lawsuit
-
యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్‌లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్‌కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్‌క్యాస్ట్‌లు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. -
మస్క్ రివర్స్ గేర్! నిన్న వార్నింగ్.. నేడు కేసు విత్‌డ్రా
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఐఫోన్లలో చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగిస్తే... తమ సంస్థలో ఆ ఫోన్లను నిషేధిస్తామని యాపిల్‌కు వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఇలా ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే... ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ మస్క్ వెనక్కి తగ్గడం వెనక ఆంతర్యం ఏంటి?ఓపెన్ ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై దాఖలు చేసిన దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు కాలిఫోర్నియా కోర్టులో మస్క్ న్యాయవాదులు తెలిపారు. మస్క్ తరపున వాదించిన అటార్నీలు.. ఆ దావాను కొట్టేయాలని కోర్టును కోరారు. ఫిబ్రవరిలో ఆ దావాను దాఖలు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా రద్దుకు చెందిన ఫైలింగ్ నమోదు చేశారు. మానవాళి ఉపయోగం కోసం కృత్రిమ మేథను డెవలప్ చేయాలని, లాభాల కోసం కాదన్న అంశంపై ఆల్ట్‌మాన్‌పై మస్క్ దావాను దాఖలు చేశారు. అయితే చాట్ జీపీటీ డెవలప్ చేసిన ఓపెన్ ఏఐతో పాటు ఆల్ట్‌మాన్‌పై కేసును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు.అయితే, ఈ పరిణామానికి ముందే చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐ విషయంలోనే యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది. చాట్‌జీపీటీ కోసం ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు కట్టడాన్ని టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తప్పుబట్టారు. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇలాన్ మస్క్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే తమ టెస్లా కంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తామని కూడా మస్క్ తెలిపారు.కాగా, ఓపెన్ ఏఐపై దాఖలు చేసిన దావాను మస్క్ వెనక్కి తీసుకోవడంలో మతలబు దాగుందని సాంకేతిక, న్యాయ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, ఫిబ్రవరిలో దాఖలు చేసిన దావాపై బుధవారం విచారణ జరగాల్సివుంది. అయితే, సరిగ్గా విచారణకు ముందే తన వ్యాజ్యాన్ని విత్‌డ్రా చేసుకున్నారు మస్క్. ఆయన దాఖలు చేసిన దావాలో పస లేదని, అలాగే తన సొంత ఏఐ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే... మస్క్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, మస్క్... మున్ముందు ఏదోఒక సమయంలో ఓపెన్ఏఐ సంస్థపై తన దావాను రీఫైల్ చేయొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. -
లోగో రీబ్రాండింగ్ చిక్కులు: మస్క్‌కు షాకిచ్చిన మార్కెటింగ్ ఏజెన్సీ
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్లో మరోసారి చిక్కుల్లోపడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఐకానిక్ ‘బర్డ్ లోగో’ను మార్చిదాని ప్లేస్‌లో ‘ఎక్స్’గా మారుస్తూ ఈ ఏడాది జూలైలో మాస్క్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్స్ అనే కంపెనీ కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. ట్రేడ్‌మార్క్ , సర్వీస్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్విటర్ లోగో రీబ్రాండ్ తరువాత ఇలాంటి కోర్టు కేసును ఎదుర్కోవడం ఇదే తొలిసారి. (ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!) ఫ్లోరిడాకు చెందిన అడ్వర్టైజింగ్ , సోషల్ మీడియా సర్వీస్ కంపెనీ ఎక్స్ ..ట్విటర్ పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ ట్రేడ్‌మార్క్ "X" గుర్తును ఉపయోగించి మార్కెటింగ్, విక్రయించడం లేదా పంపిణీ లాంటి వాటినుంచి ఎక్స్‌ను నిషేధించాలని కోరుతోంది. అంతేకాదు మస్క్ ఎక్స్ సేవలు, ప్రకటనలు తమ వినియోగదారులు గందరగోళానికి గురయ్యారని ఎక్స్ పేర్కొంది. తన నష్టాలకు లేదా ప్రతివాది లాభాలకు మూడు రెట్లు సమానమైన పరిహారాన్ని అందించాలని కోరింది. ఈ ప్రమాదాన్ని ముందేఊహించిన ట్రేడ్ మార్క్ నిపుణులు తాజా పరిణామంతో ఇప్పటికే లాభాలు క్షీణించి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మస్క్‌కు మరింత దెబ్బేనని భావిస్తున్నారు. కాగా గతేడాది ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. భారతీయ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడం, వేలాదిమంది ఇతర ఉద్యోగుల తొలగింపులు, ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు, కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు లాంటివి ఉన్నాయి. తాజాగా గేమ్ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫారమ్‌ని సరిచేయడానికి లైవ్ షాపింగ్ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది. -
‘మెటా’పై తీవ్ర ఆరోపణలు! కేసు వేసిన ఉద్యోగిని
Lawsuit on Meta: యూఎస్ టెక్ దిగ్గజం మెటా (Meta) జాతి వివక్షకు పాల్పడుతోందని, ఆసియన్లను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ వైష్ణవి జయకుమార్ అనే సింగపూర్‌కు చెందిన భారతీయ సంతతి ఉద్యోగిని కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగంలో దావా వేశారు. 2020 జనవరిలో మెటా కంపెనీలో చేరిన ఆమె అంతకు ముందు డిస్నీ, గూగుల్, ట్విటర్ సంస్థల్లో పనిచేశారు. ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తనను తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల కింద చేర్చి అవకాశాలు లేకుండా చేశారని వైష్ణవి వాపోయారు. ఆసియన్ మహిళ అయిన తనపై ఎలా జాతి వివక్ష చూపారో వైష్ణవీ జయకుమార్ ఇటీవలి లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. గత నెలలో మాస్ లేఆఫ్‌ల రూపంలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. మెటా కంపెనీలో యూత్ పాలసీ హెడ్‌గా ఉన్న వైష్ణవీ జయకుమార్ మెటా యాప్‌లన్నింటిలో వయసు ఆధారిత పాలసీలు, ఉత్పత్తి లక్షణాలపై పనిచేసే బృందానికి నాయకత్వం వహించేవారు. మొదటి రెండేళ్లు అంతా బాగానే జరిగిందని, ఆ తర్వాత ప్రమోషన్ గురించి అడిగినప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నట్లు వైష్ణవి పేర్కొన్నారు. తన మేనేజర్ ఉన్నట్టుండి జాతి వివక్ష చూపడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. తనకు ఇతర అభ్యర్థుల కంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలకు తాను సీనియర్ని కానంటూ యాజమాన్యానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వాపోయారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతమే.. వైష్ణవీ జయకుమార్ తన దావాలో ఆసియా, పసిఫిక్ ద్వీపవాసుల నిపుణుల నెట్వర్క్ ‘అసెండ్’ 2022లో చేసిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించారు. దాని ప్రకారం మెటా కంపెనీలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 49 శాతం మంది ఆసియన్లు ఉంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో 25 శాతం మంది మాత్రమే ఆసియన్లు ఉన్నారు. 2022 చివరి నాటికి మెటా కంపెనీ 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలో మరో రౌండ్ మాస్ లేఆఫ్‌లలో మరో 10,000 మందికి ఉద్వాసన పలికింది. సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలంగా ఉన్న జాతి వివక్షకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని కోరుతూ టెక్ పరిశ్రమలో ఆసియా అమెరికన్లు దాఖలు చేసిన అనేక వ్యాజ్యాలలో వైష్ణవీ జయకుమార్ వేసిన దావా కూడా ఒకటి. అయితే ఈ ఆరోపణలపై మెటా కంపెనీ వర్గాల నుంచి ఇంతవరకు ఎటువంటి వివరణ రాలేదు. ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై కోర్టులో దావా: ఇష్టమొచ్చినట్లు తొలగించడం కాదు.. కట్టు రూ. 4వేల కోట్లు! -
మెటాకు భారీ షాక్..మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఆఫ్రికన్లను ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు హింసను ప్రేరేపించేలా వ్యవహరించిందంటూ మెటాపై పిటిషనర్లు పరువు నష్టం దావా వేశారు. అందుకు పరిహారంగా మెటా తమకు 2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి డిమాండ్ చేశారు. ఆ పిటిషన్‌ను ఇథియోపియన్ పరిశోధకులు అబ్రమ్ మీరెగ్,ఫిస్సెహా టెక్లే, కెన్యా మానవ హక్కుల సభ్యులు, కటిబా ఇన్స్టిట్యూట్తో పాటు చట్టపరమైన లాభాపేక్షలేని ఫాక్స్‌గ్లోవ్ సహకారంతో కెన్యా హైకోర్టులో దాఖలు చేశారు. గత నవంబర్‌లో మీరెగ్ తండ్రి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ మీరెగ్ అమరేను’పై దాడికి చేసేలా ప్రోత్సహించేలా మెటాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టులు షేరింగ్ తర్వాత గుర్తుతెలియని దుండగులు అమరేను ఇంట్లోకి వెళ్లి కాల్చిచంపినట్లు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..మెటా "తన ప్లాట్‌ఫారమ్‌లో హింసను పరిష్కరించడంలో వైఫల్యం, ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా ప్రమాదకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించేలా ప్రాధాన్యతనిచ్చే మెటా నుంచి ప్రజలకు రక్షణ అవసరమని పిటిషనర్లు ఈ సందర్భంగా వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది. అంతేకాదు 2021లో 117.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన మెటా సిఫార్సు అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతిక ఆధారంగా ప్రజలు ఏ కంటెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారో.. అందుకు అనుగుణంగా ఆ కంటెంట్‌ను ప్రచారం చేస్తోంది. దీంతో వ్యాపారస్తులు యాడ్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలా మెటా తన ఆదాయాన్ని పెంచుంటున్నట్లు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నివేదించారు. ఈ సందర్భంగా మెటా ఈ తరహా కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు కోర్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తమకు జరిగిన నష్టం కింద సదరు సోషల్ మీడియా సంస్థ 2 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
చిక్కుల్లో సుందర్ పిచాయ్...! అదే జరిగితే..?
ఇన్‌కాజినెటో (Incognito) బ్రౌజింగ్ విషయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. యూజర్ల ప్రైవసీ విషయంలో గూగుల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. కోర్టు ముందుకు సుందర్..! గోప్యత విషయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ప్రశ్నించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇన్‌కాజినెటో బ్రౌజింగ్ మోడ్ ద్వారా ఆల్ఫాబెట్.ఇంక్ యూజర్ల ఇంటర్నెట్ వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ట్రాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుందర్ పిచాయ్‌ను రెండు గంటలపాటు ప్రశ్నించాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్ జడ్జి తీర్పునిచ్చారు. జూన్ 2020లో దాఖలు చేసిన దావాలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో యూజర్లు ప్రైవేట్ మోడ్‌కు వెళ్లినప్పడు యూజర్‌కు తెలియకుండా ఇంటర్నెట్ వినియోగాన్ని ట్రాక్ చేసిందని ఒక వ్యక్తి గూగుల్‌ను ఆరోపించారు. అన్నీ తెలిసే..! గూగుల్ సీఈవో సుందర్‌కు ఇన్‌కాజినెటో మోడ్‌పై వచ్చిన ఆరోపణలు ముందుగానే అతడికి తెలుసునని కోర్టులో వాదించారు. ప్రైవేట్ మోడ్‌లో యూజర్ల ప్రైవసీకి భంగం కల్గించేలా కంపెనీ పాల్పడిందని ఆరోపించారు. అవాస్తవమైనవి..! సదరు వ్యక్తి కోర్టులో చేసిన ఆరోపణలపై గూగుల్ స్పందించింది. అతడు చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా రాయిటర్స్‌తో అన్నారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలపై కంపెనీ సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు 2019లో హెచ్చరించిన సుందర్..! గూగుల్ క్రోమ్ ఇన్‌కాజినెటో బ్రౌజింగ్ విషయంలో 2019లోనే సుందర్ పిచాయ్ యూజర్లను హెచ్చరించారు. ఇన్‌కాజినెటో మోడ్ సమస్యాత్మకమైందని అప్పట్లో అన్నారు. ఇన్‌కాజినెటో మోడ్ కేవలం యూజర్ల డేటాను సేవ్ చేయకుండా ఆపివేస్తుందని గూగుల్ గతంతోనే పేర్కొంది. ఇటీవలి కాలంలో యూజర్లు అల్ఫాబెట్ యూనిట్‌పై గోప్యతా, ఆన్లైన్ నిఘాపై ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్..! ఈ యాప్స్ ఫోన్లో ఉంటే..మీ ఖాతాలు ఖాళీ..! చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
జుకర్ బర్గ్‌పై మరో పిడుగు, ఫ్రాన్సెస్ హౌగెన్ ఎంత పని చేశావమ్మా..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ షాక్ తగిలింది. ఒహాయో అటార్నీ జనరల్ డేవిడ్ యోస్ట్ మెటాపై (ఫేస్బుక్) దావా వేశారు. ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌగెన్ విజిల్ బ్లోవర్‌గా మారి..ఫేస్బుక్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె చేస్తున్న ఆరోపణల కంటే ఇప్పుడు ఒహాయో అటార్నీ జనరల్ వేసిన దావా చాలా ప్రమాదకరమని న్యాయనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి పెట్టిన చిచ్చుకంటే ఇదే పెద్దది ఓహియో అటార్నీ జనరల్ మెటాపై పరువు నష్టం దావా వేశారు. ఫెడరల్ సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. అంతేకాదు ఒహాయో పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారుల తరపున ఈ కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగిగా మారిన విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సిస్ హౌగెన్ మొదట వాల్ స్ట్రీట్ జర్నల్‌కు అంతర్గత పత్రాలను లీక్ చేశారు. ఆ లీక్ చేసిన డాక్యుమెంట్లు కారణంగా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్, ఫేస్బుక్ పెట్టుబడిదారులు 100 బిలియన్ల మార్కెట్ వాటాను కోల్పోయినట్లు డేవిడ్ యోస్ట్ చెప్పారు. అయితే ఈ దావా మార్క్ జుకర్బర్గ్లాంటి వ్యక్తుల గురించి కాదని, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యవస్థలపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ దావాతో పెన్షన్ ఫండ్ నష్టాలను తిరిగి పొందవచ్చని, అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఉండటానికి కంపెనీ మార్పులు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు యోస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్బుక్ పై కఠిన చర్యలు తప్పవ్ డేవిడ్ యోస్ట్ చేసిన కేసు అంశంపై మెటా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌పై నమోదైన ఫిర్యాదుల కంటే యోస్ట్ వంటి రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన కేసు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎనలిస్ట్ బ్లెయిర్ లెవిన్ చెప్పారు. కోర్టు మెటాను మరిన్ని అంతర్గత పత్రాలను పబ్లిక్ చేయమని ఆదేశించే అవకాశం ఉందని, తద్వారా ఫేస్‌బుక్‌కు మరిన్ని చిక్కులు తప్పవని లెవిన్ చెప్పారు. గతంలోనే యోస్ట్ లేఖ 40 మంది రాష్ట్ర అటార్నీ జనరల్‌లలో ఒకరైన యోస్ట్ గతంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్‌కు లేఖ రాశారు. పిల్లల కోసం డిజైన్ చేసే ఇన్స్టాగ్రామ్ వెర్షన్‌పై ఆంక్షలు విధించాలని జుకర్ బెర్గ్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. -
ఎలన్ మస్క్ నెత్తిన పిడుగు.. 70వేల కోట్ల ఫైన్!
Elon Musk Solarcity Lawsuit: టెక్ మేధావి ఎలన్ మస్క్‌కి భారీ షాక్ తగలనుందా?. అదీ సొంత ప్రాజెక్టు సోలార్ సిటీ నుంచే!. అవుననే అంటున్నాయి కొన్ని మీడియా కథనాలు. సోలార్ సిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మస్క్.. అందులో మేజర్ షేర్ హోల్డర్ కూడా. ఈ క్రమంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. తాజాగా ఓ ఇన్వెస్టర్ ఆయన మీద కోర్టుకు ఎక్కగా.. ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్ డాలర్ల భారీ జరిమానా మస్క్ చెల్లించాల్సి వస్తుందట!. బ్లూమరాంగ్ కథనం ప్రకారం.. సోలార్సిటీకి సంబంధించిన ఇన్వెస్టర్ ఒకరు మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. షేర్ హోల్డర్స్ అభిప్రాయాలు, సమ్మతి తీసుకోకుండానే ఎలన్ మస్క్ సుమారు 2.6 బిలియన్ డాలర్ల డీల్ ఒకటి కుదుర్చుకున్నాడనేది ఇన్వెస్టర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు షేర్ హోల్డర్స్ ప్రాధాన్యం తగ్గిస్తూ.. లాభాలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని, తన వరకు తనకు సంబంధించిన వాటా కోసం కోర్టును ఆశ్రయించినట్లు సదరు షేర్‌హోల్డర్ పేర్కొన్నాడు. ఇక ఈ దావాకు మిగతా షేర్ హోల్డర్స్‌లో కొందరు మద్దతు ప్రకటించడం విశేషం. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మస్క్ 9.4 బిలియన్ డాలర్ల జరిమానా(మన కరెన్సీలో దాదాపు 70 వేల కోట్లదాకా) చెల్లించాల్సి వస్తుందని బ్లూమరాంగ్ పేర్కొంది. ఇంతకుముందు కూడా.. గతంలో సోలార్ సిటీలో మస్క్ స్టాక్ షేర్ 2.4 మిలియన్గా ఉండేది. అయితే స్టాక్స్ పంపకం తర్వాత ఇప్పుడది 12 మిలియన్‌కు చేరుకుంది. దీంతో మస్క్ షేర్ విలువ 9.56 బిలియన్ డాలర్లగా ఉంది. ఇక టెస్లా సీఈవో హోదాలో ఉండి అన్నివ్యవహారాల్లో ఎలాగైతే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో.. ఇటు సోలార్ సిటీ స్టాక్ హోల్డర్స్‌ను ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే 2017లో టెస్లా షేర్ హోల్డర్స్ అంతా కలిసి మస్క్ మీద దావా కూడా వేశారు. కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడం, అధిక వాటాను లాగేసుకోవడం, సమర్థవంతులను పక్కకు తోసేయడం లాంటివి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి మస్క్‌పై. అయితే మస్క్ సంపాదన తప్పుడు దోవలో లేదని, 85 శాతం షేర్ హోల్డర్స్ ఈ ఆర్జనను ఆమోదిస్తున్నారని మస్క్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. చదవండి: చైనా బ్యాన్.. మస్క్ షాకింగ్ కామెంట్స్ -
‘ఇన్‌కాగ్నిటో మోడ్’లో బ్రౌజింగ్ సేఫ్ కాదు!
Google Incognito Browsing Mode Alleges Tracking Users: టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ.. టెక్ దిగ్గజాల లోటుపాట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్‌కి సంబంధించి సంచలన ఆరోపణలపై కోర్టు విచారణ కొనసాగుతుండగా.. తాజా వాదనల సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేరు ప్రస్తావనకు రావడం విశేషం. సెర్చింజన్ గూగుల్ క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ తెలుసు కదా!. సెర్చ్ హిస్టరీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. వ్యక్తిగతంగా సెర్చ్ చేసుకునేందుకు గూగుల్ యూజర్లకు కల్పించిన వెసులుబాటు ఇది. అయితే ఇందులోని సమాచారాన్ని సైతం గూగుల్ రహస్యంగా సేకరిస్తోందని, యూజర్ భద్రతకు గ్యారంటీ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కిందటి ఏడాది కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా.. గురువారం ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాలను పిటిషనర్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ అనేది సురక్షితం కాదని, గూగుల్‌కు అన్నీ తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెడుతోందన్నది తాజా ఆరోపణ. సుందర్ పిచాయ్ పేరు.. 2019లో గూగుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లొర్రాయిన్ ట్వోహిల్ నేతృత్వంలో ఓ ప్రాజెక్టు జరిగింది. ఆ ప్రాజెక్టు సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇన్‌కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ మీద అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో మోడ్ అనే ‘ప్రైవేట్’ బ్రౌజింగ్ వ్యవస్థలో బోలెడన్ని సమస్యలున్నాయని, తనకు ఆ ఫీచర్ అవసరం లేదని అనిపిస్తోందని సుందర్ ఆ ప్రాజెక్టు సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం. యూజర్‌ను ట్రాక్ చేసే ఈ వ్యవస్థ వల్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశమూ లేకపోలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతపెద్ద సమస్య తెలిసి కూడా ఆయన సీక్రెట్ బ్రౌజింగ్ మోడ్‌ను ప్రమోట్ చేశారనేది ఆరోపణ. ఈ మేరకు గూగుల్ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఈ పిటిషన్‌పై గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా స్పందించారు. సెకండ్, థర్డ్‌హ్యాండ్ అకౌంట్లకు సంబంధించిన తప్పుడు ఈమెయిల్స్ ద్వారా సేకరించిన సమాచారంతో గూగుల్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో నిఘా ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతోందని గూగుల్ మీద ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తుండగా.. గూగుల్ మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా యూజర్లకు వచ్చే ముప్పేమీ లేదని స్పష్టం చేస్తోంది. క్లిక్ చేయండి: గూగుల్ క్రోమ్‌లో వెతుకుతున్నారా? అయితే ఈ పని చేయండి! చదవండి: ఈ పిల్ల వయసు ఎప్పటికీ 22!! -
ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన ప్రత్యర్థి బిలియనీర్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలన్ మస్క్‌కు భారీ దెబ్బె కొట్టాడు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ విషయంలో యూఎస్ ప్రభుత్వంపై దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ కోర్టు మెట్లను ఎక్కింది. నాసా చంద్రుడిపై హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని బ్లూ ఆరిజిన్ సంస్థ కోర్టుకు వెళ్లింది. (చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...!) చివరికి జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ తన పంతం నెగ్గించుకుంది. నాసా తీసుకున్న ఏకపక్షనిర్ణయంపై యూఎస్ కోర్టు అక్టోబర్ 14న కేసును విచారించనుంది. దీంతో ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు అప్పగించిన మ్యూన్ ల్యాండర్ కాంట్రాక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడానికి నాసా అంగీకరించిందని గురువారం నాసా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. మ్యూన్ ల్యాండర్ మిషన్‌లో భాగంగా స్పేస్ఎక్స్కు సుమారు 2.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 21,587 కోట్లు) కాంట్రాక్ట్‌ను నాసా ఆఫర్ చేసింది. మ్యూన్ ల్యాండర్ మిషన్ ల్యాండర్ కోసం స్పేస్ఎక్స్, నాసా ఇరు పక్షాలు చేస్తోన్న పనులను ఈ ఏడాది నవంబర్ 1 వరకు తాత్కాలికంగా నిలిపివేయడానికి ఒప్పుకున్నాయి. ఇదిఇలా ఉండగా.. గత నెలలో యూఎస్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (జీఎఓ) బ్లూ ఆరిజిన్ ఎత్తి చూపిన అంశాన్ని తిరస్కరిస్తూ నాసాకు తన మద్దతును తెలిపింది. కాగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్ సంస్థ కోర్టుకు వెళ్లింది. నాసా తీసుకున్న ఏకపక్షనిర్ణయంలో ప్రాథమిక సమస్యలు ఉన్నాయని, తమ పరిమిత అధికార పరిధి కారణంగా జీఎఓ వాటిని పరిష్కరించలేకపోయిందని బ్లూ ఆరిజిన్ సంస్థ పేర్కొంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ మిషన్ కోసం నాసాకు భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసింది. తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయంపై స్పేస్ ఎక్స్ ఇంకా స్పందించలేదు. 1972 తరువాత నాసా ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా మరోసారి మానవులను చంద్రుడిపైకి తీసుకుళ్లే పనిలో భాగంగా అంతరిక్ష నౌక కోసం ప్రతిపాదనలు కోరింది. నాసా మ్యూన్ ల్యాండర్ మిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పేస్ ఎక్స్ దక్కించుకుంది. స్పేస్ ఎక్స్ 2024 లోపు మ్యూన్ లాండింగ్ రాకెట్‌ను రెడీచేయనుంది. (చదవండి: ఎలన్ మస్క్ కొత్త ప్లాన్.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!) -
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అమ్ముకోవాలా..?
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ సంస్థ గుత్తాధి పత్యానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం, 48 రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. మార్కెట్లో ఎలాంటి పోటీ లేకుండా చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఆ సంస్థ కొనుగోలు చేస్తూ ఏకాఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం కోర్టులో వేసిన దావాలో పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్‌కి చెందిన ఇన్స్టాగ్రామ్, మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లను ఆ సంస్థ విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. పక్కా ప్రణాళికతో గుత్తాధిపత్యం ఫేస్బుక్ పక్కా ప్రణాళికతో చిన్న సంస్థల్ని మింగేస్తూ మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణుల్ని కనబరుస్తోందని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ విమర్శించారు. 2012లో ఇన్స్ట్రాగామ్ని, 2014లో వాట్సాప్‌ని కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుందని అన్నారు. వినియోగదారులకు మరో ఎంపిక లేకుండా చేస్తూ ఏ కంపెనీని ఎదగనివ్వడం లేదని ఫెడరల్ కమిషన్ తన పిటిషన్లో పేర్కొంది. ఫేస్‌బుక్‌పై దావా వార్త బయటకు రాగానే ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. నిబంధనలకు అనుగుణంగానే ఫేస్బుక్ సంస్థ తాను ఏమి చేసినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశామని వాదిస్తోంది. ఏవైనా రెండు కంపెనీలు కలిసిపోవడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం కోర్టుకెక్కడం ఏమిటని ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు జెన్నిఫర్ న్యూస్టీడ్ అన్నారు. ఫెడరల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తోందని ఆరోపించారు. -
హెచ్1బీ కొత్త విధానంతో అమెరికాకే నష్టం
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థకి కీడు చేస్తుందని అక్కడి పలు సంస్థలు అభిప్రాయపడ్డాయి. కొత్త వీసా విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చర్స్‌తో సహా 17 వరకు సంస్థలు న్యాయస్థానంలో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉత్తర కొలంబియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ కొత్త విధానం వల్ల నైపుణ్యం కలిగిన వారు దేశానికి రారని, అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఈ వీసా విధానం అవరోధంగా మారుతోందని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళుతున్న ట్రంప్ ఈ నెల మొదట్లో హెచ్1బీ వీసా కార్యక్రమంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ వర్కర్లకి అధికంగా ఉద్యోగాలు లభించేలా, అత్యధిక స్కిల్ ఉన్న విదేశీ నిపుణులకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభించేలా ఈ వీసా విధానంలో మార్పులు చేశారు. దీనిని సవాల్ చేసిన వారిలో ఆర్థిక, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కొత్త వీసా విధానం అమెరికాలోని ప్రతీ రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. -
విప్రోపై అమెరికాలో ‘క్లాస్ యాక్షన్’ దావా
వాషింగ్టన్: ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం విప్రోపై అమెరికాలో అయిదుగురు ఉద్యోగుల బృందం క్లాస్ యాక్షన్ దావా వేసింది. దక్షిణాసియా, భారతీయ మూలాలున్న వారికే ప్రాధాన్యమిస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన కేసులో ఆరోపించింది. మొత్తం అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12% కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80% మంది ఉన్నారని (ప్రధానంగా భారతీయులు) ఉద్యోగుల బృందం పేర్కొంది. కోర్టులో వ్యాజ్యం ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించబోమని విప్రో తెలిపింది. -
దిగొచ్చిన పెప్సీకో.. కేసులు వాపస్
గాంధీనగర్ : శీతల పానీయాల దిగ్గజం పెప్సీకో ఇండియా దిగొచ్చింది. గుజరాత్ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. తమ కంపెనీ పేరుతో భారత్‌లో రిజస్టర్ అయిన బంగాళాదుంపను తన అనుమతి లేకుండా పండిచారనే నేపంతో పెప్సీకో కంపెనీ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దాంతో ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో కంపెనీ దిగొచ్చింది. రైతుల మీద పెట్టిన కేసులను వాపస్ తీసుకుంటున్నట్లు కంపెని అధికార ప్రతినిధి ప్రకటించారు. ‘ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మా కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది’ అని సదరు అధికారి తెలిపారు. ఈ వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో తెరమీదకొచ్చింది. తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ పెప్సీకో రైతుల మీద కేసులు పెట్టడమే కాక.. వారి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ అహ్మదాబాద్ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై కోర్టు కూడా… సానుకూలంగా స్పందించింది. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది. అంతేకాక తమ అనుమతి లేకుండా ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను పండించినందుకు గాను రూ. కోటి జరిమానా చెల్లించాలంటూ పెప్సీకో.. రైతులను డిమాండ్ చేసింది. -
కోర్టుకెక్కి.. పరిహారం గెలిచి..
అమెరికా టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఏ) నిర్లక్ష్యం కారణంగానే కెనడా టెన్నిస్ స్టార్ యూజినీ బౌచర్డ్ గాయపడిందని అమెరికా కోర్టు తేల్చింది. 2015 యుఎస్ ఓపెన్ సందర్భంగా లాకర్ రూమ్‌లో తాను జారిపడ్డానని, దాని వల్ల తన కెరీర్ దెబ్బతిందని ఆరోపిస్తూ, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని బౌచర్డ్ కోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి దశ విచారణ ముగించిన కోర్టు యూఎస్టీఏను తప్పుపట్టింది. లాకర్ రూమ్‌లో బౌచర్డ్ గాయపడటంలో ఆమె తప్పు 25 శాతం కాగా.. యూఎస్‌టీఏ నిర్లక్ష్యం 75 శాతం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై బౌచర్డ్ ఆనందం వ్యక్తం చేసింది. 'కోర్టు తీర్పులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రస్తుత తీర్పుతో నేను సంతోషంగా ఉన్నాను' అని బౌచర్డ్ తెలిపింది. తుది దశ విచారణ ముగిశాక బౌచర్డ్‌కు చెల్లించాల్సిన పరిహారంపై కోర్టు తీర్పు ఇస్తుంది. కోర్టులో బౌచర్డ్ దావా కాగా, 2014 ఏటీపీ ర్యాంకింగ్స్‌లో బౌచర్డ్ టాప్-5 లో చోటు దక్కించుకోవడంతో టెన్నిస్‌లో మరో స్టార్ రాబోతోందని టెన్నిస్ అభిమానులు అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారై బౌచర్డ్ కెరీర్ గాడి తప్పింది. ర్యాంకింగ్స్‌లో ఆమె ఏకంగా 116 వ స్థానానికి పడిపోయింది. అయితే తాను ఈ పరిస్థితికి చేరడానికి కారణం అమెరికా టెన్నిస్ సంఘం అని ఈ కెనడా స్టార్ ఆరోపించింది. 2015 యుఎస్ ఓపెన్ సందర్భంగా లాకర్ రూమ్‌లో కాలుజారి పడడంతో గాయపడ్డానని, అది తన కెరీర్‌ను దెబ్బతీసిందని ఆరోపిస్తూ.. తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ యూఎస్‌టీఏ పై బ్రూక్లిన్‌లోని డిస్ట్రిక్ కోర్టులో దావా వేసింది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో 2015 లో యుఎస్‌టీఏ గ్లాండ్ స్లామ్ టోర్నీని నిర్వహించింది. ఆ టోర్నీలో లాకర్ రూమ్‌లో తాను కాలు జారి కింద పడటంతో తీవ్రమైన నొప్పితో టోర్ని నుంచి వైదొలినట్టు విచారణ సందర్భంగా బౌచర్డ్ తెలిపింది. బాగా జారేలా, ప్రమాదకరంగా ఉన్న శుభ్రపరిచే పదార్థాలు వాడడం వల్లే నేను జారిపడ్డాను' అని ఆమె దావాలో పేర్కొంది. -
బురఖా తీయమన్నందుకు పరిహారం ఎంతో తెలుసా?
లాస్ ఏంజెల్స్: అమెరికాలోని ఓ ముస్లిం మహిళ భారీ పరిహారాన్ని అందుకున్నారు. పోలీసు కస్టడీలో ఉన్నపుడు ఆమె బురఖాను తొలగించాలని ఆదేశించినందుకు గాను 85,000 డాలర్లు (రూ.55లక్షలు) పోలీసులు అధికారులు చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో అమెరికన్ -ముస్లిం కౌన్సిల్ ఈ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే..కిరిస్టీ పావెల్ తన భర్తతో కలిసి వెడుతుండగా దొంగతనం కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహిళా అధికారి కావాలని పావెల్ భర్త కోరినా పోలీసులు నిరాకరించడంతో పాటు ఆమెను బురఖాను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఒక రాత్రంతా ఆమె తలమీద స్కార్ఫ్ లేకుండానే జైలులో గడపాల్సివచ్చింది. తమ మతాచారాన్ని పాటించకుండా తీవ్రమైన అసౌకర్యానికి, ఆవేదనకు గురయ్యానని తెలపింది. తీవ్రమైన దుఃఖంతోపాటు మానసిక ఒత్తిడికి లోనయ్యానని ఆరోపించింది. పోలీసు విభాగం తన మొదటి రాజ్యాంగహక్కులను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ 2016 ఏప్రిల్ లో దావా వేశారు. దీనిపై విచారించిన అమెరికన్-ఇస్లామిక్ సంబంధాల కౌన్సిల్ ఆమెకు 85వేల డాలర్లు చెల్లించాల్సిందిగా కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ పోలీస్‌స్టేషన్‌ను ఆదేశించింది. అంతేకాదు పావెల్ ధైర్యాన్ని ప్రశంసించింది. తమ హక్కుల రక్షణ కోసం ముస్లిం సోదరీమణులు ధైర్యంగా నిలబడాలని కోరింది. -
ఇన్ఫోసిస్ నెత్తిన మరో పిడుగు
బెంగళూరు: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నెత్తిన మరో పిడుగు పడింది. ఫౌండర్స్, ఇన్ఫీ మధ్య రగిలిన ప్యాకేజీ వివాదం రగులుతుండగానే మరో వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ లిమిటెడ్ అమెరికా ఇమ్మిగ్రేషన్ మాజీ హెడ్ ఎరిన్ గ్రీన్ తాజాగా కంపెనీపై దావా వేశారు. జాతి వివక్ష, సీనియర్ అధికారుల వేధింపులు, మేనేజ్మెంట్ కక్షపూరిత వైఖరి తదితర ఆరోపణలు గుప్పిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు తనకు భారీ నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ టెక్సాస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. 53 పేజీల ఫిర్యాదు పత్రంలో కంపెనీ సీనియర్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2011 లో ఇన్ఫోసిస్‌లో చేరిన ఎరిన్ గ్రీన్, ఉద్యోగి వివక్షత, సీనియర్ మేనేజ్మెంట్ సీనియర్లు తన ప్రతీకార ధోరణిలోవ్యవహరించారంటూ జూన్19న జూన్ 19 న టెక్సాస్ తూర్పు జిల్లాలోని ఒక జిల్లా కోర్టులో ఈ పిటీషన్వేశారు. ఇన్ఫోసిస్ ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌పై తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తారు. గ్లోబల్ ఇమ్మిగ్రేషన్ అధిపతి వాసుదేవ నాయక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , టెక్నాలజీ ఆపరేషన్స్ గ్లోబల్ హెడ్ వినోద్ హేంపాపుర్పై విమర్శలు చేశారు. గత ఏడాది సంస్థను విడిచిపెట్టాల్సిందిగా కోరడంపై ఆయన ఈ చర్యకు దిగారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది. కాగా ఇటీవల ప్రమోటర్లు కంపెనీలో వాటాలను విక్రయించనున్నారన్న వార్తల నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌కు దాద్లాని రూపంలో మరో షాక్ తగిలింది. కంపెనీ అమెరికా హెడ్, అంతర్జాతీయ ఉత్పత్తి, రిటైల్ విభాగ అధిపతి సందీప్ దాదాన్లీ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఆలస్యం.. అమృతం..!
‘‘ఎప్పటికీ జరగకపోవడం కంటే.. ఆలస్యంగానైనా జరగడమే మేలు..’’ అని ఓ ఇంగ్లిష్ సామెత. ఎవరు మననం చేసుకున్నా చేసుకోకపోయినా.. అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు రస్సెల్ క్రిస్టోఫ్ మాత్రం పదే పదే ఈ మాటను వల్లె వేస్తుంటాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.. అతడి కథేంటో తెలుసుకుంటే అతడి వేదాంతానికి అర్థమూ మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు కూడా అంటారు.. ‘బెటర్ లేట్ దేన్ నెవర్’ అని! 1986లో సరదాగా ఓసారి ఫొటో స్టుడియోకు వెళ్లాడు క్రిస్టోఫ్. నార్తన్ కాలిఫోర్నియాలో చక్కగా ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫొటోలు పట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నవ్వుతున్నట్టు, ఛాతీ విరుచుకుని, నిటారుగా నిల్చుని.. ఇలా రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగాడు. వాటన్నిటినీ చూసుకుని మురిసిపోయాడు. వాటిలో ఒక ఫొటో అతడికి బాగా నచ్చింది. కాఫీ కప్పును పెదాలపై ఉంచి, ఆ సువాసనను ఆస్వాదిస్తున్నట్టుగా ఉందా చిత్రం. రోజులు గడుస్తున్నాయి. నెలలు, ఏళ్లు.. ఇలా కాలం పరుగులెడుతూనే ఉంది. కానీ, క్రిస్టోఫ్కు ఆ చిత్రాలపై మమకారం మాత్రం తగ్గలేదు. అవి అతడికి మధుర జ్ఞాపకాలుగా మారిపోయాయి. అవే అతడికి లక్షలు.. కోట్లు! 2003లో ఓ రోజు షాపింగ్‌కు వెళ్లాడు క్రిస్టోఫ్. ఇంటికి కావాల్సినవి అన్నీ కొన్నాడు. అందులో నెస్లీ కంపెనీకి చెందిన ‘టేస్టర్స్ చాయిస్’ ఇన్ స్టంట్ కాఫీ కూడా ఉంది. ఆ కాఫీ కవర్‌పై ఓ యువకుడు కాఫీని ఆస్వాదిస్తున్న చిత్రం ఉంది. అది చూడగానే ఎంతో ఉద్వేగంగా ఫీలయ్యాడు క్రిస్టోఫ్. తాను అప్పుడెప్పుడో ముచ్చటపడి తీసుకున్న చిత్రంలానే అది ఉందనుకున్నాడు. మరింత గమనించి చూస్తే అది తన చిత్రమేనని అతనికి అర్థమైంది. వెంటనే ఆ కాఫీ కవర్‌పై పరిశోధనలు మొదలుపెట్టాడు. 1997 నుంచి 2003 వరకూ దాదాపు ఆరు దేశాల్లో అదే కవర్‌తో నెస్లీ సంస్థ కాఫీలను అమ్ముతోందని గుర్తించాడు. ఇక, ఆగలేదు. నెస్లీ తన చిత్రాన్ని ప్రచారానికి వాడుకున్నందుకుగానూ పరిహారాన్ని కోరాలనుకున్నాడు. కానీ, ఎందుకో ధైర్యం సరిపోలేదు. తాను ఓడిపోతానని భావించాడు. అయితే, స్నేహితులు ధైర్యం నూరిపోయడంతో నెస్లీపై దావా వేశాడు. కేసు విచారణ సాగిన తర్వాత న్యాయస్థానం క్రిస్టోఫ్ చెవిలో తేనె పోసింది. ఏళ్లపాటు ఎలాంటి పారితోషికమూ చెల్లించకుండా లాభాలు గడించినందుకు నెస్లే సంస్థకు గట్టిగానే షాకిచ్చింది. ఏకంగా 15.6 మిలియన్ డాలర్లను క్రిస్టోఫ్కు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ మొత్తంలో ఒక్కసారిగా కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు రస్సెల్ క్రిస్టోఫ్. ఈ మొత్తం మన కరెన్సీలో వంద కోట్ల రూపాయల పైమాటే! ఇప్పుడు చెప్పండి.. ఆయన ‘బెటర్ లేట్ దేన్..’ మాటను పదే పదే వల్లె వేయడం కరెక్టో కాదో..!! - (సాక్షి స్కూల్ ఎడిషన్) -
అమెజాన్ లో ఆ వస్తువులు ఫేక్ అట!
శాన్ ఫ్రాన్సిస్కో: ఈ-కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, గ్రూపాన్ లు అధికారికంగా అమ్ముతున్న ఆపిల్ మొబైళ్లకు సంబంధించిన కొన్ని వస్తువులు నకిలీవని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్పత్తుల అమ్మకదారు 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ'పై కోర్టులో కేసు వేసింది. 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ' ఈ-కామర్స్ సైట్లకు అందిస్తున్న ఆపిల్ ఉత్పత్తుల్లో 90శాతం నకిలీవని పిటిషన్ లో పేర్కొంది. అమెజాన్ లో అమ్ముడవుతున్న ఆపిల్ యూఎస్ బీ కేబుల్స్, పవర్ అడాప్టర్లు నకిలీవని అమెజాన్ బ్రాండ్ కు ఉన్న వ్యాల్యూతో వినియోగదారులను 'మొబైల్ స్టార్ ఎల్ఎల్సీ' మోసం చేస్తోందని ఆపిల్ ఆరోపించింది. అమెజాన్ లో లభ్యమవుతున్న పది రకాల ఆపిల్ ప్రొడక్ట్స్ లో తొమ్మిది నకిలీవని చెప్పింది. కాపీరైట్స్ నిబంధనల ఉల్లంఘన కింద 15లక్షల డాలర్లు, ఆపిల్ కంపెనీ పేరును ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నందుకు మరో రెండు మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని కోరింది. కాగా, దీనిపై స్పందించిన అమెజాన్ నకిలీ వస్తువుల అమ్మకాన్ని కంపెనీ సహించబోదని తెలిపింది. తయారీదారులు, ప్రముఖ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని చెప్పిన అమెజాన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
ట్రంప్ కోసం ఆయన భార్య న్యాయపోరాటం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఆయన భార్య మెలానియా ట్రంప్. డొనాల్డ్ ట్రంప్‌పై పూర్తిగా కాల్పనికంగా, తప్పుడు వ్యాఖ్యలు రాసినందుకు పీపుల్ మ్యాగజేన్, మాజీ స్టాఫ్ రిపోర్టర్‌పై దావా వేసేందుకు సిద్ధమయ్యారు. పీపుల్ మ్యాగజైన్ రచయిత నటాషా స్టోయినాఫ్ 2005లో ఓ ఇంటర్యూ సమయంలో ట్రంప్ తనను బలవంతంగా ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడంటూ ఆయన అసభ్యకర ప్రవర్తనను బయటపెట్టింది. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమంటూ మెలానియం ట్రంప్ కొట్టిపారేశారు. పబ్లికేషన్ ఎడిటోరియల్ డైరెక్టర్ జెస్ క్యాగెల్, రచయిత నటాషా స్టోయినాఫ్లకు నోటీసులు జారీచేశారు. 24గంటల లోపు ఆ స్టోరీను తొలగించాలని లేదంటే మెలానియం నమోదుచేసే దావాపై న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె లాయర్ చార్లెస్ హార్డర్ హెచ్చరించారు. ఈ అసత్యపూర్వక రాతలపై క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ నటాషాకు ఓ లేఖను పంపారు. అసలు నిజలేమిటంటే అని.. నటాషాకు, ట్రంప్‌కు మధ్య అసలు ఎలాంటి సంభాషణ జరుగలేదని, అసలు వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కారని చార్లెస్ హార్డర్ పేర్కొన్నారు. మొత్తం ఆరుగురు మహిళలు లైగికంగా తమను ట్రంప్ వేధించాడంటూ ఆరోపణలు చేస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్, ఎన్బీసీ, పీపుల్ మ్యాగజేన్ రిపోర్టు చేశాయి. ట్రంప్ ఎన్నడూ మహిళలను వేధించలేదంటూ మెలానియా లాయర్ పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్‌కు వ్యతిరేకంగా దావాను నమోదుచేేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
వాషింగ్ మెషీన్లూ పేలిపోతున్నాయి..
శాంసంగ్ ఫోన్లే కాదు... తాజాగా వాషింగ్ మెషిన్లు కూడా పేలిపోతున్నాయి. అమెరికా ఫెడరల్ కోర్టులో నమోదయిన కేసు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోంది. శాంసంగ్ కంపెనీకి చెందిన టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్లలో బట్టలు వేసినప్పుడు టబ్ నెమ్మదిగా తిరగుతూ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొద్ది సంవత్సరాలుగా శాంసంగ్ వాషింగ్ మెషీన్లు ఉన్నట్టుండి పేలిపోతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు టెక్సాస్ నుంచి ముగ్గురు మహిళలు, ఇండియానా, జార్జియాల నుంచి మరికొంత మంది వాషింగ్ మిషన్ల పేలుళ్లపై రక్షణ చర్యలను చేపట్టేలా చూడాలని ఫెడరల్ కోర్టును కోరారు. కేసు నమోదైన శాంసంగ్ వాషింగ్ మిషన్లలో లోపాలు ఉన్నాయని అమెరికా వస్తు వినియోదారుల రక్షణ కమిషన్ (సీపీఎస్సీ) పేర్కొంది. 2011 మార్చి నుంచి 2016 ఏప్రిల్ మధ్య కాలంలో తయారైన వాషింగ్ మిషన్లపై శాంసంగ్ కంపెనీతో చర్చిస్తున్నట్లు సీపీఎస్సీ తెలిపింది. ఏ మోడల్ మెషిన్లలో లోపం ఉందో బయటపెట్టని సీపీఎస్సీ దాదాపు 11మోడళ్లు ఈ జాబితా ఉన్నట్లు చెప్పింది. కాగా, శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఎక్కువ లోడ్ తో వేగంగా నడపొద్దని సీపీఎస్సీ, శాంసంగ్ కంపెనీ సలహాల కమిటీలు సూచించాయి. అయితే పేలుళ్లు సంభవించినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని శాంసంగ్ పేర్కొంది. 2011 నుంచి ఇప్పటివరకూ శాంసంగ్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదని చెప్పింది. కాగా, గత కొద్ది రోజులుగా శాంసంగ్ కు చెందిన ఫోన్లు డిజైన్ లోపంతో పేలుతున్న విషయం తెలిసిందే. -
ఆ వివాదంలో టీసీఎస్‌కు ఊరట
ముంబై: అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. సుమారు 175 కోట్లను చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ జాయింట్ డెవలప్మెంట్ ద్వారా ఆటోమేటెడ్ ఇన్ కమ్ టాక్స్ సిస్టం రిప్లేస్మెంట్ సందర్భంగా ఈ వివాదం తలెత్తింది. దీంతో 2013 లో ఆరెంజ్ కౌంటీ టీసీఎస్ పై దావా వేసింది. మూడు సంవత్సరాలు సాగిన ఈ వివాదంలో 26 మిలియన్ల డాలర్లకు (రూ.1,74, 57, 70, 000) అమెరికా ఆరెంజ్ కౌంటీ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి ఇరు పార్టీలు అంగీకరించామని టీసీఎస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు కాంట్రాక్ట్ విలువ రూ.6.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా సెటిల్ మెంట్ విలువ నాలుగు రెట్లు ఎక్కువనీ, నిజానికి తాము ఐదు రెట్లు మొత్తాన్ని టాటాకి చెల్లించినట్టు ఆరెంజ్ కౌంటీ ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు. అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఆస్తి పన్ను నిర్వహణ వ్యవస్థ రీప్లేస్ మెంట్ కు కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2010లోనే ముగిసినప్పటికీ జారీ చేయలేదు. దీంతో ఆరెంజ్ కౌంటీ కోర్టుకెక్కింది. చివరికి 26 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు టీసీఎస్ అంగీకరించడంతో ఈ వివాదానికి తెరపడింది . -
విదేశీ బ్యాంక్‌పై భారతీయ జంట వేలకోట్ల దావా
మెల్ బోర్న్: భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని కోరుతూ భారతీయ వ్యాపారవేత్త అతని భార్య ఓ విదేశీ బ్యాంకు పై పిటిషన్ దాఖలు చేశారు. మూసివేయబడిన వెస్ట్ ఆస్ట్రేలియన్ ఫెర్జిలైజేషన్ కంపెనీలో తమ షేర్లను తక్కువ ధరకు అక్రమంగా విక్రయించారని ఆరోపిస్తూ భారతీయ దంపతులు పంకజ్ ఓస్వాల్, రాధిక ఆస్ట్రేలియన్ బ్యాంకు కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వేలకోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగారు. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ (ఏఎన్జెడ్) సుమారు 6733 కోట్ల రూపాయలను చెల్లించాలని కోరుతూ విక్టోరియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. 2010 బర్రప్ ఫెర్టిలైజర్స్ కంపెనీలోని సుమారు 65 శాతం వాటాలను 4వందల మిలియన్ డార్లకు అమ్ముకున్నారని ఓస్వాల్ తరపున సీనియర్ న్యాయవాది టోనీ బనాన్ వాదించారు. ఈ విక్రయం నాటికి ఈ షేర్ల అసలు ధర 9 వందల మిలియన్ల డాలర్లు ఉందని ఆయన తెలిపారు. ఈ పరిణామంతో భారీగా నష్టపోయి అప్పుల్లో కూరకుపోయిన తన క్లయింట్ కు ప్రస్తుత విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించడంతో పాటు, న్యాయ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తన గ్రాహకత్వాన్ని వదులుకోవాలని బర్రప్ ఫెర్టిలైజర్స్ ప్రతినిధి బెదిరించారని ఓస్వాల్ దంపతులు ఆరోపించారు. దీంతో మిలియన్ల డాలర్లు ఇతర షేర్లను బలవంతగా అమ్మకోవాల్సి వచ్చిందని తెలిపారు. స్వాన్ రివర్ లో తాజ్ మహల్ గా అభివర్ణించే తమ నివాస నిర్మాణాన్ని సగంలో వదిలేసుకున్నట్టు చెప్పారు. ఖరీదైన జెట్, విలాసవంతమైన కార్లను అమ్ముకున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ఎటో) 136 మిలియన్ డాలర్ల పన్ను బకాయిలు ఉన్నాయని గత నెల నోటీసులిచ్చింది. సదరు పన్నులు చెల్లించకపోతే పంకజ్ ఆస్తులను జప్తు చేస్తామనిడంతో పంకజ్ దంపతుల ఆందోళనలో మునిగిపోయారు. సోమవారం విచారణ ప్రారంభమైన ఈ కేసులో దాదాపు25 మంది లాయర్లు ఇరువైపులా వాదనలు వినిపించారు. ఇప్పటికే మిలియన్ డాలర్లు వెచ్చించిన అతి క్లిష్టమైన ఈ విచారణకు మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
గూగుల్ కి భారీ ఊరట..
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ కు పెద్ద ఊరట లభించింది. మల్టీ బిలియన్ డాలర్ల దావా కేసులో కోర్టు గూగుల్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీgతో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాపీ రైట్ వివాదంలో రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య సాగిన హోరా హోరీ యుద్ధానికి ప్రస్తుతానికి తెరపడింది. ఈ తీర్పును పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒరాకిల్ మళ్లీ పోరుకు రడీ అవుతోంది. ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ విజయానికి ఈ తీర్పు నిదర్శనమని గూగుల్ వ్యాఖ్యానించింది. జావా ప్రోగ్రామింగ్ క్యమూనిటీ కాపీ రేట్స్ విషయంలో, సాప్ట్ వేర్ అభివృధ్దిలో నూతన ఆవిష్కరణలకు నాంది అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఇదిముఖ్యమైన విజయమని, సృజనాత్మకతకు ప్రోత్సాహాన్నందిస్తుందని కంప్యూటర్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ బ్లాక్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈతీర్పును వ్యతిరేకించిన ఒరాకిల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను గూగుల్ చట్టవిరుద్ధంగా వాడుతోందని గట్టిగా నమ్మువుతున్నామని వాదించింది. మరోసారి అప్పీలు కు వెళ్లనున్నట్టు స్పష్టం చేసింది. కాగా జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ ఆరోపించింది. దీనికి గాను తమకు గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదంటూ ఒరాకిల్ ఆరోపణలను గూగుల్ ఖండించింది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లో మొదలైన సంగతి తెలిసిందే.. -
హెచ్-1 బి వీసా లాటరీ పద్ధతిపై పిటిషన్
వాషింగ్టన్: హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియపై అమెరికాకు చెందిన రెండు టాప్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ సలహా సంస్థలు ఫెడరల్ ప్రభుత్వంపై పోరాటానికి దిగాయి వీసాల జారీ ప్రక్రియలో పారదర్శకతను పాటించాలంటూ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్, అమెరికన్ లాయర్స్ అసోసియేషన్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు వ్యతిరేకంగా ఈ ఒక పిటిషన్ దాఖలు చేశాయి. లాటరీ పద్ధతి ద్వారా వీసాను మంజూరు చేసేపద్ధతిని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈఎంపిక విధానాన్ని పూర్తిగా ప్రజలకు వివరించకుండా అమలు ప్రక్రియను ప్రకటించారని ఇవి ఆరోపించాయి. మొదటినుంచీ, చివరివరకు జరిగే వీసా జారీ ప్రక్రియ, చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేది అమెరికా ప్రజానీకానికి బహిరంగ పర్చాలనేది తమ ఉద్దేశమని లీగల్ డైరెక్టర్ మెలిస్సా క్రో తెలిపారు. కాగా 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బి వర్క్ వీసాలకోసం దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1 నుంచి మొదలుకాగా ఇంతవరకు వీసా జారీ ప్రక్రియ మొదలుకాలేదు. అమెరికా కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగామింగ్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్-1బి వీసాలను వినియోగిస్తుంటాయి. వీరిలో ఎక్కువమంది భారతీయులే . ఈ సం.రం నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే 65వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఆశిస్తున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఒకవేళ యూఎస్సీఐఎస్ అనుకున్నదానికంటే ఎక్కువమొత్తంలో హెచ్-1బి దరఖాస్తులు అందినట్లైతే కంప్యూటర్ అధారిత లాటరీ విధానం ద్వారా దరఖాస్తులను ఎంపిక చేస్తామన్న సంగతి తెలిసిందే.