బాలుడిని కిరాతకంగా చంపి.. రక్తం తాగి.. | US-EXECUTION Texas executes man for killing 12-year-old boy | Sakshi
Sakshi News home page

బాలుడిని కిరాతకంగా చంపి.. రక్తం తాగి..

Published Thu, Apr 7 2016 5:51 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

బాలుడిని కిరాతకంగా చంపి.. రక్తం తాగి.. - Sakshi

బాలుడిని కిరాతకంగా చంపి.. రక్తం తాగి..

హంట్స్విల్లే: అతి కిరాతకంగా ఓ పన్నెండేళ్ల బాలుడిని చంపడమే కాకుండా ఆ బాలుడి రక్తాన్ని తాగిన క్రూరుడికి అమెరికా పోలీసులు మరణశిక్షను అమలు చేశారు. 1998లో జరిగిన ఈ ఘటనపై యూఎస్ అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు విచారించిన తర్వాత ఈ శిక్షను విధించింది. ఏడో తరగతి చదువుతున్న డేవిడ్ కార్డెన్నాను పాబ్లో లుసియో వాస్క్యూజ్ (38) అనే వ్యక్తి ఇనుప పైపుతో కొట్టి గొంతుకోసి చంపాడు. పోలీసు అధికారులకు అతడు ఇచ్చిన చివరి వాంగ్మూలంలో తాను ఆ బాలుడిని చంపిన తర్వాత అతడి రక్తాన్ని తాగానని చెప్పాడు.

ఆఖరిసారి తన కుటుంబ సభ్యులను జైలు లోపలే ఉండి కిటికీ ద్వారా కలుసుకున్న లుసియో తనను కలిసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. వారి పక్కనే ఉన్న బాలుడి కుటుంబ సభ్యుల వైపు చూసి తనను క్షమించాలని కోరుకున్నాడు. 'నేను చేయగలిగింది ఇదొక్కటే.. ఈ రోజు మీకు న్యాయం జరుగుతుంది' అంటూ తన చివరి మాటలుగా చెప్పాడు. కాగా, లుసియో కుటుంబ సభ్యులు మాత్రం అతడి మరణశిక్షపై మాట్లాడేందకు నిరాకరించారు. లుసియోకి పెంటోబార్బిటోన్ ఎక్కువ మోతాదులో ఇచ్చిన 24 నిమిషాల అనంతరం మరణించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement