డీకే శివకుమార్
మంగళూరు: కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై జరుగుతున్న వివాదం యువత మనసులను విషపూరితం చేసే కుట్రలో భాగమని కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. మంగళూరులోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వస్త్రధారణపై జరుగుతున్న వివాదాలు మన దేశాన్ని అవమానం పాల్జేచేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
నిరుద్యోగం, పెట్రో ధరల పెంపు వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా హిజాబ్ ధరించడం వంటి సున్నితమైన విషయాలను స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు వాడుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థులు, ప్రజల్లో అశాంతి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పంథాను అనుసరిస్తోందని గుర్తు చేశారు. రాజ్యాంగంపై అందరికీ విశ్వాసం ఉందని, హిజాబ్ వివాదం త్వరలోనే సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్ణాటక కోస్తా ప్రాంతం తనదైన చరిత్ర, సంస్కృతి, మానవ వనరులను కలిగి ఉందని.. ఎడ్యుకేషన్ హబ్‌గా పేరుగాంచిందని శివకుమార్ తెలిపారు. హిజాబ్ వివాదానికి ఆజ్యం పోసి యువత మనసుల్లో విషం నింపే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్’పై అదే రగడ)
Comments
Please login to add a commentAdd a comment