trademark
-
బర్గర్ కింగ్ వర్సెస్ బర్గర్ కింగ్..!
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. -
భారత్‌పే, ఫోన్‌పే మధ్య వివాదం పరిష్కారం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజాలు భారత్‌పే గ్రూప్, ఫోన్‌పే గ్రూప్‌ల మధ్య ’పే’ పదం ట్రేడ్‌మార్క్‌పై నెలకొన్న వివాదం ఓ కొలిక్కి వచి్చంది. సుమారు అయిదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరును సామరస్యంగా సెటిల్ చేసుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో పరస్పరం ఒకదానిపై మరొకటి దాఖలు చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. దీనితో తమ తమ ట్రేడ్‌మార్క్‌లను రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతుందని వివరించాయి. ఇది రెండు కంపెనీలకూ ప్రయోజనకరమని ఫోన్‌పే ఫౌండర్ సమీర్ నిగమ్, భారత్‌పే చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. -
వీటిపై 71 వేల ఫిర్యాదులు అందాయి: గూగుల్
న్యూఢిల్లీ: మే, జూన్ నెలల్లో భారతీయ వినియోగదారుల నుంచి 71,148 ఫిర్యాదులు అందినట్లు గూగుల్ శుక్రవారం వెల్లడించింది. ఆయా ఫిర్యాదుల ఆధారంగా సమాచారంలోని 1.54 లక్షల భాగాలను తొలగించినట్లు తెలిపింది. అందులోనూ జూన్ నెలలోనే 36,265 ఫిర్యాదులు అందాయని, వాటి కారణంగా 83,613 తొలగింపు చర్యలను చేపట్టినట్లు పేర్కొంది. వీటితో పాటు తమ ప్లాట్‌ఫామ్‌లోని ఆటోమేటెడ్ డిటెక్షన్ పద్ధతి ద్వారా 11.6 లక్షల సమాచార భాగాలను తొలగించినట్లు తెలిపింది. తొలగింపునకు గురైన సమాచారంలో కాపీరైట్ (70,365), ట్రేడ్ మార్క్ (753), కౌంటర్ఫీట్ (5), లీగల్ (4) వ్యవహారాలు ఉన్నాయని గూగుల్ చెప్పింది. -
ఖాదీ బ్రాండ్‌కు బలం, ఆ మూడు దేశాల్లో..
న్యూఢిల్లీ: ఖద్దరు మీద పూర్తి పేటెంట్ హక్కులు మన దేశానివే. అందుకే ‘ఖాదీ’ అనే బ్రాండ్‌ను పరిరక్షించే పనిని బాధ్యతగా తీసుకుంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ). ఇతర దేశాల్లో ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా మూడు దేశాలు ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో కేవీఐసీ పూర్తి వివరాలను తెలిపింది. భూటాన్, యూఏఈ తోపాటు మెక్సికో దేశాలు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో నలభై దేశాల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో పాటు ఖతర్, శ్రీలంక, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, సింగపూర్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు ట్రేడ్‌మార్క్ కోసం ఎదురు చూస్తున్నాయని కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఖాదీ గుర్తింపు, గ్లోబల్ పాపులారిటీని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది కేవీఐసీ. ఇందులో భాగంగానే ఈ జూన్ 28న యూఏఈకి, జులై 9న భూటాన్‌లకు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ రెండుదేశాల కంటే ముందు పోయిన డిసెంబర్లోనే మెక్సికో ఖాదీ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ లేకపోతే.. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతి లేనట్లే. ఇంతకు ముందు జర్మనీ, యూకే, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఈయూ దేశాలకు అనుమతి దొరికాయి. తాజాగా మూడు దేశాల అనుమతులతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. దీంతో ఆయా దేశాలు ఖాదీ ఫ్యాబ్రిక్, ఖాదీ రెడిమేడ్ గార్మెంట్స్, ఖాదీ సోప్‌లు, ఖాదీ కాస్మటిక్స్, అగరవత్తులు ఖాదీ ఉత్పత్తుల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ దొరికినట్లయ్యింది. -
అమ్మకానికి ‘డీసీ’ ట్రేడ్‌మార్క్‌లు
♦ ఈ నెల 24న వేలం వేయనున్న ఐడీబీఐ బ్యాంకు ♦ లిస్టులో ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ♦ ట్రేడ్‌మార్క్‌లు కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరుతేదీగా పేర్కొంది. డెక్కన్ క్రానికల్‌కు రూ. 120 కోట్లు, ఆంధ్రభూమికి రూ. 3.5 కోట్లు, ది ఏషియన్ ఏజ్‌కు రూ. 18 కోట్లు, ఫైనాన్షియల్ క్రానికల్‌కు రూ. 3 కోట్లు రిజర్వ్ ధరగా ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. ఐడీబీఐ బ్యాంకుతో పాటు ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ తదితర 18 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డీసీహెచ్ఎల్ దాదాపు రూ. 4,000 కోట్ల పైచిలుకు బకాయి పడింది. దీంతో కంపెనీని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా పలు బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఒకే పూచీకత్తుపై పలు సంస్థల నుంచి రుణాలు తీసుకోవడంతో న్యాయవివాదాలు కూడా నెలకొన్నాయి. ఐడీబీఐ బ్యాంకు పలుమార్లు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఇతరత్రా రుణదాతల నుంచి అడ్డంకులు ఎదురవడంతో వీలు కాలేదు. తాజాగా రుణదాతలంతా ఒక అంగీకారానికి రావడంతో వేలానికి మార్గం సుగమమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
చైనాలో 'యాపిల్' కు గట్టి షాక్
బీజింగ్ : యాపిల్ సంస్థ కు ప్రపంచంలో రెండవ అతిపెద్దమార్కెట్ గా పేరొందిన చైనాలో భారీ షాక్ తగిలింది. ఐఫోన్ అనే బ్రాండ్ పేరుతో చైనాలో అమ్ముడవుతున్న లెదర్ వస్తువులు, బ్యాగులను వ్యతిరేకిస్తూ యాపిల్ సంస్థ పెట్టిన కేసును చైనా కోర్టు కొట్టిపారేసింది. బీజింగ్ హై పీపుల్స్ కోర్టు జిన్ తియాండీకి అనుకూలంగా తీర్పుచెప్పిందని అధికారిక లీగల్ డైలీ వార్తాపత్రిక తెలిపింది. దీంతో 'ఐఫోన్' ట్రేడ్ మార్కు కోసం చైనాలో యాపిల్ చేస్తున్న పోరాటానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. జిన్ టాంగ్ తియాండీ లెదర్ తయారీ కంపెనీ వాలెట్లు, హ్యాండ్ బ్యాగులకు తన ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ పేరు 'ఐఫోన్'ను వాడుకుంటుందని యాపిల్ ఆరోపించింది. అయితే న్యాయ పరంగా ఎలాంటి ఆధారాలు లేవని జిన్ టాంగ్ తియాండీ కంపెనీ ఐఫోన్ బ్రాండ్ పేరుతో వస్తువులను అమ్ముకోవచ్చని, దానిలో తప్పేమీ లేదని కోర్టు తేల్చి చెప్పింది. బీజింగ్ పెద్దల కోర్టు ఇచ్చిన తీర్పుపై యాపిల్ అసంతృప్తి వ్యక్తంచేసింది. తమ ట్రేడ్ మార్కు హక్కులపై సుప్రీం పీపుల్స్ కోర్టులో పునఃవిచారించమని కోరతామని కంపెనీ తెలిపింది. జిన్ టాంగ్ కంపెనీ తన ట్రేడ్ మార్కును వ్యాపార స్వలాభం కోసం వాడుకుంటుందని యాపిల్ 2012లో చైనీస్ ట్రేడ్ మార్క్ అథారిటీ ఆశ్రయించింది. అనంతరం కింద కోర్టులో ఈ కేసును పైల్ చేసింది. కానీ ఆ కోర్టులో యాపిల్ కు చుక్కెదురవ్వడంతో,పెద్దల కోర్టును ఆశ్రయించింది. అయితే 2007కు ముందు నుంచే చైనాలో యాపిల్ 'ఐఫోన్' బ్రాండ్ కు మంచి పేరు కలిగి ఉందని నిరూపించకపోవడంతో, పెద్దల కోర్టూ ఈ కేసును కొట్టివేసింది. జిన్ టాంగ్ తియాండీ కంపెనీ ఐఫోన్ ట్రేడ్ మార్కుతో 2010 నుంచి లెదర్ ఉత్పత్తులను చైనా మార్కెట్లో తీసుకొచ్చింది. యాపిల్ తన ఎలక్ట్రానిక్ గూడ్స్ కు 2002లోనే ఈ పేరును ప్రతిపాదించింది. కానీ ఆ ట్రేడ్ మార్కుకు 2013 వరకూ ఎలాంటి ఆమోదం లభించలేదు. 2007లో తొలి ఐఫోన్ విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు, 2009 నుంచి చైనా మార్కెట్లోకి ప్రవేశించాయి. కాగా గత వారం బిలియనీర్ ఇన్వెస్టర్ కార్ల్ ఇకాహ్న్ చైనా లో ఆపిల్ తన వాటాలను విక్రయించాడు.