Bihar Bank Stops Muslim Girl From Withdrawing Money: హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో మొదలైన ఈ వివాదం కాస్త ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ఓ ముస్లిం యువతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా హిజాబ్ తొలగించాలంటూ ఆమెతో వాదనకు దిగారు.
ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగింది. ఓ ముస్లిం యువతి డబ్బులు విత్ డ్రా చేసేందుకు మన్సూర్ చౌక్‌లోని యూకో(యూసీవో) బ్యాంకు శాఖకు శనివారం వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. హిజాబ్‌ను తీసి డబ్బులు డ్రా చేయాలని వాదనకు దిగారు.
దీంతో సదరు యువతి హిజాబ్ తీసివేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనను ఆ యువతి తన మొబైల్‌లో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా షేర్ చేశారు. ఈ ఘటనపై ఆయన బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు.
माननीय मुख्यमंत्री @NitishKumar जी,
— Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022
कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX
Comments
Please login to add a commentAdd a comment