భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ఎమ్ లోధా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. లోధా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జరిపించారు. భారత దేశానికి లోధా 41వ ప్రధాన న్యాయమూర్తి. శనివారంతో పి సదాశివం పదవీకాలం ముగిసింది. ప్రధాన న్యాయమూర్తిగా 2014 సెప్టెంబర్ 27 తేది వరకు లోధా కొనసాగనున్నారు. భారీ సంఖ్యలో కీలక కేసుల్లో తీర్పు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. బొగ్గు కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన కేసు కూడా అందులో ఒకటి. జోధ్ పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టబద్రడయ్యారు. ఆతర్వాత రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన లోధా అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.