ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌లో మరోసారి చిక్కుల్లోపడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ ఐకానిక్ ‘బర్డ్ లోగో’ను మార్చిదాని ప్లేస్‌లో ‘ఎక్స్’గా మారుస్తూ ఈ ఏడాది జూలైలో మాస్క్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్స్ అనే కంపెనీ కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. ట్రేడ్‌మార్క్ , సర్వీస్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్విటర్ లోగో రీబ్రాండ్ తరువాత ఇలాంటి కోర్టు కేసును ఎదుర్కోవడం ఇదే తొలిసారి. (ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!)
ఫ్లోరిడాకు చెందిన అడ్వర్టైజింగ్ , సోషల్ మీడియా సర్వీస్ కంపెనీ ఎక్స్ ..ట్విటర్ పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ ట్రేడ్‌మార్క్ "X" గుర్తును ఉపయోగించి మార్కెటింగ్, విక్రయించడం లేదా పంపిణీ లాంటి వాటినుంచి ఎక్స్‌ను నిషేధించాలని కోరుతోంది. అంతేకాదు మస్క్ ఎక్స్ సేవలు, ప్రకటనలు తమ వినియోగదారులు గందరగోళానికి గురయ్యారని ఎక్స్ పేర్కొంది. తన నష్టాలకు లేదా ప్రతివాది లాభాలకు మూడు రెట్లు సమానమైన పరిహారాన్ని అందించాలని కోరింది. ఈ ప్రమాదాన్ని ముందేఊహించిన ట్రేడ్ మార్క్ నిపుణులు తాజా పరిణామంతో ఇప్పటికే లాభాలు క్షీణించి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మస్క్‌కు మరింత దెబ్బేనని భావిస్తున్నారు.
కాగా గతేడాది ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. భారతీయ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడం, వేలాదిమంది ఇతర ఉద్యోగుల తొలగింపులు, ట్విటర్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు, కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు లాంటివి ఉన్నాయి. తాజాగా గేమ్ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫారమ్‌ని సరిచేయడానికి లైవ్ షాపింగ్ ఫీచర్‌పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment