వచ్చే నెల 24వ తేదీన బాధ్యతల స్వీకరణ
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయ శాఖ
15 నెలలపాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తదుపరి సీజేఐగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ దాదాపు 15 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు.
2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో రా ష్ట్రపతి ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌ను సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. జస్టిస్ సూర్యకాంత్‌కు అభినందనలు తెలియజేశారు.
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లా పెటా్వర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. 1981లో హిసార్‌లోని ప్రభుత్వ పీజీ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా అభ్యసించారు. 2011లో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి ‘మాస్టర్ ఆఫ్ లా’లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
2000 జూలై 7 నుంచి 2004 జనవరి 8 దాకా హరియాణా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. 2004 జనవరి 9 నుంచి 2018 అక్టోబర్ 4 దాకా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018 అక్టోబర్ 5 నుంచి 2019 మే 23 దాకా హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్లుగా సుప్రీంకోర్టులో సేవలందిస్తున్నారు. 2000 సంవత్సరం కంటే ముందే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన జస్టిస్ సూర్యకాంత్ 2011లో మాస్టర్ ఆఫ్ లా పూర్తిచేయడం విశేషం.
కీలక తీర్పుల్లో భాగస్వామి
సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పుల్లో జస్టిస్ సూర్యకాంత్ భాగస్వామ్యం కూడా ఉంది. పలు ధర్మాసనాల్లో ఆయన పనిచేశారు. జమ్మూకశీ్మర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370 రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటి కీలక అంశాల్లో ఆయన తీర్పులిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ తీర్పు ఇచి్చన బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడే. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దని ఆయన ఆదేశించారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సహా ఇతర బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించి చరిత్ర సృష్టించారు. రక్షణ దళాల్లో వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకాన్ని సమరి్థంచారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలో సభ్యుడిగా పనిచేశారు. జాతీయ భద్రత పేరిట ప్రముఖుల గోప్యతకు భంగం కలిగించడం సరైంది కాదని తేలి్చచెప్పారు. 2022లో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా పరమైన లోపాలు బయటపడ్డాయి. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్న ధర్మాసనం విచారించింది.


