ఇద్దరు హిజాబ్ ఆందోళనకారులను ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం | Iran Hangs Two Men Accused Killing Security Official Hijab Protests | Sakshi
Sakshi News home page

ఇద్దరు హిజాబ్ ఆందోళనకారులను ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం

Published Sat, Jan 7 2023 3:38 PM | Last Updated on Sat, Jan 7 2023 3:38 PM

Iran Hangs Two Men Accused Killing Security Official Hijab Protests - Sakshi

టెహ్రాన్‌: కొద్ది రోజుల క్రితం ఇరాన్‌లో హిజాబ్ ఆందోళనలు ఉద్ధృతంగా మారిన విషయం తెలిసిందే. చాలా చోట్ల ఘర్షణలు చెలరేగి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ‍క్రమంలోనే నిరసనకారుల దాడిలో ఓ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు.

అయితే ఇతడి మృతికి కారణమైన ఇద్దరు ఆందోళనకారులకు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. శనివారం ఉదయం వీరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. అలాగే మరో 11 మందికి జైలు శిక్ష విధించింది.

 హిజాబ్ ఆందోళనల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం నలుగురికి మరణశిక్ష అమలు చేసింది ఇరాన్ ప్రభుత్వం. మొత్తం 26 మందికి ఇదే శిక్ష విధించాలని ఇరాన్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది.
చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్‌ఓ అలర్ట్..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement