This Man Will Have Sleepless Nights After 'X' Installed at Twitter HQ, Here's Why - Sakshi
Sakshi News home page

ట్విట్టర్ పేరు మార్చిన నాటి నుండి నిద్ర లేదు.. ఎందుకంటే.. 

Published Mon, Jul 31 2023 8:38 AM | Last Updated on Mon, Jul 31 2023 9:02 AM

This Man Will Have Sleepless Nights After X Installed at Twitter HQ - Sakshi

వాషింగ్టన్: ట్విట్టర్ పేరు మార్చడమేమో గానీ అది నా చావుకొచ్చిందంటున్నాడు ఒక యూజార్. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా నివాసముండే క్రిస్టోఫర్.J .బీలే కొత్తగా ఏర్పాటు చేసిన 'X' లోగో నుండి వచ్చే లైటింగ్ నాకు నిద్ర లేకుండా చేస్తోందని అదే X (ఒకప్పటి ట్విట్టర్) వేదికగా వీడియోతో సహా విషయాన్ని పోస్ట్ చేసి ఆవేదన వెళ్లగక్కాడు.    

ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించే పాపులర్ ఎంటర్ ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ హస్తగతం చేసుకున్న తర్వాత పిట్ట బొమ్మను తొలగించి ఆ స్థానంలో 'X' అనే లోగోను పరిచయం చేశారు. ట్విట్టర్ పేరు మార్పు గురించి ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన నాటి నుండి సోషల్ మీడియా మాధ్యమంలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అత్యధికులు దీన్ని ఎగతాళి చేస్తూనే కామెంట్లు చేస్తుండగా అతి తక్కువ మంది మాత్రమే ఇది చాలా బాగుందని కితాబిచ్చారు. 

అయితే కాలిఫోర్నియాలోని ట్విట్టర్ హెడ్ క్వార్ట్రర్స్ ఎదురుగా నివాసముంటున్న క్రిస్టోఫర్.J .బీలే మాత్రం ఈ లోగో మార్పు వలన నాకు నిద్ర ఉండటం లేదని ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పైన అమర్చిన రేడియంట్ లైట్ గడియగడియకు వెలుగుతూ ఎదురుగా ఉన్న పెద్ద బిల్డింగ్ పైన దాని ప్రతిబింబం పడటంతో అసలు నిద్ర పట్టడంలేదు. నా బెడ్‌రూమ్ నుంచి చూస్తే ఇదిగో ఇలా ఉండి.. ఇది నా పరిస్థితి అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. 

దీనికి జత చేస్తూ ప్రతిరోజూ తన అనుభవాలను కూడా పంచుకున్నాడు. పగలంతా ఆ లైట్ల పనితీరును టెస్ట్ చేస్తారు. రాత్రయ్యే సరికి కళ్ళు జిగేల్ మనే లైటింగ్ నేరుగా నా బెడ్‌రూమ్లోకి వస్తుంది చూడండి అంటూ రాశాడు. అనేక మంది X యూజర్లు ఈ వీడియోల సమాహారంపై స్పందిస్తూ ఎలాన్ మస్క్ పై కామెంట్ల రూపంలో విమర్శల్ని కురిపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పాపులారిటీ కోసం పాకులాడింది.. ప్రాణాలు మీదకు తెచ్చుకుంది..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement