ఎక్స్‌ప్రెస్‌వే భద్రతపై ఎమ్మెస్సార్టీసీ ప్రత్యేక దృష్టి
నిర్వహణ, మరమ్మతుల పనుల కోసం ప్రత్యేక ఇంజనీర్ల బృందం..
టోల్‌వసూళ్లలో పారదర్శకత కోసం హైటెక్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం
టెండర్లకు ఆహ్వానం..త్వరలోనే అమలుకు రంగం సిద్ధం
దాదర్: ముంబై–పుణే నగరాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం, సురక్షితం కానుంది. ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించే ఇరు నగరాల ప్రయాణికులకు, వాహనాలకు మరింత భద్రత కలి్పంచేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 90 కిలోమీటర్ల పొడవైన ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ వే మెయింటెనెన్స్ పనులు, మరమ్మతులు సకాలంలో జరిగేందుకు, అలాగే టోల్ వసూళ్ల వ్యవస్ధను మరింత మెరుగుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టోల్ వసూళ్లు పారదర్శకంగా జరిగేలా హైటెక్ సిస్టంను ప్రవేశ పెట్టటంతోపాటు, ప్రత్యేకంగా ఇంజనీర్ల బృందాన్ని కూడా నియమించనుంది. టోల్– ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ సిస్టంను అమలుచేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగించనుంది. అందుకు అవసరమైన టెండర్లను ఆహ్వనించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
అదనపు భారం తగ్గించేందుకే...
ముంబై–పుణే నగరాలను అనుసంధానం చేసే ఎక్స్‌ప్రెస్ వే 24 గంటలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రహదారిపై 3+3 లేన్లు, అక్కడక్కడ సర్వీస్ లేన్లు ఉన్నప్పటికీ అవి ఎటూ సరిపోవడం లేదు. దీంతో వాహన యజమానులు, డ్రైవర్లు అసౌకర్యానికి గురికాకుండా ఎక్స్‌ప్రెస్ వే పై ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టడంతోపాటు మార్గ మధ్యలో ఉన్న వంతెనల స్ట్రక్చర్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, క్రాస్ ఓవర్ బ్రిడ్జిల మెయింటెనెన్స్ పనులతోపాటు రహదారి వెంబడి ఉన్న వివిధ రకాల ఏరో మార్క్‌లు (గుర్తులు), దూరాన్ని సూచించే బోర్డుల ఏర్పాటు పనులను కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీకి ఎమ్మెస్సార్టీసీ అప్పగించనుంది.
చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
దేశ ఆర్థిక రాజధాని ముంబై–విద్యా, ఉద్యోగాలతోపాటు వివిధ కళలకు నిలయమైన పుణే నగరాల మధ్య నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, ప్రైవేటు లగ్జరీ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు పికప్ వాహనాలు ఇలా ఎన్ని రవాణా వాహనాలున్నా అవి ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. వీటితోపాటు సరుకులను చేరవేసే భారీ వాహనాలు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రెయిలర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ వే పై వాహనాల భారం అదనంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్ వే మెయింటెనెన్స్, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెస్సారీ్టసీ నిర్ణయించింది.
లాభాలు...
టోల్ నాకాల వద్ద పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయంలో పొడుగాటి క్యూల వల్ల వృథా అవుతున్న విలువైన సమయం హైటెక్ యంత్రాలవల్ల ఆదా కానుంది.
సరైన మెయింటనెన్స్‌తో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గనుంది.
ఎక్స్‌ప్రెస్ వే జీవిత కాలం మరింత పెరగనుంది. వాహనాలకు భద్రత కూడా లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment