the West Indies Cricket Board
-
కెప్టెన్‌గా పొలార్డ్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
స్వదేశంలో జరిగే ఇంగ్లండ్,ఐర్లాండ్ సిరీస్‌లకు వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్‌తో వెస్టిండీస్ మూడు వన్డేలు ఆడనుంది. జనవరి8న జమైకా వేదికగా తొలి వన్డే జరగనుంది. కాగా మొత్తం మూడు వన్డేలు కూడా ఒకే వేదికలో జరగనున్నాయి. అనంతరం ఇంగ్లండ్‌తో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 బార్బడోస్ వేదికగా జరగనుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్‌లు బార్బడోస్‌లోనే జరగనున్నాయి. కాగా గత ఏడాది డిసెంబర్లో పాకిస్తాన్ పర్యటించిన వెస్టిండీస్ వైట్‌వాష్ గురై ఘోర పరాభావం మూట కట్టుకుంది. మూడు టీ20 సిరీస్‌ను 3-0తో పాక్ కైవసం చేసుకుంది. అయితే పాక్ పర్యటనకు గాయంతో దూరమైన పొలార్డ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ వన్డేలకు వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ , డెవాన్ థామస్, ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20లకు వెస్టిండీస్ జట్టు కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్ (ఇంగ్లండ్ టీ20లు మాత్రమే), డారెన్ బ్రావో (ఇంగ్లండ్ టీ20లు మాత్రమే), రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, షాయ్ హోప్, అకెల్ హోసేన్, జాసన్ హోల్డర్, బ్రాండ్ , కైల్ మేయర్స్, రోవ్మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: ట్రవిస్ హెడ్‌కు కరోనా... మరి యాషెస్ సిరీస్? -
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ షాక్!
బ్రిడ్జ్ టౌన్: భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. భారత పర్యటన నుంచి వైదొలగడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) 42 మిలియన్ డాలర్ల దావాను దాఖలు చేసింది. వన్డే, టెస్ట్ మ్యాచ్ ల నుంచి వెస్టిండీస్ జట్టు తప్పుకోవడం వల్ల 41.97 మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లందని బీసీసీఐ అధికారులు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపారు. 15 రోజుల్లోగా పరిహారాన్ని ఏప్పటిలోగా చెల్లిస్తారనే విషయాన్ని 15 రోజుల్లో స్పష్టం చేయాలని వెస్టిండీస్ బోర్డును బీసీసీఐ కోరింది. -
సునీల్ నరైన్ ఇంటికి...
వన్డే సిరీస్ నుంచి వైదొలగిన స్పిన్నర్ న్యూఢిల్లీ: సందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌తో చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు దూరమైన వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కూ దూరమయ్యాడు. అతని బౌలింగ్ యాక్షన్‌కు సంబంధించిన తాజా పరిణామాల అనంతరం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నరైన్‌ను స్వదేశం రావాల్సిందిగా ఆదేశించింది. ‘రాబోయే సిరీస్ నుంచి నరైన్‌ను తప్పిస్తున్నాం. అతను తన యాక్షన్‌ను సమీక్షించుకొని క్రికెట్లోకి తిరిగి వచ్చేందుకు ఈ విరామం ఉపయోగపడుతుంది’ అని విండీస్ బోర్డు ప్రకటించింది. నరైన్ తప్పుకోవడంతో వెస్టిండీస్ జట్టు స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే భారత్‌తో సిరీస్ బరిలోకి దిగనుంది.