బురఖా తీయమన్నందుకు పరిహారం ఎంతో తెలుసా?
లాస్ ఏంజెల్స్: అమెరికాలోని ఓ ముస్లిం మహిళ భారీ పరిహారాన్ని అందుకున్నారు. పోలీసు కస్టడీలో ఉన్నపుడు ఆమె బురఖాను తొలగించాలని ఆదేశించినందుకు గాను 85,000 డాలర్లు (రూ.55లక్షలు) పోలీసులు అధికారులు చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో అమెరికన్ -ముస్లిం కౌన్సిల్ ఈ తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే..కిరిస్టీ పావెల్ తన భర్తతో కలిసి వెడుతుండగా దొంగతనం కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా అధికారి కావాలని పావెల్ భర్త కోరినా పోలీసులు నిరాకరించడంతో పాటు ఆమెను బురఖాను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఒక రాత్రంతా ఆమె తలమీద స్కార్ఫ్ లేకుండానే జైలులో గడపాల్సివచ్చింది. తమ మతాచారాన్ని పాటించకుండా తీవ్రమైన అసౌకర్యానికి, ఆవేదనకు గురయ్యానని తెలపింది. తీవ్రమైన దుఃఖంతోపాటు మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆరోపించింది. పోలీసు విభాగం తన మొదటి రాజ్యాంగహక్కులను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ 2016 ఏప్రిల్ లో దావా వేశారు. దీనిపై విచారించిన అమెరికన్-ఇస్లామిక్ సంబంధాల కౌన్సిల్ ఆమెకు 85వేల డాలర్లు చెల్లించాల్సిందిగా కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ పోలీస్‌స్టేషన్‌ను ఆదేశించింది. అంతేకాదు పావెల్ ధైర్యాన్ని ప్రశంసించింది. తమ హక్కుల రక్షణ కోసం ముస్లిం సోదరీమణులు ధైర్యంగా నిలబడాలని కోరింది.