వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ షాక్!
బ్రిడ్జ్ టౌన్: భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. భారత పర్యటన నుంచి వైదొలగడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) 42 మిలియన్ డాలర్ల దావాను దాఖలు చేసింది.
వన్డే, టెస్ట్ మ్యాచ్ ల నుంచి వెస్టిండీస్ జట్టు తప్పుకోవడం వల్ల 41.97 మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లందని బీసీసీఐ అధికారులు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపారు. 15 రోజుల్లోగా పరిహారాన్ని ఏప్పటిలోగా చెల్లిస్తారనే విషయాన్ని 15 రోజుల్లో స్పష్టం చేయాలని వెస్టిండీస్ బోర్డును బీసీసీఐ కోరింది.