సుప్రీంకోర్టు సీజేగా హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ దత్తు చేత ప్రమాణం చేయించారు. దత్తు 14 నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, పలువురు కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ సీనియర్ నేతలు హాజరయారు. గతంలో కేరళ, ఛత్తీస్గఢ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పని చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం.లోథా పదవికాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో దత్తు నియమితులయ్యారు.