శ్రీనగర్: శ్రీనగర్లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్ధినులను బుర్ఖా వేసుకోకూడదని వారించిన ప్రిన్సిపాల్ కు ఉగ్రవాదుల నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ ప్రినిసిపాల్ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తన వలన ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే మాత్రం క్షమించమని కోరారు.
ఉవ్వెత్తున నిరసన జ్వాల..
విశ్వభారతి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు చెప్పిన వివరాల ప్రకారం సదరు ప్రిన్సిపాల్ మేడమ్ కొంతమంది విద్యార్థినులను మాత్రం స్కూల్లో బుర్ఖా ధరించవద్దని చెప్పేవారట. అది మా ఆచారమని దయచేసి అనుమతించమని పదే పదే వేడుకుంటూనే ఉన్నాము. కానీ ఆమె ఇతర విద్యార్థినులకు అనుమతినిచ్చి మాకు మాత్రమే అనుమతినిచ్చేవారు కాదు. అంతగా కావాలంటే మమ్మల్ని పోయి మదర్సాలో చేరమని చెప్పారు. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ మేము నిరసన చేపట్టామని తెలిపారు.
బెదిరింపులు..
విద్యార్థినుల నిరసన వీడియోలు బాగా వైరల్ అయిన తర్వాత ఉగ్రవాదుల నుండి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫోన్ బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. దీంతో అదేరోజు సాయంత్రం ప్రిన్సిపాల్ విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఇది కూడా చదవండి: కెనడాలో ఇందిరా గాంధీకి ఘోర అవమానం!
Comments
Please login to add a commentAdd a comment