oath of office
-
The Reverse Swing: Colonialism to Cooperation: పీవీ నుంచి వాజ్‌పేయీకి రహస్య చీటీ!
న్యూఢిల్లీ: దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత పీవీ నరసింహా రావు ఆయనకు ఓ చీటీ అందించారని తాజాగా విడుదలైన ఒక పుస్తకం ద్వారా వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. వాజ్‌పేయీ ప్రధానిగా కొనసాగిన కాలంలో అంటే 1998–2004 కాలంలో అశోక్ టాండన్ అనే అధికారి ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన రాసిన ‘ది రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్’ అనే పుస్తకంలో ఇటీవల విడుదలైంది. దానిని పెట్రోలియం, సహజవాయు, గృహ, పట్టణవ్యవహారాల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ పుస్తకంలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను టాండన్ పంచుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో ప్రమాణస్వీకారం వేళ వాజ్‌పేయీ ప్రధానమంత్రి పదవి చేపట్టినపుడు అదే సమయంలో అక్కడే ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు ఒక చీటీని వాజ్‌పేయీకి రహస్యంగా అందించారు. ‘అంసంపూర్తిగా మిగిలిపోయిన ఒక పనిని మీరు పూర్తిచేయాలి’ అని ఆ చీటిలో రాసి ఉందట. 1996 సంవత్సరంలో ఈ ఘటన జరిగిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘ పీవీ తాను ప్రధానిగా కొనసాగిన కాలంలో అమెరికా నుంచి తీవ్ర ఒత్తిళ్ల కారణంగా అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించలేకపోయారు. ఆ బాధ్యతలను పీవీనే స్వయంగా వాజ్‌పేయీకి అప్పగించి ఉంటారు’ అని ఆ పుస్తకంలో టాండర్ రాసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రధాని పదవి చేపట్టడం 13 రోజులకే ప్రభుత్వం కూలడం, 1998లో ప్రధాని పగ్గాలు చేపట్టి విజయవంతంగా ఐదేళ్ల పాలన వాజ్‌పేయీ పూర్తిచేసుకోవడం తెల్సిందే. 1996లో అణుపరీక్షలకు ప్రయతి్నంచి విఫలమైన ప్రభుత్వం 1998లో పోఖ్రాన్లో విజయవంతంగా పూర్తిచేసి అమెరికాను సైతం విస్మయానికి గురిచేసిన సంగతి తెల్సిందే. రాష్ట్రపతి పదవి తిరస్కరణ! 2002 సంవత్సరంలో ప్రధాన మంత్రిగా దిగిపోయి రాష్ట్రపతి పదవి చేపట్టాలని వాజ్‌పేయీకి సూచనలు వచ్చాయని, కానీ వాజ్‌పేయీ అందుకు ససేమిరా అన్నారని పుస్తకంలో ఉంది. ప్రధానిగా వాజ్‌పేయీ దిగిపోతే ఆ బాధ్యతలు అద్వానీకి అప్పగించాలని చూశారని పేర్కొన్నారు. ‘ ప్రధానిగా ఉన్న వ్యక్తి వెంటనే రాష్ట్రపతి పదవి చేపడితే అది ప్రజాస్వామ్య దేశానికి ఎంతమాత్రం మంచిదికాదు. పరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని తన తోటి మంత్రులతో వాజ్‌పేయీ అన్నారట. 1996 తర్వాత మెజారిటీ ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదట పుస్తకంలో పీవీ ఆలోచనలనూ పొందుపరిచారు. ‘ 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియాలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడటం అమెరికాకు ఇష్టంలేదట. వాజ్‌పేయీ ప్రధాని కావడం అమెరికాకు ఇష్టం లేదనుకుంటా. వాజ్‌పేయీ ముక్కుసూటి తనం, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఆయన అణుపరీక్షలకు పచ్చజెండా ఊపేలా ఉన్నారని అమెరికా ప్రభుత్వానికి ఢిల్లీలోని ఆ దేశ రాయబారి సమాచారం చేరవేశారు’ అని పీవీ అప్పట్లో అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
హైదరాబాద్ కలెక్టర్‌గా నిర్మల
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె.నిర్మల సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా 18 మాసాలకుపైగా పని చేసిన ముఖేష్‌కుమార్ మీనా ఐఏఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లారు. హైదరాబాద్ ఏపీఎండీపీలో ైడెరైక్టర్గా పనిచేస్తున్న నిర్మలను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయటంతో సోమవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ఇన్చార్జి జేసీ సంజీవయ్య, డీఆర్ఓ అశోక్‌కుమార్‌తో సహా ఆర్డీఓలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు , కలెక్టరేట్ ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలియచేశౠరు. ఇక ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. ఖమ్మం జిల్లా జేసీగా పనిచేస్తున్న సురేంద్ర మోహన్‌ను హైదరాబాద్ జేసీగా బదిలీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో జిల్లా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ప్రజా ఫిర్యాదులకు పెద్ద పీట: కలెక్టర్ నిర్మల ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కె.నిర్మల తెలిపారు. బాధ్యతలు స్వీరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. భూముల పరిరక్షణ, ఇళ్ల క్రమబద్ధీకరణ, ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రొఫైల్... స్వస్థలం: మహబూబ్‌నగర్ జిల్లా ఏ బ్యాచ్: 2005 ఐఏఎస్ బ్యాచ్ గతానుభవం: 1995 నుంచి 1999 వరకు కర్నూల్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో ఆర్డీఓగా పని చేశారు. 1999 నుంచి 2002 వరకు మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా, డీఆర్డీఏ పీడీగా బాధ్యతలు. 2003లో వరంగల్ జిల్లా వెలుగు పీడీ. 2004-09 వరకు హైదరాబాద్ గ్రామీణాభివృద్ధి శాఖలో జాయింట్ కమిషనషర్గా, 2010 నుంచి 2011 వరకు పాడేరు ఐటీడీఏ పీడీగా పని చేశారు. 2011 నుంచి 2014 ఫిబ్రవరి వరకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, ఆ తర్వాత 10 మాసాలు హైదరాబాద్‌లో ఏపీఎండీపీలో డెరైక్టర్‌గా నిర్మల పని చేశారు. -
సుప్రీంకోర్టు సీజేగా హెచ్.ఎల్.దత్తు ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ దత్తు చేత ప్రమాణం చేయించారు. దత్తు 14 నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, పలువురు కేంద్ర మంత్రులతోపాటు బీజేపీ సీనియర్ నేతలు హాజరయారు. గతంలో కేరళ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు పని చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం.లోథా పదవికాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో దత్తు నియమితులయ్యారు.