strengthened
-
మరింత పటిష్టంగా ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ హైవే
దాదర్: ముంబై–పుణే నగరాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం, సురక్షితం కానుంది. ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగించే ఇరు నగరాల ప్రయాణికులకు, వాహనాలకు మరింత భద్రత కలి్పంచేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 90 కిలోమీటర్ల పొడవైన ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ వే మెయింటెనెన్స్ పనులు, మరమ్మతులు సకాలంలో జరిగేందుకు, అలాగే టోల్ వసూళ్ల వ్యవస్ధను మరింత మెరుగుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టోల్ వసూళ్లు పారదర్శకంగా జరిగేలా హైటెక్ సిస్టంను ప్రవేశ పెట్టటంతోపాటు, ప్రత్యేకంగా ఇంజనీర్ల బృందాన్ని కూడా నియమించనుంది. టోల్– ఆపరేట్–ట్రాన్స్ఫర్ సిస్టంను అమలుచేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగించనుంది. అందుకు అవసరమైన టెండర్లను ఆహ్వనించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అదనపు భారం తగ్గించేందుకే... ముంబై–పుణే నగరాలను అనుసంధానం చేసే ఎక్స్‌ప్రెస్ వే 24 గంటలు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రహదారిపై 3+3 లేన్లు, అక్కడక్కడ సర్వీస్ లేన్లు ఉన్నప్పటికీ అవి ఎటూ సరిపోవడం లేదు. దీంతో వాహన యజమానులు, డ్రైవర్లు అసౌకర్యానికి గురికాకుండా ఎక్స్‌ప్రెస్ వే పై ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టడంతోపాటు మార్గ మధ్యలో ఉన్న వంతెనల స్ట్రక్చర్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, క్రాస్ ఓవర్ బ్రిడ్జిల మెయింటెనెన్స్ పనులతోపాటు రహదారి వెంబడి ఉన్న వివిధ రకాల ఏరో మార్క్‌లు (గుర్తులు), దూరాన్ని సూచించే బోర్డుల ఏర్పాటు పనులను కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీకి ఎమ్మెస్సార్టీసీ అప్పగించనుంది. చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!దేశ ఆర్థిక రాజధాని ముంబై–విద్యా, ఉద్యోగాలతోపాటు వివిధ కళలకు నిలయమైన పుణే నగరాల మధ్య నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు, ప్రైవేటు లగ్జరీ బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు పికప్ వాహనాలు ఇలా ఎన్ని రవాణా వాహనాలున్నా అవి ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. వీటితోపాటు సరుకులను చేరవేసే భారీ వాహనాలు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రెయిలర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ వే పై వాహనాల భారం అదనంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్ వే మెయింటెనెన్స్, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెస్సారీ్టసీ నిర్ణయించింది. లాభాలు...టోల్ నాకాల వద్ద పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయంలో పొడుగాటి క్యూల వల్ల వృథా అవుతున్న విలువైన సమయం హైటెక్ యంత్రాలవల్ల ఆదా కానుంది. సరైన మెయింటనెన్స్‌తో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గనుంది.ఎక్స్‌ప్రెస్ వే జీవిత కాలం మరింత పెరగనుంది. వాహనాలకు భద్రత కూడా లభించనుంది. -
కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరొందిన కుప్పంలో ఆ పార్టీ బీటలువారుతోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీకి వెన్ను విరిగింది. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జగనన్న సంక్షేమ పాలనకు ఆకర్షితులైన ఆ పార్టీ శ్రేణులు భారీగా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం, స్థానిక నాయకుడు ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పని చేసేందుకు టీడీపీ ‘తమ్ముళ్లు’ క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఉనికి కుప్పంలో ప్రశ్నార్థకమవుతోంది. చదవండి: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం జిల్లాలోనే కుప్పం నియోజవర్గం కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కోటకు బీటలు వారాయి. ఇప్పుడు క్రమంగా ఆ కోట కాస్తా కూలుతోంది. నియోజకవర్గంలోని గుడుపల్లె మండలంలో 100 మంది తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. వీరందరూ ఈనెల 5వ తేదీన తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా శనివారం చిత్తూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మరో 234 మంది పార్టీలో చేరారు. అందరికీ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి ఆహా్వనించారు. ఇక మున్ముందు ఇదే తరహాలో ప్రతి గ్రామం నుంచి భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి వలసలు ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. గుడికి అని చెప్పి తీసుకోలేదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 234 మంది పార్టీ కండువా వేసుకున్నారు. సీఎం జగన్ చేసిన మంచి కార్యక్రమాలు, మంత్రి పెద్దిరెడ్డి మీద నమ్మకంతో టీడీపీకి గుడ్‌బై చెప్పేసి, వైఎస్సార్సీపీలో చేరారు. అయితే టీడీపీ తరహాలో మేము గుడికి అని తీసుకెళ్లి పార్టీ కండువాలు కప్పలేదు. ఇప్పుడు మల్లారం నుంచి 156 మంది స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ఇదొక గుణపాఠం. – భరత్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం చంద్రబాబు సీఎంగా అనేక సార్లు ఉన్నా కుప్పం అభివృద్ధి జరగలేదు. అలాంటి కుప్పంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. కుప్పంలో బీసీలు ఎక్కువ. సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు. ఈసారి బీసీ అభ్యర్థి భరత్‌ను తప్పక గెలిపిస్తాం. – మురుగేష్, కుప్పం వైఎస్సార్సీపీ కన్వీనర్ టీడీపీలో మేలు జరగలేదు 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను. ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. నన్ను కనీసం గుర్తించలేదు. కానీ, జగనన్న సీఎం అయ్యాక సంక్షేమ పథకాల ద్వారా నాకు లక్షకుపైగా నగదు అందింది. అందుకే ఈ పార్టీలో చేరాను. – కుప్పన్, మల్లనూరు మాజీ వార్డు సభ్యుడు 37 ఏళ్లుగా టీడీపీలో ఉన్నా టీడీపీలో 37 సంవత్సరాలుగా ఉన్నాను. గతంలో ఎంపీటీసీగా పోటీ చేశాను. కానీ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక చేపట్టిన అభివృద్ధి పనులు నచ్చా యి. ఆయన వల్ల కుప్పం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉంది. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. – నారాయణస్వామి -
గొరిల్లా గ్లాస్-5 వచ్చేసింది!
న్యూయార్క్ః మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ మోడళ్ళ స్మార్ట్ ఫోన్ లు అధునాతన గొరిల్లా గ్లాస్ స్క్రీన్ లను కలిగి ఉంటున్నాయి. ఇలా గొరిల్లా గ్లాస్ ఉన్న ఫోన్లు ఎత్తునుంచీ కింద పడినా స్ర్నీన్ దెబ్బతినదన్న విషయం చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయం. ఈ గ్లాస్ గీతలు పడకుండా కూడా నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు గొరిల్లా గ్లాస్ 5 మరింత మన్నికతో, ధృఢంగా మార్కెట్లోకి ప్రవేశించింది. గ్లాస్ మేకర్ కార్నింగ్.. కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీదారులు తమ పరికరాల్లో ఉపయోగించే ఈ సూపర్ గ్లాస్ ను ఇప్పుడు రసాయనికంగా మరింత ధృఢంగా, బలంగా ఉండేట్టు రూపొందించారు. ఈ కొత్త గ్లాస్.. 1.6 మీటర్ల ఎత్తునుంచీ కిందపడినా 80 శాతం వరకూ పగిలే అవకాశమే ఉండదని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గాడ్జెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు వీలుగా ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను రూపొందించారు. భుజం లేదా నడుము ఎత్తునుంచీ గట్టిగా ఉండే ఉపరితలంపై పడినా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా, గ్లాస్ పగలకుండా ఉండేట్టు తయారు చేసినట్లు పేర్కొన్నారు. 2014 లో కార్నింగ్... గొరిల్లా గ్లాస్ 4 ను ప్రవేశ పెట్టింది. అప్పట్లో ఆ గ్లాస్ ను 1 మీటర్ ఎత్తునుంచి పడినా పగలకుండా, దెబ్బతినకుండా ఉండేట్లు రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త గొరిల్లా గ్లాస్ 5 ను మునుపటికంటే రెండు రెట్లు దృఢంగా రూపొందించినట్లు కార్నింగ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ జాన్ బేన్ తెలిపారు. గొరిల్లా గ్లాస్ ను మొట్టమొదట 2007 లో ఎలెక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించడం ప్రారంభించారు. అప్పట్నుంచీ మరింత మన్నిక పెరిగేలా, గీతల్ని నిరోధించేలా, మరింత పలుచగా తయారు చేసేందుకు కార్నింగ్ సంస్థ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటివరకూ సుమారు 4.5 బిలియన్ల పరికరాల యూనిట్లకు గొరిల్లా గ్లాస్ రవాణా జరిగినట్లు కంపెనీ చెప్తోంది. శాంసంగ్, హెచ్‌టీసీ, హెవావే, ఎల్జీ, హెచ్‌పీ, ఆసుస్ వంటి పేరు పొందిన తయారీదారులతోపాటు.. మరెందరో పేరులేని పరికరాల ఉత్పత్తిదారులు కూడా కార్నింగ్ గ్లాస్ ను ఉపయోగించి పరికరాలు చేస్తున్నట్లు జాన్ తెలిపారు. -
52 పైసలు బలపడిన రూపాయి
ముంబై: డాలర్‌తో రూపాయి మారకం గురువారం 52 పైసలు బలపడింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో రూపాయి బలం పుంజుకోవడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. బ్యాంక్‌లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, స్టాక్ మార్కెట్ లాభపడడంతో మూడు రోజుల రూపాయి నష్టాలకు తెరపడింది. విదేశీ మార్కెట్లో డాలర్ బలహీనపడడం కూడా కలసివచ్చిందని ఒక ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బుధవారం నాటి ముగింపు(68.07) తో పోల్చితే 67.85 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత మరింతగా బలపడి 52 పైసల లాభం(0.76 శాతం)తో 67.55 వద్ద ముగిసింది. అంతకు ముందటి మూడు రోజుల్లో రూపాయి 29 పైసలు నష్టపోయింది. అమెరికా సేవల రంగం ఆశించిన స్థాయిలో లేదన్న గణాంకాల కారణంగా డాలర్ భారీగా క్షీణించింది. -
పటిష్టంగా బ్యాంకింగ్
ముంబై: బ్యాంకింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాం క్(ఆర్బీఐ) వ్యూహ రచన చేస్తోంది. కొత్త బ్యాంకులకు కఠిన ‘ఎంట్రీ’ నిబంధనలతోపాటు, దేశీయ బ్యాంకింగ్ నాలుగు అంచెల పటిష్ట వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు ఉండాలని భావిస్తోంది. ‘భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ-పురోగతికి మార్గం’ అన్న శీర్షికన తాజాగా ఒక చర్చా పత్రాన్ని ఆవిష్కరించింది. నాలుగు అంచెలు ఇలా...: నాలుగు అంచెల వ్యవస్థలో మొదటి వరుసలో విదేశీ బ్యాంక్ బ్రాంచీలుసహా దేశీయ-దేశీయేతర దిగ్గజ బ్యాంకులు 3-4 ఉంటాయి. రెండవ అంచెలో మిడ్-సైజ్ బ్యాంకులు ఉంటాయి. మూడవ కేటగిరిలో ఓల్డ్ సెక్టార్ ప్రైవేటు బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మల్టీ స్టేట్ సహకార బ్యాంకులు పనిచేస్తాయి. చివరి శ్రేణిలో ప్రైవేటు లోకల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఉంటాయి.