Executed
-
ఇద్దరు హిజాబ్ ఆందోళనకారులను ఉరి తీసిన ఇరాన్ ప్రభుత్వం
టెహ్రాన్: కొద్ది రోజుల క్రితం ఇరాన్లో హిజాబ్ ఆందోళనలు ఉద్ధృతంగా మారిన విషయం తెలిసిందే. చాలా చోట్ల ఘర్షణలు చెలరేగి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ క్రమంలోనే నిరసనకారుల దాడిలో ఓ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇతడి మృతికి కారణమైన ఇద్దరు ఆందోళనకారులకు ఇరాన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. శనివారం ఉదయం వీరికి ఉరిశిక్ష అమలు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి మరణ శిక్ష అమలు చేయాల్సి ఉంది. అలాగే మరో 11 మందికి జైలు శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం నలుగురికి మరణశిక్ష అమలు చేసింది ఇరాన్ ప్రభుత్వం. మొత్తం 26 మందికి ఇదే శిక్ష విధించాలని ఇరాన్ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. చదవండి: 25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్.. -
10 రోజుల్లో 12 మందికి శిరచ్ఛేదం.. మరణ దండనలో రాజీపడని సౌదీ..
రియాధ్: మరణదండన విషయంలో సౌదీ అరేబియా రాజీపటడం లేదు. 10 రోజుల్లోనే 12 మంది దోషుల తలలు నరికి మరణశిక్ష అమలు చేసింది. వీరంతా డ్రగ్స్ కేసులలో నేరం రుజువైన వారు. ఇలాంటి శిక్షలు తగ్గిస్తామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం అది కన్పిచండం లేదు. ఈ 12 మందితో కలిపి ఈ ఏడాది మొత్తం 132 మంది దోషులకు శిరచ్ఛేదము చేసింది సౌదీ ప్రభుత్వం. 2020, 2021లో రెండేళ్లలో అమలైన మొత్తం మరణశిక్షలకంటే ఈ సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు మరణశిక్ష విధించిన 12 మందిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డాన్‌కు చెందినవారు, ముగ్గురు సౌదీ పౌరులు ఉన్నారు. మరణశిక్షలను తగ్గించే విషయంపై ఆలోచిస్తున్నామని, ఈ శిక్షలను వీలైనంత తక్కువగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని 2018లోనే సౌదీ యువరాజు తెలిపారు. జమల్ కషోగ్గి హత్య తర్వాత.. మరణ శిక్షను సవరించేలాా చట్టంలో మార్పులు చేయాలని 2020లో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అహింసా నేరాల్లో మృదువుగా వ్యవహరించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది. కానీ ఇవేమీ ఆచరణకు నోచుకోవడం లేదు. చదవండి: రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ.. -
ప్రధాని హత్యకు కుట్ర: 14 మందికి మరణ శిక్ష
ఢాకా: రెండు దశాబ్దాల క్రితం అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనాను హత్య చేసేందుకు యత్నించారన్న కేసులో 14 మంది ఇస్లామిక్ మిలిటెంట్లకు బంగ్లాదేశ్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిలో 9 మందిని పోలీసులు కోర్టుకు హాజరు పరిచారు, మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. వీరిని ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్పించి చంపి ఇలాంటి వారికి ఒక సందేశమివ్వాలని జడ్జి తీర్పులో వ్యాఖ్యానించారు. లేదంటే వీరిని ఉరితీయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ నియమాల ప్రకారం మరణ శిక్షను హైకోర్టు నిర్ధారించాల్సి ఉంటుంది. తాజా తీర్పుపై నిందితులు అప్పీలుకు వెళ్లే అవకాశం ఇస్తారు. 2000 సంవత్సరంలో హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్‌కు చెందిన వీరంతా ప్రధాని హత్యకు కుట్రపన్నారు. వీరి నాయకుడు ముఫ్తి అబ్దుల్ హనన్‌కు వేరే కేసులో 2017లో మరణ శిక్ష అమలు చేశారు. ప్రధాని హత్యాయత్నాన్ని సెక్యూరిటీ వర్గాలు భగ్నం చేశాయి. ఈ కేసుకు సంబంధించే గతంలో 10మంది ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేయడం జరిగింది. 1975 నుంచి హసీనా పలుమార్లు హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. -
