుందని చెప్పారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేలా ఆ రోజు డీటీసీ (ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్) అదనపు బస్సులు నడుపుతుందని, ఆటో డ్రైవర్లు కూడా ఉచిత సర్వీసు అందించేందుకు ముందుకొచ్చారని తెలిపారు.