మహిళా పోలీసుల కోసం బురఖా యూనిఫాం
చట్టాలు ఏవిధంగా ఉన్నా ప్రతీ దేశంలో పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు, వారి యూనిఫాం(రంగులు వేరైనా) ఒకే రకంగా ఉంటాయి.
లండన్: చట్టాలు ఏవిధంగా ఉన్నా ప్రతీ దేశంలో పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు, వారి యూనిఫాం(రంగులు వేరైనా) ఒకే రకంగా ఉంటాయి. కాగా ముస్లిం మహిళలు పోలీస్ శాఖలో చేరేందుకు స్కాట్ లాండ్ పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. వారి కోసం బురఖా యూనిఫాంను అమలు చేయనున్నారు. పోలీసు శాఖలో ముస్లిం మహిళలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్కాట్ లాండ్ పోలీస్ అధికారి పీటర్ బ్లేయిర్ తెలిపారు.
ఇందుకోసం బ్రిటన్ లో అతి పెద్దదైన స్కాట్ లాండ్ పోలీసు యార్డు అనేక డిజైన్లను రూపొందించింది. మొహం తప్పించి ఒళ్లంతా కప్పి ఉండే బురఖా తరహాలో యూనిఫాంను రూపొందించారు. దీంతో ఇక నుంచి బురఖా ధరించిన మహిళా పోలీసులు స్కాంట్లాండ్ పోలీసు శాఖలో దర్శనమివ్వనున్నారు. స్కాట్లాండ్ లో 650 మైనారిటీ తెగల ప్రజలుంటే గతేడాది వీరి నుంచి 125 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో పోలీస్ శాఖలో వీరి ప్రాతినిథ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటర్ బ్లెయిర్ తెలిపారు.