అమెరికాలో మహిళకి మరణశిక్ష అమలు
టెర్రెహాట్: పదిహేడేళ్ల క్రితం నిండు గర్భిణిని హత్య చేసి, ఆమె కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువుని ఎత్తుకుపోయిన నేరానికి కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్గొమెరీ అనే మహిళకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయడం 1953 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి. ఇండియానాలోని టెర్రెహాట్ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు లీసా కాస్త ఆందోళనతో కనిపించినట్టు జైలు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు జైలులోని మహిళా అధికారి లీసా దగ్గరగా వచ్చి, ఆమె ముఖాన్ని కప్పి ఉంచిన మాస్కు తీసి, చివరగా చెప్పాల్సినదేమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి లీసా నెమ్మదిగా, వణుకుతున్న గొంతుతో ‘‘నో’’అని బదులిచ్చారు. మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 సంవత్సరం డిసెంబర్లో ఇంటర్నెట్లో కుక్క పిల్లల అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ చేసింది. స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదో నెల గర్భిణి అయిన స్టిన్నెట్ మెడకి తాడు బిగించి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి ఆమె గర్భాన్ని చీల్చి లోపల ఉన్న శిశువుని అపహరించింది. -
సీరియల్ కిల్లర్‌కు ఉరిశిక్ష అమలు
బీజింగ్ : చైనా ‘జాక్ ద రిప్పర్’గా పేరొందిన సీరియల్ కిల్లర్ గావో చింగ్‌యాంగ్(54)ను ఉరి తీసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో 11 మంది మహిళలను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఆ నేరస్తుడికి గురువారం మరణశిక్ష అమలైందని పేర్కొంది. దీంతో బాధితుల తరఫు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించింది. అలా పట్టుబడ్డాడు.. తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరు. చిన్న క్లూ చాలు నేరస్తుడిని పట్టించడానికి. గావో చింగ్‌యాంగ్ విషయంలోనూ అదే జరిగింది. నేరాలు చేసి మారువేషాల్లో తిరిగే గావోతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా నేర ప్రవృత్తి కలవారే. ఒక హత్య కేసులో అరెస్టయిన గావో రక్తసంబంధీకుడి డీఎన్ఏ ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టించింది. దీంతో 28 ఏళ్లుగా పోలీసులు పడిన కష్టానికి ఫలితం దక్కింది. 11 మంది మహిళలను హత్య చేసిన ఈ సీరియల్ కిల్లర్‌కు బేయిన్ సిటీ కోర్టు మరణశిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడిన గావోకు మరణశిక్ష విధించడమే సరైన శిక్ష అని కోర్టు పేర్కొంది. సమాజానికి హానికారకంగా తయారైన ఇటువంటి వ్యక్తికి మళ్లీ అప్పీలుకు వెళ్లే అర్హత కూడా లేదంటూ వ్యాఖ్యానించింది. చైనా రిప్పర్.. గావో గావో చింగ్‌యాంగ్‌కు మహిళలంటే ద్వేషం. ఎరుపు రంగు దుస్తులు ధరించిన మహిళలను వెంబడించి, వారి గొంతు కోసేవాడు. తర్వాత వారిపై అత్యాచారాలకు పాల్పడి.. శవాలను ముక్కలు ముక్కలు చేసి రాక్షసానందం పొందేవాడు. 1988- 2002 మధ్య కాలంలో 11 మంది ఆడవాళ్లను ఇదేరీతిలో హత్య చేశాడు. బాధితుల్లో ఎనిమిదేళ్ల బాలిక కూడా ఉంది. పోలీసులకు చిక్కకుండా గావో సుమారు మూడు దశాబ్దాల పాటు తప్పించుకు తిరిగాడు. అతని కోసం గాలించి విసుగు చెందిన పోలీసులు.. ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల యువాన్ల రివార్డు కూడా ప్రకటించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఇక వైట్ చాపెల్ మర్డరర్‌గా ప్రసిద్ధి చెందిన లండన్‌కు చెందిన జాక్ రిప్పర్ సీరియల్ కిల్లర్. ఇతడిపై ఐదుగురు మహిళలను హత్య చేశాడనే ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపితం కాలేదు. Gao Chengyong, a serial killer and rapist known as China’s “Jack the Ripper,” was executed on Thursday after the Supreme People's Court approved his death sentence. Gao raped and murdered 11 women in northwest China between 1988 and 2002 and was arrested in 2016. pic.twitter.com/EufudHpkDz — People's Daily, China (@PDChina) January 3, 2019 -
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి శిరచ్ఛేదం
రియాద్ (సౌదీఅరేబియా): మద్యం మత్తులో వాహనం నడిపి ఆరుగురి మరణానికి కారణమైన వ్యక్తిని సౌదీ పోలీసులు బహిరంగంగా శిరచ్ఛేదం చేశారు. నాలుగేళ్ల కిందట రియాద్‌లోని అల్-యాస్మీన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. వివరాలు.. అబ్దుల్ మాలిక్ అల్-దిహైమ్ బ్రిటన్‌లో చదువుకునేవాడు. తీర్థయాత్ర కోసం 2013 అక్టోబర్ లో తన స్వదేశమైన సౌదీకి వచ్చాడు. తీర్థయాత్ర ముగించుకున్న తర్వాత తన ఆడి కారులో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన మరో వాహనం, వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆడి కారులో ప్రయాణిస్తున్న అబ్దుల్ మాలిక్ అల్-దిహైమ్, అయన చెల్లెళ్లు హిస్సా అల్-దిహైమ్, నడా అల్-దిహైమ్, నూహా అల్-దిహైమ్, అబీర్ అల్-దిహైమ్, మేనకోడలు నోరా అల్-దిహైమ్లు మృతిచెందారు. అయితే ఆ సమయంలో మరో వాహనం నడిపిన మహ్మద్ అల్-ఖతాని మద్యం సేవించడమే కాకుండా, గంటకు 180-200 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆరుగురి చావుకు కారణమైన మహ్మద్ అల్-ఖతానికి కోర్టు బహిరంగ మరణశిక్ష అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపేసి ఆ కుటుంబానికి మహ్మద్ అల్-ఖతాని తీరని అన్యాయం చేశాడని కోర్టు పేర్కొంది. మహ్మద్ అల్-ఖతానిలాంటి వ్యక్తులకు భూమ్మీద బతికే అర్హత లేదని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ప్రజలందరూ చూస్తుండగానే సౌదీ పోలీసులు మంగళవారం బహిరంగంగా మహ్మద్ అల్-ఖతానికి శిరచ్ఛేదనం చేశారు. తాగుడుకు బానిసను చేసిన ఎయిడ్స్ ప్రమాదానికి కారణమైన మహ్మద్ అల్-ఖతానికి 26 ఏళ్ల వయస్సులోనే ఎయిడ్స్ వ్యాధి సోకింది. దీంతో కుటుంబ సభ్యులు, మిత్రులు అతన్ని దూరం పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికిలోనై తాగుడుకు బానిసగా మారాడు. తర్వాత ఎయిడ్స్ బాధితులకు సహాయం చేయడానికి పలు ఎయిడ్స్ ఆర్గనైజేషన్స్లలో వాలంటీర్‌గా పని చేశాడు. తన వ్యాధి కొద్దిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో కూడా చేరాడు. మరో ఎయిడ్స్ బాధితురాలిని వివాహం కూడా చేసుకోవాలనుకున్నాడు. సరిగ్గా రోడ్డు ప్రమాదం జరిగిన రోజే ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అంతలోనే ఘోర ప్రమాదం జరగడంతో ఆరుగురు మృతిచెందారు. ఆ ప్రమాదానికి తాను చేసిన పొరపాటే కారణం అని తెలుసుకుని తీవ్ర పశ్చాత్తాపపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత మూడు రోజులపాటూ ఆహారం కానీ, మెడిసిన్స్ కానీ తీసుకోలేదు. కష్టాల్లో నుంచి తేరుకొని మంచి జీవితం కోసం నేను చేసిన కృషి మొత్తం చిన్న తప్పిదంతో నాశనమైపోయిందని శిక్ష అమలుకు ముందు మహ్మద్ అల్-ఖతాని వాపోయాడు. -
కాల్ డ్రాప్ సమస్య గణనీయంగా తగ్గింది..
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించే దిశగా టెలికాం కంపెనీల ప్రయత్నాలు ఫలించినట్టు తెలుస్తోంది. 100 రోజుల కాల్ డ్రాప్ ప్రణాళిక అను అనేక టెలికాంలు విజయవంతంగా అమలు చేశాయి. అనేక టెలికం సర్వీసు ప్రొవైడర్లు కాల్ అమలుచేసిన 100 డేస్ ప్లాన్ సానుకూల ఫలితాలు సాధించినట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ)డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ సోమవారం తెలిపారు. కాల్ డ్రాప్ సమస్య వివాదంలో గణనీయమైన వృద్ధిని సాధించినట్టు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ లో కొన్ని ప్రదేశాల్లో ఇంకా కాల్ డ్రాప్ సమస్య ఉందన్నారు. ప్రభుత్వం టెలికాం కంపెనీలకు కాల్ డ్రాప్ సమస్యను మెరుగుపరిచేందుకు జూన్ లో 100 రోజుల రోడ్ మ్యాప్ ఇచ్చింది. దీంతో కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు టెలికాం సెక్రటరీ జెఎస్ దీపక్ తెలిపారు. గత జూన్ లో సర్వీస్ ప్రొడైవర్ల సమావేశం నిర్వహించామని, ఆ సందర్భంగా వారు ఈ వందరోజుల ప్లాన్ అమలుకు అంగీకరించినట్టు చెప్పారు. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19శాతానికి మాత్రమే తగ్గినట్టు వివరించారు. మొదటి 45 రోజుల్లో 48,000 లకు అదనంగా దేశం అంతటా 100 రోజుల్లో 60,000 బీటీఎస్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను)జోడించనున్నట్టు జులై 25న మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. ఈ నేపథ్యంలో12 వందల కోట్ల పెట్టుబడితో 60,000 బీటీఎస్ లను ఇన్ స్టాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా .ఇదేసమస్యపై టెలికాం కంపెనీల సీఈవోలతో కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా రేపు(నవంబర్ 1) సమావేశం కానున్నారు. -
బాలుడిని కిరాతకంగా చంపి.. రక్తం తాగి..
హంట్స్‌విల్లే: అతి కిరాతకంగా ఓ పన్నెండేళ్ల బాలుడిని చంపడమే కాకుండా ఆ బాలుడి రక్తాన్ని తాగిన క్రూరుడికి అమెరికా పోలీసులు మరణశిక్షను అమలు చేశారు. 1998లో జరిగిన ఈ ఘటనపై యూఎస్ అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు విచారించిన తర్వాత ఈ శిక్షను విధించింది. ఏడో తరగతి చదువుతున్న డేవిడ్ కార్డెన్నాను పాబ్లో లుసియో వాస్క్యూజ్ (38) అనే వ్యక్తి ఇనుప పైపుతో కొట్టి గొంతుకోసి చంపాడు. పోలీసు అధికారులకు అతడు ఇచ్చిన చివరి వాంగ్మూలంలో తాను ఆ బాలుడిని చంపిన తర్వాత అతడి రక్తాన్ని తాగానని చెప్పాడు. ఆఖరిసారి తన కుటుంబ సభ్యులను జైలు లోపలే ఉండి కిటికీ ద్వారా కలుసుకున్న లుసియో తనను కలిసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. వారి పక్కనే ఉన్న బాలుడి కుటుంబ సభ్యుల వైపు చూసి తనను క్షమించాలని కోరుకున్నాడు. 'నేను చేయగలిగింది ఇదొక్కటే.. ఈ రోజు మీకు న్యాయం జరుగుతుంది' అంటూ తన చివరి మాటలుగా చెప్పాడు. కాగా, లుసియో కుటుంబ సభ్యులు మాత్రం అతడి మరణశిక్షపై మాట్లాడేందకు నిరాకరించారు. లుసియోకి పెంటోబార్బిటోన్ ఎక్కువ మోతాదులో ఇచ్చిన 24 నిమిషాల అనంతరం మరణించినట్లు అధికారులు తెలిపారు. -
చిన్నారులను అమ్మేసిన వ్యక్తికి ఉరిశిక్ష
22 మంది శిశువులను కొనుగోలు చేసి మరో ప్రాంతంలో అమ్మేసిన వ్యక్తిని చైనాలో శుక్రవారం ఉరితీశారు. సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లో ఉరి శిక్ష అమలు చేసినట్టు సుప్రీం పీపుల్స్ కోర్టు (ఎస్పీసీ) శుక్రవారం వెల్లడించింది. 2008 నుంచి 2013 వరకు టాన్ యాంగ్జీ (69) మరో ఇద్దరితో కలిసి నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి పిల్లలను కొనుగోలు చేసి హెనన్ ప్రావిన్స్‌లో అమ్మేశాడు. ఇలా మొత్తం 22 మంది పిల్లలను అమ్మేసినట్టు తేలింది. 2014లో ఉరిశిక్ష విధించిన సమయంలో తాను తప్పేమీ చేయలేదని, పిల్లలు లేనివారికి మంచే చేశానని టాన్ సమర్థించుకున్నాడు. మగ శిశువులను 30,000 యువాన్లకు, ఆడ శిశువులను 16,000 యువాన్లకు కొనుగోలు చేసేవాడు. వారిని వెయ్యి నుంచి మూడు వేల యువాన్ల లాభంతో అమ్మేసేవాడని తేలింది. గతంతో పోలిస్తే ఇప్పుడు చైనాలో మహిళలు, పిల్లల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో ఇలాంటి కేసుల్లో మొత్తం 1,362 మందికి జైలుశిక్ష విధించారు. ఇది 2012తో పోల్చితే 50 శాతం తక్కువ. -
సౌదీ అరేబియాలో 47 మందికి ఉరి అమలు
-
12 నెలల్లో 175 మందికి ఉరి
దుబాయి : గడిచిన 12 నెలల్లో దాదాపు 175 మందికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఉరి శిక్ష వేసింది. ఈ మేరకు ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్ మంగళవారం వెల్లడించింది. అందుకు సంబంధించి కిల్లింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జస్టిస్ : ద డెత్ పెనాల్టీ ఇన్ సౌదీ అరేబియా పేరిట 43 పేజీల పేజీల నివేదికను ఈ సందర్భంగా విడుదల చేసింది. 1985 జనవరి నుంచి 2015 జూన్ వరకు 2,208 మందికి దేశంలో ఉరిశిక్షను అమలు చేసినట్లు అందులో పేర్కొంది. అయితే ఉరిశిక్ష పడిన ప్రతి ఒక్కరి పేరు ఆ నివేదకలో పొందుపరచబడిందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 109 మందికి ఉరిశిక్షలు అమలయ్యాయని పేర్కొంది. అదే 2014 సంవత్సరంలో ఇదే కాల వ్యవధిలో 83 మందికి ఉరిశిక్ష పడినట్లు తెలిపింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అత్యాచారాలు, హత్యలను సౌదీ అరేబియా ఉక్కుపాదంతో అణివేసేందుకు కఠినతరమైన శిక్షలు అమలు చేస్తున్న విషయం విదితమే. -
ఉరి అమలు ఇలా
-
పాక్‌లో ఇద్దరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావెన్స్లో ఇద్దరు ఖైదీలకు మంగళవారం ఉరిశిక్షను అమలు చేశారని మీడియా వెళ్లడించింది. 2002 కరాచీలో ముహ్మమద్ ఖాన్ ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఖాన్‌ను సర్గోదా జిల్లా జైలులో ఉరి తీసినట్లు తెలిపింది. అలాగే 1998లో వరుస సోదరుడిని హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన కైజర్‌ను మెయిన్వాలి సెంట్రల్ జైల్లో ఉరి తీశారని పేర్కొంది.