హిజాబ్ వివాదంపై కర్ణాటక అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కాలేజీలో చిన్నపాటి గొడవగా మొదలై చినికి చినికి గాలి వానల మారిన రగడ దేశాన్ని కుదిపేస్తోంది. రాజకీయ నాయకులు కూడా హిజాబ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ హిజాబ్ రగడపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు.
చదవండి: హిజాబ్ వ్యవహారం: అత్యవసర పిటిషన్‌కు సుప్రీం నో.. చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏఎన్‌ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' హిబాజ్ అనే పదానికి ఇస్లాంలో పరదా అనే అర్థం ఉంది. యువతులు తమ అందాన్ని దాచుకోవడానికి హిజాబ్‌ను ధరించాల్సి ఉంటుంది. దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం మహిళలు హిజాబ్ ధరించకపోవడమే. అంటూ పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయేమోనని ఎమ్మెల్యే జమీర్ వెంటనూ మాట మార్చారు. హిజాబ్ అనేది కచ్చితంగా ధరించాలనే రూల్ ఏం లేదు. ఎవరైతే తమ అందాన్ని కాపాడుకోవాలనుకుంటారో.. ఇతరుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు మాత్రమే హిజాబ్‌ను ధరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది అమలులో ఉంది'' అంటూ చెప్పుకొచ్చారు. కాగా జమీర్ అహ్మద్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్‌తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. అంతేకాదు విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది.
చదవండి: పాఠశాలలు ప్రశాంతమేనా?.. ఉద్రిక్తతల మధ్య నేడు పునఃప్రారంభం
#WATCH | Hijab means 'Parda' in Islam...to hide the beauty of women...women get raped when they don't wear Hijab: Congress leader Zameer Ahmed on #HijabRow in Hubli, Karnataka pic.twitter.com/8Ole8wjLQF
— ANI (@ANI) February 13, 2022
Comments
Please login to add a commentAdd a comment