బెంగళూరు :కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ నిషేదంపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడూతు సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో హిజాబ్‌పై మళ్లీ చర్చ స్టార్టైంది. తమ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేదాన్ని ఇంత వరకు ఎత్తివేయలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్పందించింది. అసలు రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేదమే లేనప్పుడు దాన్ని ఎలా ఎత్తివేస్తారని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. డ్రెస్ కోడ్ అమలులో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే హిజాబ్‌ను అనుమతించడం లేదని మిగిలిన చోట్ల అంతా మామూలేనని బొమ్మై అన్నారు.
మరోపక్క హిజాబ్ నిషేదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేదం ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు. ఇంకా దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment