న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజాలు భారత్‌పే గ్రూప్, ఫోన్‌పే గ్రూప్‌ల మధ్య ’పే’ పదం ట్రేడ్‌మార్క్‌పై నెలకొన్న వివాదం ఓ కొలిక్కి వచి్చంది. సుమారు అయిదేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరును సామరస్యంగా సెటిల్ చేసుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో పరస్పరం ఒకదానిపై మరొకటి దాఖలు చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. దీనితో తమ తమ ట్రేడ్‌మార్క్‌లను రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతుందని వివరించాయి. ఇది రెండు కంపెనీలకూ ప్రయోజనకరమని ఫోన్‌పే ఫౌండర్ సమీర్ నిగమ్, భారత్‌పే చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment