సాక్షి, న్యూఢిల్లీ: వేసవి సెలవుల అనంతరం జూలై 3వ తేదీ నుంచి దాఖలైన పిటిషన్ల కేటగిరీల ఆధారంగా సుప్రీంకోర్టులో నూతన రోస్టర్ విధానం అమలులోకి రానున్నట్లు సమాచారం. ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్)లు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లేదా సీనియర్ జడ్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తుంది. తాజా కేసుల జాబితా, ప్రస్తావనలకు సంబంధించిన నూతన ప్రక్రియ కూడా జూలై 3 నుంచి అమలులోకి రానుంది.
మంగళవారం నాటికి ధ్రువీకరించిన తాజా కేసులు ఆటోమేటిక్‌గా సోమవారానికి, మిగిలినవి శుక్రవారం జాబితా చేయనున్నారు. తాజా కేసులను సీఐఐ ఎదుట లాయర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సర్క్యులర్‌లో పేర్కొంది. ప్రస్తావన ప్రొఫార్మాలు మధ్యాహ్నం 3 గంటలలోపు సమరి్పస్తే తదుపరి రోజు ధర్మాసనాలు వాటిపై నిర్ణయం తీసుకుంటాయి. అదే రోజున జాబితా చేర్చాలని కోరుకొనే పక్షంలో ఉదయం 10.30 గంటల లోపు అత్యవసర లేఖతో ప్రొఫార్మాను సంబంధిత అధికారికి అందజేయాలి. వీటిపై భోజన విరామ సమయంలో సీజేఐ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment