చైనాలో 'యాపిల్' కు గట్టి షాక్ | Apple loses trademark lawsuit over ‘iPhone’ name in China | Sakshi
Sakshi News home page

చైనాలో 'యాపిల్' కు గట్టి షాక్

Published Thu, May 5 2016 12:50 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

చైనాలో 'యాపిల్'  కు  గట్టి షాక్ - Sakshi

చైనాలో 'యాపిల్' కు గట్టి షాక్

బీజింగ్ : యాపిల్  సంస్థ కు ప్రపంచంలో  రెండవ అతిపెద్దమార్కెట్ గా పేరొందిన చైనాలో భారీ  షాక్ తగిలింది.  ఐఫోన్‌ అనే బ్రాండ్‌ పేరుతో చైనాలో అమ్ముడవుతున్న లెదర్‌ వస్తువులు, బ్యాగులను వ్యతిరేకిస్తూ యాపిల్‌ సంస్థ పెట్టిన కేసును చైనా కోర్టు కొట్టిపారేసింది. బీజింగ్ హై పీపుల్స్ కోర్టు జిన్ తియాండీకి అనుకూలంగా తీర్పుచెప్పిందని అధికారిక లీగల్ డైలీ వార్తాపత్రిక తెలిపింది.  దీంతో 'ఐఫోన్' ట్రేడ్ మార్కు కోసం  చైనాలో యాపిల్ చేస్తున్న పోరాటానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

జిన్ టాంగ్ తియాండీ లెదర్ తయారీ కంపెనీ వాలెట్లు, హ్యాండ్ బ్యాగులకు తన ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ పేరు 'ఐఫోన్'ను వాడుకుంటుందని యాపిల్ ఆరోపించింది.  అయితే న్యాయ పరంగా ఎలాంటి ఆధారాలు లేవని జిన్ టాంగ్ తియాండీ కంపెనీ ఐఫోన్ బ్రాండ్ పేరుతో వస్తువులను అమ్ముకోవచ్చని, దానిలో తప్పేమీ లేదని  కోర్టు తేల్చి చెప్పింది. 

బీజింగ్ పెద్దల కోర్టు ఇచ్చిన తీర్పుపై యాపిల్ అసంతృప్తి వ్యక్తంచేసింది. తమ ట్రేడ్ మార్కు హక్కులపై సుప్రీం పీపుల్స్ కోర్టులో పునఃవిచారించమని కోరతామని కంపెనీ తెలిపింది. జిన్ టాంగ్ కంపెనీ తన ట్రేడ్ మార్కును వ్యాపార స్వలాభం కోసం వాడుకుంటుందని యాపిల్ 2012లో చైనీస్ ట్రేడ్ మార్క్ అథారిటీ ఆశ్రయించింది. అనంతరం కింద కోర్టులో ఈ కేసును పైల్ చేసింది. కానీ ఆ కోర్టులో యాపిల్ కు చుక్కెదురవ్వడంతో,పెద్దల కోర్టును ఆశ్రయించింది. అయితే 2007కు ముందు నుంచే చైనాలో యాపిల్ 'ఐఫోన్' బ్రాండ్ కు మంచి పేరు కలిగి ఉందని నిరూపించకపోవడంతో, పెద్దల కోర్టూ ఈ  కేసును కొట్టివేసింది.

జిన్ టాంగ్ తియాండీ కంపెనీ ఐఫోన్ ట్రేడ్ మార్కుతో 2010 నుంచి లెదర్ ఉత్పత్తులను చైనా మార్కెట్లో తీసుకొచ్చింది. యాపిల్ తన ఎలక్ట్రానిక్ గూడ్స్ కు 2002లోనే ఈ పేరును ప్రతిపాదించింది. కానీ ఆ ట్రేడ్ మార్కుకు 2013 వరకూ ఎలాంటి ఆమోదం లభించలేదు. 2007లో తొలి ఐఫోన్ విడుదలైంది.  ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు, 2009 నుంచి చైనా మార్కెట్లోకి ప్రవేశించాయి. కాగా గత వారం బిలియనీర్ ఇన్వెస్టర్ కార్ల్ ఇకాహ్న్ చైనా లో  ఆపిల్ తన వాటాలను విక్రయించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement