Money withdraw
-
అలెర్ట్, కోవిడ్-19 అడ్వాన్స్ విత్‌డ్రాపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం?!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో చందాదారుల ఆరోగ్య అవసరాల్ని తీర్చేలా కోవిడ్ అడ్వాన్స్ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్‌ను ఈపీఎఫ్ఓ త్వరలో తొలగించనుంది. దీంతో కోవిడ్ అడ్వాన్స్ పేరుతో రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్‌ను ఉపసంహరించుకోవడం అసాధ్యం. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత అధికారులు అనధికారికంగా వెల్లడించారు. కోవిడ్ అడ్వాన్స్ పేరుతో ఇందులో ప్రముఖంగా భారత్‌లో తొలిసారి కరోనా విజృంభణ మొదలైన సమయంలో ఈపీఎఫ్ఓ మనీ విత్ డ్రాలో మార్పులు చేసింది. చేసిన మార్పులకు అనుగుణంగా చందారులు కరోనా చికిత్సతో పాటు సంబంధిత అనారోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు వీలుగా కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఉన్న కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరాల్ని తీర్చుకోవచ్చు. ప్రాణాల్ని కాపాడింది ఈ నిర్ణయం సబ్స్క్రైబర్లు కోవిడ్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహాయ పడింది. పలువురు కోవిడ్‌కు చికిత్స చేయించుకుని ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. అయితే సుమారు ఏడెనిమిది నెలల క్రితం కోవిడ్-19పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో ఈపీఎఫ్ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రీటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ తీసుకునే సదుపాయన్ని తొలగించనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, సాఫ్ట్‌వేర్‌లో నాన్ రిఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ నిబంధనను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా చందాదారులు ఇకపై దరఖాస్తు చేసుకోలేరని అధికారి తెలిపారు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కాగా, కొవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదుతో అనవసరైమన కొనుగోళ్లు, ఇతర అవసరాలకు వినియోగించుకునే వారికి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని అంటున్నారు. రిటైర్మెంట్ పొదుపు నుంచి కోవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదును ఆరోగ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని తెలిసినప్పటికీ కోవిడ్ ఉపసంహరణను ముగించడానికి వారికి ఇంత సమయం పట్టిందని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఏ ఏడాది ఎంత విత్‌డ్రా చేశారంటే ఈపీఎఫ్ 2020-21లో 6.92 మిలియన్ల మంది చందాదారులకు రూ .17,106.17 కోట్లు, 2021-22 లో 9.16 మిలియన్ల లబ్ధిదారులకు రూ .19,126.29 కోట్లు, 2022-2023లో 6.20 మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ .11,843.23 కోట్ల నగదను అందించింది. 4 రోజుల్లో 6లక్షలు విత్‌డ్రా మార్చి 28, 2020 నుండి కోవిడ్ అడ్వాన్స్ నిబంధన అమల్లోకి వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2020) నాలుగు రోజుల్లో 33 మంది లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 6 లక్షల్ని విత్ డ్రా చేసుకున్నారు. కోవిడ్ అడ్వాన్స్ రూ.48,075 కోట్లు 2022-23 ఈపీఎఫ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 నుండి మూడు ఆర్థిక సంవత్సరాల్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పొందారు. ఈ మొత్తం విలువ రూ .48,075.75 కోట్లు. -
హిజాబ్ వివాదం: యువతికి చేదు అనుభవం
Bihar Bank Stops Muslim Girl From Withdrawing Money: హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో మొదలైన ఈ వివాదం కాస్త ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తోంది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ఓ ముస్లిం యువతిని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడితో ఆగకుండా హిజాబ్ తొలగించాలంటూ ఆమెతో వాదనకు దిగారు. ఈ ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లో జరిగింది. ఓ ముస్లిం యువతి డబ్బులు విత్ డ్రా చేసేందుకు మన్సూర్ చౌక్‌లోని యూకో(యూసీవో) బ్యాంకు శాఖకు శనివారం వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆమె హిజాబ్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. హిజాబ్‌ను తీసి డబ్బులు డ్రా చేయాలని వాదనకు దిగారు. దీంతో సదరు యువతి హిజాబ్ తీసివేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనను ఆ యువతి తన మొబైల్లో రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఆ వీడియోను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా షేర్ చేశారు. ఈ ఘటనపై ఆయన బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై మండిపడ్డారు. माननीय मुख्यमंत्री @NitishKumar जी, कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX — Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022 -
మల్కన్‌గిరిలో ఎనీటైం ఖాళీ..!
ఒడిశా, మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని ఏ ఏటీఎంలో చూసినా డబ్బులు లేని పరిస్థితి. దీంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్‌కు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో అవసరమై డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వస్తే అందులో డబ్బులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా పేరొందిన స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు లేకపోవడం విశేషం. ఇదే విషయంపై ఆ బ్యాంక్ మేనేజర్‌ను కలిసినా ఫలితం కనిపించలేదని ఆ బ్యాంక్ ఖాతాదారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 23 సెంటర్లలో వివిధ బ్యాంకులకు చెందిన 23 ఏటీఎంలు ఉండగా, ఏ ఒక్క ఏటీఎం తెరిచి ఉండకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఇక్కట్లు పడుతుండగా తమ ఖాతాలో డబ్బులున్నా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలోని గిరిజనులు కూడా ఏటీఎంల వాడకం ప్రారంభించగా, ప్రస్తుతం ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో వారు తమ అవసరాల నిమిత్తం డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇదే విషయంపై ఆయా బ్యాంకుల యజమానులను కలిసినా ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, డబ్బులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఖాతా ఏ బ్యాంకుదైనా ఆధార్ ద్వారా డ్రా
సాక్షి, ఖమ్మం: ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా ఆధార్‌కార్డు ఆధారంగా నగదు విత్ డ్రా చేసుకునే నూతన సౌకర్యాన్ని పోస్టల్ బ్యాంకు కల్పించినట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉసర్తి యలమందయ్య తెలిపారు. బుధవారం స్థానిక పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రారంభించి ఏడాది పూర్తయిందని, ఈ బ్యాంక్ నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అన్ని వర్గాల ప్రజలు పలు రకాల సేవలు పొందుతున్నారని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంక్ సేవలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని, దేశంలో ప్రతి ఒక్కరికీ, ఇంటి నుంచి బ్యాంక్ సేవలను అందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐపీపీబీని ప్రారంభించిందన్నారు. బ్యాంక్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆధార్ ద్వారా నగదును విత్ డ్రా (ఆధార్ అనే బుల్డ్ పేమెంట్ సిస్టమ్) చేసుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తి ఆ బ్యాంక్‌లో నగదును కలిగి ఉండి బ్యాంక్, ఏటీఎం సౌకర్యాలు లేని ఏ ప్రాంతంలో ఉన్నా మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నా ఆధార్ కార్డ్‌ను చూపించి బయోమెట్రిక్ విధానంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసులోని పోస్టల్ బ్యాంక్‌లో నగదును పొందవచ్చని చెప్పారు. ఈ విధానంలో పోస్టల్ బ్యాంక్ రూ.10 వేల నగదును అందించే సౌకర్యాన్ని కల్పించిందని, ఖాతాదారుడికి ఎలాంటి చార్జీలు కూడా ఉండవని పేర్కొన్నారు. సమావేశంలో ఖమ్మం డివిజన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ ఎ.అనిల్, ఏరియా మేనేజర్ జైల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మరో ఆన్లైన్ మోసం..
డెంకాడ : మండలంలోని గుణుపూరు గ్రామానికి చెందిన మహంతి లక్ష్మికి చెందిన బ్యాంక్ ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ఏపీజీవీబీ డెంకాడ బ్రాంచిలో ఖాతా ఉంది. కొద్ది రోజుల కిందట ఓ అగంతుకుడు నుంచి లక్ష్మికి ఫోన్ వచ్చింది. తాను బ్యాంక్ మేనేజర్‌నని.. మీ ఏటీఎం బ్లాక్ అయిందని.. ఆధార్ నంబర్ చెబితే పునరుద్ధరిస్తామని చెప్పడంతో బాధితురాలు వివరాలు చెప్పింది. అలాగే మరికొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని కోరడంతో బాధితులు చెప్పేశారు. ఇలా రెండేసార్లు చెప్పిన తర్వాత అనుమానం వచ్చిన బాధితులు బ్యాంక్‌లో సంప్రదించగా, వచ్చిన ఫోన్ నకిలీదని తేలింది. అయితే అప్పటికే లక్ష్మి ఖాతా నుంచి రూ. 25 వేలను అగంతుకుడు డ్రా చేసేశాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. -
కరెన్సీ కోసం మన ఎంపీలు కూడా..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చాలా బ్యాంకుల్లో కరెన్సీ నిండుకుంది. వివిధ రాష్ట్రాల్లోనూ చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి. డిమాండ్‌కు సరిపడా కొత్త నోట్లను రిజర్వ్ బ్యాంకు.. బ్యాంకులకు పంపడం లేదు. దీంతో చాలా బ్యాంకుల్లో కేవలం పాత నోట్లను డిపాజట్ చేయించుకుంటున్నారు. జీతం వచ్చినా నెల మొదట్లో నగదు అందుబాటులో లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, వ్యాపారులు అన్ని వర్గాల వారు కరెన్సీ కోసం కష్టాలు పడుతున్నారు. మన ఎంపీలు మాత్రం జీతం రాగానే సరిపడా డబ్బు విత్ డ్రా చేసుకుంటున్నారు. నవంబర్ 30 తేదీన అంటే బుధవారం లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జీతాలు వచ్చాయి. చాలా మంది ఎంపీలు ఆలస్యం చేయకుండా నగదు తీసుకునేందుకు పార్లమెంట్ భవనంలోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లారు. నిన్న 300 మందికి పైగా ఎంపీలు డబ్బు విత్ డ్రా చేసుకున్నారు. వీరిలో చాలామంది వారానికి విత్ డ్రా చేసుకోగలిగే గరిష్ట పరిమితి నగదు తీసుకున్నట్టు ఓ బ్యాంకు అధికారి చెప్పారు. అందరిలాగే అవసరాలకు, ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చేందుకు డబ్బు అవసరమని ఓ సీనియర్ ఎంపీ చెప్పారు. నిన్న రాజ్యసభ వాయిదా పడిన వెంటనే కొందరు ఎంపీలు నేరుగా బ్యాంకు వెళ్లి నగదు తీసుకున్నారు. ఎంపీల రాకతో బ్యాంకు రద్దీగా మారింది. ఎంపీలకు, వారి సిబ్బంది కోసం బ్యాంకు అధికారులు నిరంతరాయం పనిచేసి డబ్బు అందజేశారు. అలాగే పార్లమెంట్‌లోని ఏటీఎంల ముందు సిబ్బంది డబ్బుల కోసం క్యూ కట్టారు. -
నగదు విత్‌డ్రా పై కొత్త ఆంక్షలు
-
బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ..
మెదక్ : ఎస్బీహెచ్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు ఒక్కసారి కన్ఫార్మ్ చేసుకోండని మాయమాటలు చెప్పి అకౌంట్ వివరాలు తీసుకొని అందులోని నగదు అపహరించిన సంఘటన మెదక్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. శంకరంపేట మండలం కమలాపూర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ఎస్బీహెచ్ అకౌంట్ వివరాలు తెలుసుకొని అందులో నుంచి రూ.10 వేలు డ్రా చేసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సుభాష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ఇదే విధంగా మోసపోయానని, ఎస్బీహెచ్ నుంచి మాట్లాడుతున్నామంటే వివరాలు చెప్పానని.. అనంతరం అకౌంట్ చెక్ చేసుకుంటే రూ. 25 వేలు మాయమయ్యాయన్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.