బెంగళూరు: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన లైంగిక దాడుల వీడియోల వ్యవహారంలో ప్రధాన నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను హెచ్చరిస్తూ ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ చేసిన ప్రకటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
దేవెగౌడే దగ్గరుండి ప్రజ్వల్‌ను విదేశాలకు పంపించారని ఆరోపించారు. దేవెగౌడ సూచనలతోనే ప్రజ్వల్ జర్మనీ వెళ్లారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకే దేవెగౌడ ఇలాంటి ప్రకటన చేశారని విమర్శించారు.
కాగా, ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది. ప్రజ్వల్ పాస్‌పోర్టును రద్దు చేసేందుకు అవసరమైన చర్యలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ పాస్‌పోర్టు రద్దయితే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment