Iran players stay silent for national anthem in apparent support for protests - Sakshi
Sakshi News home page

FIFA World CUP 2022: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్‌ ఆటగాళ్ల నిరసన

Published Tue, Nov 22 2022 10:24 AM | Last Updated on Tue, Nov 22 2022 11:00 AM

Iran players stay silent for anthem in apparent support for protests - Sakshi

ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఇరాన్‌ పై ఇంగ్లండ్ 6-2తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరాన్‌ ఆటగాళ్ల చర్య ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు జట్ల జాతీయ పతాకాలతో జాతీయ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపనలో భాగమయ్యారు.

కానీ ఇరాన్‌ ఫుట్‌బాలర్లు మాత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో తమ జాతీయ గీతం వినిపిస్తున్నప్పటికీ శ్రుతి కలపకుండా మౌనంగా నిరసన తెలిపారు. వారి దేశంలో హిజాబ్‌ కట్టుబాట్లపై ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం వల్ల కొన్ని నెలలుగా ఇరాన్‌ అగ్నిగుండం అవుతోంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో మహిళా నిరసనకారుల గళానికి ఇరాన్‌ ఆటగాళ్లు దోహాలో తమ మౌనాన్ని జత చేశారు.
చదవండి: FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్‌ శుభారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement