సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఆఫ్రికన్‌లను ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు హింసను ప్రేరేపించేలా వ్యవహరించిందంటూ మెటాపై పిటిషనర్లు పరువు నష్టం దావా వేశారు. అందుకు పరిహారంగా మెటా తమకు 2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి డిమాండ్ చేశారు. ఆ పిటిషన్‌ను ఇథియోపియన్ పరిశోధకులు అబ్రమ్ మీరెగ్,ఫిస్సెహా టెక్లే, కెన్యా మానవ హక్కుల సభ్యులు, కటిబా ఇన్‌స్టిట్యూట్‌తో పాటు చట్టపరమైన లాభాపేక్షలేని ఫాక్స్‌గ్లోవ్ సహకారంతో కెన్యా హైకోర్టులో దాఖలు చేశారు.
గత నవంబర్‌లో మీరెగ్ తండ్రి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ మీరెగ్ అమరేను’పై దాడికి చేసేలా ప్రోత్సహించేలా మెటాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. ఆ పోస్టులు షేరింగ్ తర్వాత గుర్తుతెలియని దుండగులు అమరేను ఇంట్లోకి వెళ్లి కాల్చిచంపినట్లు కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..మెటా "తన ప్లాట్‌ఫారమ్‌లో హింసను పరిష్కరించడంలో వైఫల్యం, ద్వేషపూరిత, రెచ్చగొట్టేలా ప్రమాదకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించేలా ప్రాధాన్యతనిచ్చే మెటా నుంచి ప్రజలకు రక్షణ అవసరమని పిటిషనర్లు ఈ సందర్భంగా వాదించినట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో వెల్లడించింది.
అంతేకాదు 2021లో 117.9 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన మెటా సిఫార్సు అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతిక ఆధారంగా ప్రజలు ఏ కంటెంట్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారో.. అందుకు అనుగుణంగా ఆ కంటెంట్‌ను ప్రచారం చేస్తోంది. దీంతో వ్యాపారస్తులు యాడ్స్ ద్వారా తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలా మెటా తన ఆదాయాన్ని పెంచుంటున్నట్లు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నివేదించారు. ఈ సందర్భంగా మెటా ఈ తరహా కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నందుకు కోర్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తమకు జరిగిన నష్టం కింద సదరు సోషల్ మీడియా సంస్థ 2 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment