టెహ్రాన్: హిజాబ్ ధరించకుండా పాట పాడి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్టూ అహ్మదీ(27)ని ఇరాన్ అధికారులు అరెస్ట్ చేశారు. సారి నగరంలో శనివారం అధికారులు పరస్టూను అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తరఫు లాయర్ మిలాద్ చెప్పారు. ఆన్‌లైన్ కచేరీలో ఆమె హిజాబ్ ధరించలేదు. భుజాలు కనిపించే నల్ల రంగు డ్రెస్ వేసుకున్నారు. ఆమె అరెస్ట్‌కు కారణాలను, ఎక్కడ నిర్బంధంలో ఉంచిందీ అధికారులు వెల్లడించలేదు.
కచేరి సమయంలో ఆమెతో కనిపించిన కళాకారుల్లో సొహైల్ నసిరీ, ఎహ్సాన్ బెయిరగ్ధార్‌లనూ అరెస్ట్ చేశారు. న్యాయ శాఖ అధికారులతో మాట్లాడి, నిర్బంధం గురించి తెలుసుకుంటామని లాయర్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ లేకుండా సోలోగా పాడటాన్ని ఇరాన్ నిషేధించింది. హిజాబ్ ధరించకుండా కనిపించిన అమినీ అనే యువతి పోలీసు నిర్బంధంలో ఉండగా చనిపోవడం 2022లో ఇరాన్ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment