
బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలో రోజురోజుకూ ‘మత అసహనం’ పెరుగుతోం దనీ, మైనారిటీలు అభద్రతతో జీవిస్తున్నారనీ మాజీ ఉప రాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ ఇటీవల ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమా రాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలు ప్రపంచంలో మన దేశం గౌరవ మర్యాదలకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి.
మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు ఈ దేశంలో అభద్రతాభావంతో జీవిస్తున్నారనే విషయం వాస్తవ మైందేనా? సంభవించిన, సంభవి స్తున్న పరిణామాలను దృష్టిలో ఉంచు కుంటే– ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లో లేని హక్కులను ఈ దేశ ముస్లింలు అనుభవిస్తున్నారు అనే సంగతి వాస్తవం కాదా? ఈ దేశంలో నూటికి 90 మంది హిందువులు ముస్లింలను తమ దేశ పౌరులుగానే చూస్తున్నారు. మతపరమైన కోణంతో చూడడం లేదు.
దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో 9 శాతం హిందువులు ఉండేవారు. ప్రస్తుతం ఆ దేశంలో హిందూ జనాభా 1.6 శాతం మాత్రమే. బంగ్లాదేశ్‌లో 27 శాతం ఉన్న హిందువులు నేడు 9 శాతానికి పడిపోయారు. భారత్‌లో 8 శాతం ఉన్న ముస్లింలు 18 శాతానికి చేరుకున్నారు. అన్సారీ ఆరోపిస్తున్నట్లు వివక్ష ఉంటే ముస్లింల ఈ స్థితి సాధ్యమయ్యేదేనా? ముస్లిం లకు ఈ దేశంలో భద్రత లేదని వాపోయే అన్సారీ ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ ఇస్లాం శాఖల ప్రజలు భద్రతతో జీవిస్తున్నారని సర్టిఫై చేయగలరా?
ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీలకు భద్రత కరువైందనే ఆరోపణలో వాస్తవ మెంతో చూద్దాం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) రాజకీయ క్షేత్రమైన భారతీయ జనతా పార్టీ ‘సనాతన భారతీయ సంస్కృతి పరిరక్షణ’ అనే సాంస్కృతిక జాతీయవాదాన్ని తన రాజకీయ సిద్ధాం తానికి భూమికగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లౌకికవాద ముసుగు వేసుకున్న బీజేపీ వ్యతిరేక పార్టీలూ, వర్గాలూ... ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల్లో మతోన్మాదాన్ని బీజేపీ నూరిపోస్తుందనే ఒక విషప్రచారాన్ని సాగిస్తున్నాయి.
వాస్తవంగా హిందూ ముస్లిం మత ఘర్షణలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే లెక్క లేనన్ని జరిగాయి. 1990 జనవరి 19న కశ్మీర్ లోయలో జరిగిన నరమేధం, మూడు లక్షల మంది హిందు వులను లోయ నుండి తరిమి వేయడం, హైదరాబాద్ మత ఘర్షణలు; బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాంలలో అధికార మార్పిడి కోసం సృష్టించిన మతకలహాలు... లాంటివన్నీ లౌకికవాదానికి చిరునామా అని చెప్పు కుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే!
ఉల్లి బాలరంగయ్య
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment