![Miss Universe 2021 Harnaaz Sandhu Comments On Hijab Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/28/Harnaaz-Sandhu.jpg.webp?itok=Rn74IR5a)
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ కౌర్ సంధు.. హిజాబ్ అంశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. హిజాబ్‌తో పాటు పలు అంశాలలో అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం ఆపేయాలంటూ ఆమె సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హిజాబ్ అంశంపై మీ స్పందన ఏంటంటూ ఓ రిపోర్టర్ హర్నాజ్‌సంధును ప్రశ్నించగా.. ఆమె స్పందించారు. మహిళలను వాళ్లకు నచ్చినట్లుగా బతకనివ్వాలంటూ ఆమె.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాళ్లను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. మార్చి 17న ఆమె రాకకు గౌరవంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వాస్తవానికి.. ఆమె మిస్ యూనివర్స్ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలని నిర్వాహకులు ముందుగానే రిపోర్టర్లకు సూచించారు. అయితే ఓ రిపోర్టర్ మాత్రం హిజాబ్‌కు సంబంధించిన ప్రశ్నను అడిగాడు. దీంతో నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆమెను మాట్లాడనివ్వండంటూ రిపోర్టర్ బదులు ఇచ్చాడు. దీంతో ఆమె స్పందించారు.
‘‘నిజాయితీగా చెప్పాలంటే.. మీరు ఎప్పుడూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. హిజాబ్ విషయంలో కూడా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు (అమ్మాయిలు) వాళ్లు ఎంచుకున్న విధంగా జీవించనివ్వండి.. వాళ్ల గమ్యాన్ని చేరుకోనివ్వండి, ఎగరనివ్వండి, ఎందుకంటే అవి వాళ్ల రెక్కలు, వాటిని కత్తిరించవద్దు. ఒకవేళ కత్తిరించాల్సి వస్తే.. మీ రెక్కలు కత్తిరించుకోండి’ అంటూ సమాధానమిచ్చారు ఆమె. అంతేకాదు తన ప్రయాణం, తాను ఎదుర్కొన్న కష్టాలు.. ఇబ్బందుల గురించి ఎదైనా ప్రశ్నలు అడిగితే సంతోషిస్తానని ఆ రిపోర్టర్‌కు బదులిచ్చారు. దీంతో సదరు రిపోర్టర్ గమ్మున ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
हिजाब पर बोलती हुई मिस यूनिवर्स हरनाज़ संधु♥️#Hijab #HarnaazSandhu pic.twitter.com/imSJamLrTh
— Mohd Amir Mintoee (@MAmintoee) March 26, 2022
Comments
Please login to add a commentAdd a comment