హయత్‌ నగర్‌లో హిజాబ్‌ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు | Hyderabad Hayathnagar Student Not Allowed School Due to Hijab | Sakshi
Sakshi News home page

హయత్‌ నగర్‌లో హిజాబ్‌ వివాదం.. స్కార్ఫ్‌తో వచ్చిందని పదో తరగతి అమ్మాయిని..

Published Sat, Jun 24 2023 12:17 PM | Last Updated on Sat, Jun 24 2023 1:29 PM

Hyderabad Hayathnagar Student Not Allowed School Due to Hijab - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని హయత్‌ నగర్‌లో హిజాబ్‌ వివాదం వెలుగు చూసింది. స్కార్ఫ్‌తో వెళ్లిందని ఓ పదో తరగతి అమ్మాయిని ఇంటికి పంపించేసింది స్కూల్‌యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో.. కేసు నమోదు చేశారు. 

ముఖానికి స్కార్ఫ్‌తో వెళ్లిన ఆ టెన్త్‌ స్టూడెంట్‌ను.. స్కూల్‌ యాజమాన్యం లోనికి రానివ్వలేదు. హిజాబ్‌తో లోనికి రానివ్వమంటూ తేల్చేసింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లకు పోలీసులను ఆశ్రయించారు.

ఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  విద్యార్థిని స్టేట్‌మెంట్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థిని స్థానిక కోర్టు న్యాయమూర్తి కూతురని సమాచారం.


ఇదీ చదవండి: కురచ దుస్తులెందుకు?.. తెలంగాణ హోంమంత్రి కామెంట్లపై దుమారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement